For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారికి భవిష్యత్ ఉండదు.. స్టార్టప్ లకు రతన్ టాటా వార్నింగ్!

|

వినూత్న ఐడియాలతో ముందుకు వచ్చి స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేసే ఫౌండర్లకు ప్రముఖ పారిశ్రామికవేత్త, టాటా గ్రూప్ గౌరవ చైర్మన్, ఇన్వెస్టర్ ఐన రతన్ టాటా వార్నింగ్ ఇచ్చారు. ఐడియాలు నచ్చి ఇన్వెస్టర్లు పెద్ద మొత్తంలో స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెడతారని, కానీ వారు పెట్టుబడి తీసుకుని పారిపోతే ... ఇక భవిష్యత్ లో వారికి సెకండ్ ఛాన్స్ దొరకదని హెచ్చరించారు. ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. మన దృష్టిని ఆకర్షించే కొన్ని స్టార్టుప్ కంపెనీలు ఉంటాయి. వాటికీ పెట్టుబడి అందిస్తాం. కానీ, పెట్టుబడి తీసుకుని తర్వాత మాయం అవుతాయి. అలాంటివాటికి ఇక రెండో, మూడో ఛాన్స్ దొరకదు అని రతన్ టాటా ఘాటుగా వ్యాఖ్యానించారు. ముంబై లో జరిగిన టైకాన్ కార్యక్రమంలో రతన్ టాటా కు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అందజేశారు. ఆ కార్యక్రమంలో మాట్లాడిన రతన్ టాటా పైవిధంగా వ్యాఖ్యానించటం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ మేరకు ప్రముఖ న్యూస్ ఏజెన్సీ ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా (పీటీఐ) ఒక కథనాన్ని ప్రచురించింది.

వారే భవిష్యత్ లీడర్లు...

వారే భవిష్యత్ లీడర్లు...

రతన్ టాటా స్వయంగా కొన్ని కంపెనీల్లో పెట్టుబడులు పెట్టారు. ప్రముఖ రైడ్ హైలింగ్ కంపెనీ ఓలా, పేమెంట్ సేవల కంపెనీ పేటీఎం, అర్బన్ లాడెర్ వంటి స్టార్టుప్ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పటి వరకు అయన సుమారు 20 కి పైగా స్టార్టుప్ కంపెనీలకు పెట్టుబడి అందించారు. అయితే, ఇటీవల ఇండియా లో ఏర్పాటైన 90 శాతానికి పైగా స్టార్టుప్ కంపెనీలు కాష్ బర్న్ (నష్టాలు) చేస్తున్నాయి. యునికార్న్ కంపెనీలుగా చెప్పుకునే ఫ్లిప్కార్ట్ వంటి కంపెనీలు కూడా ఇందుకు అతీతం ఏమి కాదు. ఫ్లిప్కార్ట్ విషయానికి వస్తే... నెలకు సుమారు 150 మిలియన్ డాలర్ల (రూ 1,050 కోట్లు) కాష్ బర్న్ చేస్తుంది. ఇదిలా ఉండగా, పాత తరం కంపెనీలు క్రమంగా వెనుకబడిపోతాయని, కేవలం ఇన్నోవేటివ్ స్టార్టుప్ కంపెనీలను నడిపే ఫౌండర్లే భవిష్యత్ లీడర్లు అవుతారని రతన్ టాటా అభిప్రాయపడ్డారు.

మెంటరింగ్ అవసరం...

మెంటరింగ్ అవసరం...

కొత్త తరహా వ్యాపారాలు ప్రారంభించే ఫౌండర్లకు తగినంత గైడెన్స్, మెంటార్ షిప్ అవసరమని రతన్ టాటా పేర్కొన్నారు. వారికి సరైన సలహాలు, సూచనలు ఇచ్చే మార్గదర్శులు ఉంటే వారు అద్భుతాలు చేయగలరని చెప్పారు. వీటితో పాటు స్టార్టప్ కంపెనీలు తగినంత గుర్తింపు సాధించుకోవాలని సూచించారు. అలాగే నెట్వర్కింగ్ అభివృద్ధి చేసుకోవాలని చెప్పారు. స్నాప్ డీల్ వంటి ఈ కామర్స్ కంపెనీలో కూడా రతన్ టాటా పెట్టుబడి పెట్టారు. రాత్రికి రాత్రికి పైకెళ్లాలని ఆలోచించే వారికంటే, ఎథికల్ గా పనిచేసే వారే బెటర్ అన్న అభిప్రాయాన్ని వెల్లడించారు. నెట్ వర్కింగ్ వల్ల కొత్త ఆలోచనలు రావటంతో పాటు, మన ఆలోచనలపై విమర్శనాత్మక సూచనలు పొందే అవకాశం కూడా ఉంటుందని చెప్పారు.

షాడో రెగ్యులేటరీ...

షాడో రెగ్యులేటరీ...

స్టార్టుప్ ల కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ది ఇండస్ ఎంట్రెప్రేనేర్స్ (టై) కు రతన్ టాటా అభినందనలు చెప్పారు. స్టార్టుప్ ల రంగంలో ఎథిక్స్ కాపాడేందుకు, గుడ్ ప్రాక్టీసెస్ అభివృద్ధి చేసేందుకు, అవి ఏ స్థాయిలో వృద్ధి చెందాలో అంత స్థాయికి చేరుకునేలా స్టార్టుప్ కంపెనీలకు చేయూత నిచ్చేందుకు టై మరింతగా కృషి చేయాలనీ సూచించారు. అందుకోసం టై ఒక షా డో రెగ్యులేటరీ (నియంత్రణ సంస్థ) లా రూపాంతరం చెందాలని రతన్ టాటా ఆకాంక్షించారు. ఇదిలా ఉండగా ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త నారాయణ మూర్తి చేతుల మీదుగా రతన్ టాటా లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ను స్వీకరించారు. సో, అదే పనిగా కాష్ బర్న్ చేసే స్టార్టుప్ కంపెనీలూ ఇకనైనా కాస్త జాగ్రత్తగా ఉండండి మరి. లేదంటే మరో ఛాన్స్ ఉండదట.

English summary

వారికి భవిష్యత్ ఉండదు.. స్టార్టప్ లకు రతన్ టాటా వార్నింగ్! | Start ups that burn investor money, disappear won't get second chance: Ratan Tata

Industrialist Ratan Tata on Tuesday warned that start-ups which burn investors' money and disappear will not get a second or a third chance. Tata, who also invests in start-ups, also said old-age businesses will recede and the young founders of innovative companies are the future leaders of the Indian industry.
Story first published: Wednesday, January 29, 2020, 19:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X