కరోనా మహమ్మారి కారణంగా భారీగా నష్టపోయిన రంగాల్లో పర్యాటకం, విమానయాన రంగాలు ఉన్నాయి. ఈ రంగాల్లో వ్యాపారాలు లేక ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే పరిస్థితులు కూడా లేవు. జాతీయ, అంతర్జాతీయ విమానాలు పూర్తిగా నిలిచిపోయాయి. ఈ నేపథ్యంలో వరుసగా విమానయాన సంస్థలు వేతన కోత ప్రకటనలు చేస్తున్నాయి. ఇప్పటికే ఎయరిండియా, గోఎయిర్, ఇండిగో, ఈ ప్రకటన చేయగా తాజాగా స్పైస్ జెట్ కూడా శాలరీ కట్ ప్రకటన చేసింది.

వేతనం తక్కువగా ఉంటే ఊరట
తమ ఉద్యోగులకు మార్చి నెల శాలరీకి గాను 30 శాతం ఉద్యోగాల కోతను విధించనున్నట్లు స్పైస్ జెట్ తెలిపింది. అయితే తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులకు మినహాయింపు ఇచ్చింది. ఈ మేరకు స్పైస్ జెట్ సీఎండి అజయ్ సింగ్ మాట్లాడుతూ... అధిక వేతనాలు ఉన్న వారికి శాలరీ కట్ ఉంటుందని తెలిపారు.

ఉద్యోగాల తొలగింత లేదు
ఉద్యోగులకు భారీగా ఊరటనిచ్చే ప్రకటన కూడా స్పైస్ జెట్ చేసింది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో ఉద్యోగుల తొలగింపు ఉండదని స్పష్టం చేసింది. కేవలం వేతన కోత మాత్రమే ఉంటుందని తెలిపింది. శాలరీ కట్ 10 శాతం నుండి 30 శాతం అమలు చేస్తామని తెలిపింది. మిడ్ టర్మ్ ఉద్యోగుల నుండి టాప్ ఉద్యోగుల వరకు ఈ కట్టింగ్ అమలు చేస్తామని పేర్కొంది.

అత్యధికంగా 30 శాతం
తక్కువ వేతనం ఉన్న ఉద్యోగులపై ఈ ప్రభావం ఉండదని స్పైస్ జెట్ హామీ ఇచ్చింది. కరోనా సంక్షోభం నేపథ్యంలో కంపెనీ ఎండీ అజయ్ సింగ్ వేతనం అత్యధికంగా 30 శాతం తగ్గించాలని నిర్ణయించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో తెలిపింది.

లీవ్ వితౌట్ పే
మార్చి 25వ తేదీ నుండి 31వ తేదీ వరకు లాక్ డౌన్ నేపథ్యంలో ఉద్యోగులకు వేతనాలు లేని లీవ్ ఇవ్వవలసిన పరిస్థితులు వచ్చాయని, అన్ని పాసింజర్ విమానాలు కూడా నిలిపివేశామని తెలిపింది. అయితే కార్గో, గ్రౌండ్ స్టాఫ్, క్రూ వంటి కొందరు ఉద్యోగులు ఈ సమయంలోను పని చేశారని, వారిపై ప్రభావం ఉండదని తెలిపింది. వారి వేతనాలు క్రెడిట్ అవుతాయని చెప్పింది.

కఠిన నిర్ణయాలు..
కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు స్పైస్ జెట్ కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చిందని స్పైస్ జెట్ తెలిపింది. ఆర్థిక ప్రభావాన్ని తగ్గించుకునేందుకు ప్రభుత్వం నుండి విమానయాన సంస్థలు కొంత సాయం కోరాయని తెలిపింది. స్వదేశీ, అంతర్జాతీయ విమానయాన సంస్థలు ప్రస్తుతం అత్యంత కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నాయని తెలిపింది.
More From GoodReturns

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

క్రెడిట్ కార్డ్ లాంజ్ యాక్సెస్ నిబంధనలు మారాయి: ప్రయాణికులకు షాక్

JD Vance: ముగిసిన చర్చలు! ఆ విషయంలో తగ్గేదేలే అంటున్న ఇరాన్.. యుద్ధం మళ్లీ మొదలైనట్టేనా?

Personal loan: బ్యాంకులు మీ లోన్ అప్లికేషన్ను ఎందుకు తిరస్కరిస్తున్నాయి? అసలు గుట్టు విప్పిన ఆర్థిక నిపుణులు!

బంగారం ధరల ఈ స్థాయికి వస్తేనే కుప్పకూలుతాయి..లేదంటే 7 వేల డాలర్ల పైమాటే, స్విస్ బ్యాంక్ నుంచి సంచలన నివేదిక..

Trading: యుద్ధం మీద బెట్టింగ్.. గంటల్లోనే లక్షాధికారులు! అసలేం జరిగిందంటే..

బెంగళూరు రియల్ ఎస్టేట్.. మెట్రో బ్లూ లైన్ రాకతో ఈ ఏరియాలో ఇళ్ల కోసం ఎగబడుతున్న ఇన్వెస్టర్లు..

Bengaluru: బెంగళూరు వాహనదారులకు అలర్ట్! ఆ రూట్లో ఫ్లైఓవర్ 84 గంటలు బంద్!



Click it and Unblock the Notifications