For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టార్టప్స్‌లో 2022లో 60,000 ఉద్యోగాల కోత, అమెరికాలోను ఇదే

|

భారత స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి! 2022 క్యాలెండర్ ఏడాదిలో ఈ స్టార్టప్స్ 60,000 మంది ఉద్యోగులను తొలగించే పరిస్థితి కనిపిస్తోందని ఓ నివేదిక వెల్లడిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా అలుముకుంటున్న ఆర్థికమాంద్యం భయాలు స్టార్టప్స్‌కు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ కంపెనీలను నిధుల కొరత వేధిస్తోంది. ఇప్పటికే పలు కంపెనీలు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియను చేపట్టగా, మొత్తంగా ఈ ఏడాదిలో 60వేల మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు చెబుతోంది.

ఎడ్‌టెక్, ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్ ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ఇప్పటికే 12వేల వరకు ఉద్యోగులను తొలగించాయి. ఇందులో ఓలా, బ్లింకిట్, బైజూస్, అన్-అకాడమీ, వేదాంతు, కార్స్ 24, మొబైల్ ప్రీమియర్ లీగ్, లిడో లెర్నింగ్, ఎంఫైన్, ట్రెల్, ఫార్ఐ, ఫర్లాంకో తదితర కంపెనీలు ఉన్నాయి. ఖర్చుల, పునర్వ్యవస్థీకరణ పేరిట పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించే అవకాశముంది.

Start ups may see over 60,000 job losses in 2022

కేవలం మన దేశంలోనే కాదు. అగ్రరాజ్యం అమెరికా సహా ప్రపంచవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. అమెరికాకు చెందిన నెట్ ఫ్లిక్స్, రాబిన్ హుడ్ కూడా ఉద్యోగులను తగ్గించే ప్రక్రియను చేపట్టాయి. అమెరికా టెక్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉందని నివేదికలు చెబుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ తమ ఉద్యోగుల సంఖ్యలో నాలుగు శాతాన్ని తొలగించింది. పేపాల్, రాబిన్ హుడ్, వర్జిన్ హైబర్ లూప్స్ కూడా వందల మందిని తొలగించాయి.

English summary

స్టార్టప్స్‌లో 2022లో 60,000 ఉద్యోగాల కోత, అమెరికాలోను ఇదే | Start ups may see over 60,000 job losses in 2022

As startups in India keep firing their staff to navigate through the funding winter, India may see more than 60,000 job losses in 2022 alone, led by edtech and e-commerce platforms, according report.
Story first published: Tuesday, July 5, 2022, 8:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X