విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సూపర్ ఆఫర్ ప్రకటించిన స్పైస్‌జెట్.. ప్రయాణం పండగే..
SpiceJet: అసలే ఈ రోజుల్లో ఇంధన ధరల పెరుగుదల కారణంగా ప్రయాణ ఖర్చులు ఆకాశాన్ని అంటాయి. అనేక మందికి ఇవి మోయలేని భారంగా మారాయి. ఇలాంటి సమయంలో విమానయాన సంస్థ స్పైస్‌జెట్ విమానయాన తన వినియోగదారుల కోసం ప్రత్యేక ఆఫర్‌తో ముందుకొచ్చింది. కంపెనీ యాడ్-ఆన్ సర్వీసెస్ పై 25 శాతం తగ్గింపును అందిస్తోంది. ఈ ఆఫర్ సెప్టెంబర్ 30, 2022 వరకు చెల్లుబాటులో ఉంటుందని కంపెనీ వెల్లడించింది.
ఈ ఆఫర్ SpiceMAX, Seat, Priority Check In, Preferred Bag Out వంటి యాడ్-ఆన్ ఉత్పత్తులపై అందుబాటులో ఉంటుంది. కంపెనీ వెబ్‌సైట్ ద్వారా చేసే ఆన్‌లైన్ బుకింగ్‌లతో పాటు యాడ్-ఆన్ సేవలను కొనుగోలు చేయడానికి మాత్రమే ఈ తగ్గింపు వర్తిస్తుంది. ఈ ఆఫర్ వన్ వే, రౌండ్ ట్రిప్ బుకింగ్ లపై అందుబాటులో ఉంది. ఈ ఆఫర్‌ను మరే ఇతర స్కీమ్‌తో కలపడం సాధ్యం కాదని కంపెనీ స్పష్టం చేసింది.

ఈ ఆఫర్ కోడ్ వాడండి..
విమాన ప్రయాణికులు ఈ ఆఫర్‌ను సద్వినియోగం చేసుకోవడానికి.. బుకింగ్ చేసేటప్పుడు ప్రోమో కోడ్ ADDON25ని ఉపయోగించుకోవాలని స్పైస్‌జెట్ తెలిపింది. దీని కింద బుకింగ్ సమయంలో మాత్రమే కొనుగోలు చేసే యాడ్-ఆన్ సేవలపై 25% తగ్గింపు అందుబాటులో ఉంటుంది. దేశీయ, అంతర్జాతీయ విమానాల్లో ఈ ఆఫర్‌ను పొందవచ్చు. ఈ ఆఫర్‌ను ఎప్పుడైనా సవరించే, రద్దు చేసే లేదా ఉపసంహరించుకునే హక్కు తమకు ఉందని కంపెనీ పేర్కొంది.
ఛార్జీలు పెరిగినా.. ప్రయాణికులు పెరిగారు..
క్రూడ్ ఆయిల్ కారణంగా ఇటీవల విమాన ప్రయాణీకుల విమాన టిక్కెట్ ధరలు ఐదు రెట్లు పెరిగాయి . అయినప్పటికీ.. దేశీయ ప్రయాణీకుల సంఖ్య గణనీయంగా పెరిగింది. మే నెలలో విమాన ట్రాఫిక్ ఐదు రెట్లు పెరిగింది. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) డేటా ప్రకారం.. మే 2021లో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య 21 లక్షలు మాత్రమే. అది ఈ ఏడాది మేలో 1.20 కోట్లకు చేరుకుంది. అంటే.. గతేడాదితో పోలిస్తే దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్య దాదాపు ఐదు రెట్లు పెరిగింది.