ఇండియా లో కరోనా విలయతాండవం చేస్తున్నా... స్టార్టుప్ కంపెనీలు మాత్రం నిధుల సమీకరణ లో బిజీ గా ఉంటున్నాయి. మంచి ఐడియా కు తోడు భవిష్యత్ అవకాశాలు పుష్కలంగా ఉన్న స్టార్టుప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. దీనికి కరోనా పెద్ద అడ్డంకిగా లేకపోవటం విశేషం. గత వారం రోజుల్లోనే ఇండియా కు చెందిన పలు స్టార్టుప్ కంపెనీలు సంయుక్తంగా సుమారు రూ 700 కోట్ల పెట్టుబడులు రాబట్టి ఔరా అనిపిస్తున్నాయి.
కరోనా మొదలైన కొత్తలో చాలా స్టార్టుప్ కంపెనీలకు భవిష్యత్ లేదని, పెట్టుబడులు సమీకరించటం చాలా కష్టమని భావించారంతా. అయినా సరే మన స్టార్టుప్ కంపెనీలు తమ సత్తా చాటుకున్నాయి. ఇన్వెస్టర్ల మనసు గెలిచి వారి నుండి నిధులను రాబట్టాయి. మిగతా స్టార్టప్ కంపెనీలకు ఆదర్శంగా నిలిచాయి. ఈ పరిణామం స్టార్టప్ కంపెనీలను స్థాపించి పెట్టుబడుల సమీకరణ కోసం వేచి చూస్తున్న అనేక కంపెనీలకు ఆదర్శంగా నిలుస్తుండటం విశేషం.

17 స్టార్టప్ కంపెనీలు..
గత వారం లో మొత్తం 17 స్టార్టుప్ కంపెనీలు ఇన్వెస్టర్ల నుంచి మొత్తంగా 93 మిలియన్ డాలర్ల (సుమారు రూ 698 కోట్లు) నిధులను సమీకరించాయి. ఈ మేరకు ఎంట్రాకర్ ఒక ప్రత్యేక కథనం ప్రచురించింది. దాని ప్రకారం మొత్తం 17 కంపెనీలకు గాను 12 సంస్థలు తమ పెట్టుబడి వివరాలను వెల్లడించగా మరో 5 సంస్థలు మాత్రం వివరాలు వెల్లడించలేదు. జోలో స్టేస్ అనే స్టార్టుప్ కంపెనీ అత్యధికంగా 56 మిలియన్ డాలర్ల (రూ 420 కోట్లు) నిధులను సమీకరించి ఆహా అనిపించింది. ఈ స్టార్టుప్ కంపెనీ కో లివింగ్ హోమ్స్, హోమ్ రెంటల్ సేవలు అందింస్తోంది. ఇన్వెస్ట్ కార్ప్, మీరే అసెట్స్, త్రిఫెక్టా కాపిటల్ ఈ నిధులను సమకూర్చాయి. మొత్తం 17 స్టార్టుప్ కంపెనీలు కలిసి సమీకరించిన నిధుల్లో దాదాపు సగం ఈ ఒక్క స్టార్టుప్ కంపెనీయే సాధించటం విశేషం.

క్యూ మ్యాత్ లోకి కూడా...
ఆన్లైన్ లో మాథెమాటిక్స్ క్లాసెస్ చెప్పే ప్రముఖ స్టార్టుప్ కంపెనీ క్యూ మ్యాత్ లోకి కూడా నిధులు సమకూరాయి. త్రిఫెక్టా కాపిటల్ అనే సంస్థ 2.9 మిలియన్ డాలర్ల (సుమారు రూ 22 కోట్లు) పెట్టుబడి పెట్టింది. సిరీస్ బీ ఫండింగ్ రౌండ్ లో భాగంగా ఇప్పటికే పెట్టుబడి పెట్టిన సంస్థలు ఇందులో పాల్గొనటం విశేషం. మరోవైపు ప్రముఖ ఫిన్ టెక్ కంపెనీ ఆయె ఫైనాన్స్ లోకి 16.6 మిలియన్ డాలర్ల (సుమారు రూ 125 కోట్లు) నిధులు వచ్చాయి. జర్మనీ కి చెందిన ఇన్వెస్ట్ ఇన్ విజన్ సంస్థ ఈ మేరకు పెట్టుబడి పెట్టింది. మొత్తం నిధుల సమీకరణ లో ఆయె ఫైనాన్స్ రెండో స్థానంలో నిలిచి రికార్డు సృష్టించింది. దీంతో దేశంలో ఫిన్ టెక్ కంపెనీలకు డిమాండ్ మెరుగ్గానే ఉందని మరోసారి నిరూపితమైంది.

వాటిలోకి కూడా..
ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులను రాబట్టిన కంపెనీల్లో షాప్ 101 (2.2 మిలియన్ డాలర్లు), సైబర్ సెక్యూరిటీ కంపెనీ సెక్యూర్ డెన్ (1.2 మిలియన్), సాస్ బేస్డ్ స్టార్టుప్ జో మొమెంటుమ్ (4.1 మిలియన్), కార్స్ 24 ఫైనాన్సియల్ సర్వీసెస్ (1.3 మిలియన్), పిగ్గే రైడ్ (1.86 మిలియన్ డాలర్లు), టీ విక్రయించే చాయ్ వాలే (0.23 మిలియన్), బ్లూ స్కై అనలిటిక్స్ (1.2 మిలియన్ డాలర్లు), ఫ్రాంటియర్ మార్కెట్స్ (2.25 మిలియన్ డాలర్లు), స్పెక్స్ మేకర్స్ (3 మిలియన్ డాలర్లు) ఉన్నాయి. ఇవి కాకుండా నోటో, గ్రీన్ క్యూర్, ఎదుస్క్, డిసెంట్రో, టాగ్ హైవ్ అనే సంస్థలు కూడా ప్రైవేట్ ఈక్విటీ నిధులను సమీరించినప్పటికీ అవి ఎంత పెట్టుబడులను సమీకరించిందీ వెల్లడించలేదు.
More From GoodReturns

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

Gold: మీరు గమనించారా? మోహన్ లాల్, అభిషేక్ శర్మ బంగారు నగలు ఎందుకు ధరిస్తున్నారు?

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications