For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు: 2.5 లక్షల డాలర్లతో సెటిల్‌మెంట్

|

వాషింగ్టన్: ప్రైవేట్ అంతరిక్ష పరిశోధనా సంస్థ స్పేస్ఎక్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ తయారీ కంపెనీ టెస్లా అధినేత ఎలాన్ మ‌స్క్ కొద్దరోజులుగా తరచూ వార్తల్లో నిలుస్తోన్నారు. ప్రత్యేకించి- టాప్ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ట్విట్టర్ కొనుగోలు వ్యవహారం తెరమీదికి వచ్చిన తరువాత ఆయన పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగిపోతోంది. ట్విట్టర్ కొనుగోలు కోసం ప్రతిపాదనం చేయడం, దానికి ఆ ప్లాట్‌ఫామ్ మేనేజ్‌మెంట్ అంగీకరించడం.. తదనంతర పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ప్రస్తుతానికి ఈ టేకోవర ప్రయత్నాలను ఎలాన్ మస్క్ తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే.

ఇదిలావుండగా- ఇప్పుడు తాజాగా మరోసారి ఎలాన్ మస్క్ వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. దీనికి కారణం- ఆయనపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు. స్పేస్‌ఎక్స్‌ సంస్థలో పని చేసిన ఓ మహిళా ఉద్యోగినిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. 2016 నుంచీ ఆరోపణలను ఆయనను వెంటాడుతూనే ఉన్నాయి. స్పేస్ఎక్స్ కార్పొరేట్ జెట్ విభాగంలో ఫ్లైట్ అటెండెంట్‌గా పని చేసిన ఓ కాంట్రాక్ట్ ఉద్యోగినిని లైంగిక వేధింపులకు గురి చేశారని, ఈ కేసు చాలా దూరం వెళ్లిందంటూ వార్తలొచ్చాయి.

SpaceX paid an employee $2,50,000 to settle a claim she was sexually harassed by Elon Musk in 2016

దీన్ని మూడోకంటికి తెలియకుండా ఎలాన్ మస్క్- సెటిల్ చేసుకున్నాడంటూ తాజాగా అమెరికన్ మీడియా వెల్లడించింది. దీనిపై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2018లో ఎలాన్ మస్క్ ఓ ఫ్లైట్ అటెండెంట్‌కు 2,50,000 డాలర్లను చెల్లించినట్లు పేర్కొంది. దీనిపై స్పేస్‌ఎక్స్ యాజమాన్యం వివరణ కోసం ప్రయత్నించగా.. ఇప్పటివరకు స్పందించలేదని తెలిపింది అమెరికన్ మీడియా. ఎలాన్ మస్క్‌కు వివరణ కోసం ప్రయత్నించినప్పటికీ ఆయన అందుబాటులోకి రాలేదని, ఆయన వ్యక్తిగత వ్యవహారాలనను పర్యవేక్షించే అలెక్స్ స్పైరో అనే మేనేజర్ కూడా దీనిపై స్పందించలేదని పేర్కొంది.

ప్రైవేట్ జెట్‌లో ప్రయాణిస్తోన్న సమయంలో ఎలాన్ మస్క్- ఫ్లైట్ అటెండెంట్‌ను ప్రలోభపెట్టారు. విమానంలో ప్రత్యేక గదిలో తనతో గడపాల్సిందిగా ఆయన ఒత్తిడి తెచ్చారని, బాధితురాలి స్నేహితుడిని ఉటంకిస్తూ ఈ కథనాన్ని ప్రచురించింది యూఎస్ మీడియా. ఆ తరువాత కూడా కొన్ని ఎరోటిక్ మెసేజీలను ఆమెకు పంపించే వాడని తెలిపింది. ఈ విషయం వెలుగులోకి రావడంతో 2018లో రెండున్నర లక్షల డాలర్లను చెల్లించి- ఈ వ్యవహారాన్ని సెటిల్ చేసుకున్నట్లు పేర్కొంది.

English summary

ఎలాన్‌ మస్క్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు: 2.5 లక్షల డాలర్లతో సెటిల్‌మెంట్ | SpaceX paid an employee $2,50,000 to settle a claim she was sexually harassed by Elon Musk in 2016

SpaceX paid an employee $250,000 to settle a claim she was sexually harassed by Elon Musk in 2016, according to a report from Insider.
Story first published: Friday, May 20, 2022, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X