For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

budget 2022: బడ్జెట్‌లో క్రిప్టో ట్యాక్స్ రూల్స్‌పై స్పష్టత, నిర్మలమ్మకు లేఖ

|

గత కొన్నాళ్లుగా భారత్‌లో రిటైల్ ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్, బ్యాంకింగ్, మ్యూచువల్ ఫండ్స్, బంగారంతో పాటు క్రిప్టో కరెన్సీలోను పెట్టుబడులు పెడుతున్నారు. దేశంలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీకి సంబంధించి సరైన పన్ను నిబంధనలు లేవు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ నేపథ్యంలో క్రిప్టోకు సంబంధించి కంపెనీల నుండి, ఆర్థికవేత్తల నుండి సూచనలు అందుతున్నాయి. క్రిప్టో కరెన్సీ ట్యాక్స్ రూల్స్ ఉండాలని చెబుతున్నారు.

ఇండియా టెక్ రిప్రజంటేషన్

ఇండియా టెక్ రిప్రజంటేషన్

కన్స్యూమర్ ఇంటర్నెట్ స్టార్టప్స్‌కు సంబంధించిన ఇండస్ట్రీ అసోసియేషన్ ఇండియా టెక్... నిర్మలమ్మకు క్రిప్టో కరెన్సీ పన్నుకు సంబంధించి లేఖ రాశారు. కేంద్ర బడ్జెట్ 2022-23లో క్రిప్టో ట్యాక్సేషన్ పైన స్పష్టత అవసరమని తెలిపారు. ఇండియా టెక్ అన్ని ప్రముఖ క్రిప్టో కరెన్సీ ఎక్స్చేంజీలకు ప్రాతినిథ్యం వహిస్తుంది. కొన్ని క్రిప్టో ఎక్స్చేంజీలు వస్తు, సేవల పన్ను ఎగవేత స్కానర్ కిందకు వచ్చాయి. అయితే ఈ బాడీలో కాయిన్ స్విచ్ కుబేర్, వాజిర్ఎక్స్, కాయిన్ డీసీఎక్స్ ఉన్నాయి.

పన్ను చట్టాల సర్దుబాటు

పన్ను చట్టాల సర్దుబాటు

క్రిప్టో ఆస్తులను చేర్చడానికి ఇప్పటికే ఉన్న పన్ను చట్టాలను సర్దుబాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. పన్నుల ట్యాక్సేషన్, డిస్‌క్లోజర్స్ గురించి స్పష్టతను కోరింది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన క్రిప్టో కరెన్సీ బిల్లు 2021 ఇప్పటికే ఆలస్యమైన నేపథ్యంలో ఈ లేఖ వచ్చింది. బడ్జెట్‌లో క్రిప్టో పన్నులకు సంబంధించి స్పష్టత అవసరమని, లేదంటే గందరగోళంగా ఉంటుందని ఇండియాటెక్ ప్రెసిడెంట్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ రమీష్ కైలాసం అన్నారు. మనం బిల్లు కోసం మాత్రమే వేచి చూడవద్దని, బడ్జెట్ ప్రక్రియను ఇందుకు సంబంధించి ప్రారంభించాలన్నారు.

క్రిప్టో పెట్టుబడులు

క్రిప్టో పెట్టుబడులు

డైరెక్టర్ జనరల్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్, కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ పరిధిలోని ఒక చట్టాన్ని అమలు చేసే సంస్థ క్రిప్టో కరెన్సీని పరిశీలిస్తోంది. గత నెలలో జీఎస్టీ డిపార్టుమెంట్ క్రిప్టో ఎక్స్చేంజ్ వాజీర్ఎక్స్ పైన రూ.40 కోట్ల జరిమానాను విధించింది. ఇటీవల దేశంలో క్రిప్టో ఇన్వెస్ట్‌మెంట్స్ భారీగా పెరుగుతున్న విషయం తెలిసిందే. బిట్ కాయిన్, ఎథేరియం వంటి క్రిప్టోల్లో పెట్టుబడులు పెరుగుతున్నాయి.

English summary

budget 2022: బడ్జెట్‌లో క్రిప్టో ట్యాక్స్ రూల్స్‌పై స్పష్టత, నిర్మలమ్మకు లేఖ | Startup grouping IndiaTech writes to FM, seeks crypto tax rules in Budget

IndiaTech, an industry association representing consumer internet startups, has written to Finance Minister Nirmala Sitharaman, seeking clarity on crypto taxation in Union Budget 2022-23.
Story first published: Monday, January 17, 2022, 14:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X