For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.1 లక్ష లోపు ఖర్చుతో 25 ఏళ్ళ పాటు ఉచిత విద్యుత్! పెరుగుతున్న కరెంటు బిల్లులకు చెక్

|

కరోనా లాక్ డౌన్ తో అందరం ఇండ్లకే పరిమితం అవుతున్నాం. ఇంట్లో నుంచే పని చేస్తుండటం (వర్క్ ఫ్రొం హోమ్) వల్ల ఇంటి కరెంటు బిల్లులు బాగా పెరిగిపోయాయి. బల్బులు, టీవీలు, ఏసీ లు సాధారణం కంటే ఎక్కువ సేపు పనిచేస్తుండటంతో సహజంగానే విద్యుత్ బిల్లులు అమాంతం పెరుగుతున్నాయి. ఈ పరిస్థితి మరింత కాలం కొనసాగే అవకాశం ఉంది. అయితే ఇలాంటి సందర్భంలో అవకాశం ఉన్నవారు ఇంటి పైకప్పు పై సోలార్ రూఫ్ టాప్ పానెల్స్ ఏర్పాటు చేసుకుంటే మేలంటున్నారు ఈ రంగంలో నిమగ్నమైన హైదరాబాద్ కు చెందిన స్టార్టుప్ కంపెనీ - ఫ్రెయర్ ఎనర్జీ కో ఫౌండర్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సౌరభ్ మర్దా. గుడ్ రిటర్న్స్ కు ఆయన ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూ లో సోలార్ పవర్ వల్ల కలిగే లాభాలు, అయ్యే వ్యయం, దాంతో వినియోగదారులకు లభించే ప్రయోజనం, ప్రభుత్వం అందించే సబ్సిడీ వంటి వివరాలు వెల్లడించారు. మీ కోసం ఆ వివరాలు.

ఆఫీస్‌లకు టెక్కీలు.. ఎవరు వస్తారు.. ఎవరు వర్క్ ఫ్రమ్ హోమ్? డిసైడ్ చేస్తున్న ఐటీ కంపెనీలు

ఒక్క క్లిక్ తో ఇన్స్టలేషన్...

ఒక్క క్లిక్ తో ఇన్స్టలేషన్...

సోలార్ పవర్ పై చాలా మందికి అవగాహన ఉన్నప్పటికీ.. తమ ఇంటిపైనే సోలార్ పవర్ సిస్టం బిగించుకుని పూర్తిస్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవటంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అందుకే, ఆసక్తి ఉండీ సోలార్ రూఫ్ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకోలేక పోతున్న వారికోసం ఫ్రెయర్ ఎనర్జీ ఒక ప్రత్యేక మొబైల్ ఆప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సన్ ప్రో ప్లస్ పేరుతో అందుబాటులోకి తెచ్చిన ఈ మొబైల్ ఆప్ లోకి వెళ్లి ఒక్క బటన్ క్లిక్ చేస్తే చాలు సోలార్ కు సంబంధించిన సమస్త సమాచారం లభిస్తుంది. అక్కడే మీకు కావాల్సిన ప్రొడెక్టు ను ఆర్డర్ చేయవచ్చు. కంపెనీ వాళ్ళే మీ ఇంటిని వచ్చి మిగితా ఏర్పాట్లు చేస్తారు. సబ్సిడీ కోసం పేపర్ వర్క్ కూడా వాళ్ళే చేసి పెడతారు. మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్ నుంచి సబ్సిడీ మినహాయించుకుని మిగిలిన మొత్తాన్ని మాత్రమే కస్టమర్ చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో కంపెనీ 300 కు పైగా ప్రముఖ సంస్థలకు కూడా తమ సేవలు అందించింది.

దిగ్గజాలు కూడా...

దిగ్గజాలు కూడా...

2014 లో ప్రారంభమైన ఈ స్టార్టుప్ కంపెనీ.. ఇప్పటికే ఏపీఎస్ఆర్టీసీ, ఏపీఈడీసిఎల్, టీఎస్ఆర్ఈడీసిఓ, ఐఓసీఎల్, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, సెంచరీ మ్యాట్రెస్ వంటి దిగ్గజ కంపెనీలకు తమ సేవలు అందించింది. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ తో పాటు దేశం లోని 22 రాష్ట్రాల్లో ఫ్రెయిర్ ఎనర్జీ కి కస్టమర్లు ఉన్నారు. కాగా, ప్రస్తుతం తెలంగాణ లో సోలార్ పవర్ సిస్టం ఏర్పాటు చేసుకునే వినియోగదారులకు 20% నుంచి 40% వరకు ప్రభుత్వం సబ్సిడీ ఇస్తోంది. అపార్టుమెంట్లకు 20% సబ్సిడీ వర్తిస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి పేపర్ వర్క్ కంపెనీయే చూసుకుంటుంది. వినియోగదారుల తరపున కంపనీ ప్రభుత్వానికి దరఖాస్తు చేసి సబ్సిడీ ని నేరుగా పొందుతుంది. దీంతో కస్టమర్ల కు నేరుగా 20% నుంచి 40% వరకు డిస్కౌంట్ లభించినట్లవుతుంది. నెట్ మీటరింగ్, ఆఫ్టర్ సేల్స్ సర్వీసెస్ కూడా ఈ కంపెనీయే చూసుకుంటుంది.

రూ 96,000 లతో ...

రూ 96,000 లతో ...

పర్యావరణానికి కూడా అనుకూలమైన సోలార్ పవర్ రూఫ్ టాప్ సిస్టం ఏర్పాటు చేసుకుంటే అనేక ప్రయోజనాలు ఉన్నాయి. రెండు పడక గదులు, ఒక హాలు, కిచెన్ ఉండే ఒక గృహానికి 3కే డబ్ల్యూ సోలార్ రూఫ్ టాప్ సిస్టం సరిపోతుంది. దీని వాస్తవిక ఖర్చు రూ 1,56,000 అవుతుంది. ఇందులో సబ్సిడీ మొత్తాన్ని మినహాయిస్తే... వినియోగదారులు చెల్లించాల్సింది రూ 96,000 మాత్రమే. ఒకసారి సోలార్ రూఫ్ టాప్ సిస్టం ను ఏర్పాటు చేసుకుంటే అది దాదాపు 25 ఏళ్ళ పాటు నిరంతరం విద్యుత్ ను సరఫరా చేస్తుందని సౌరభ్ వెల్లడించారు. మొదటి మూడు సంవత్సరాల్లోనే విద్యుత్ బిల్లుల రూపంలో చెల్లించే మొత్తం ద్వారా వినియోగదారులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేస్తుంది. ఇక మిగిలిన సమయానికి విద్యుత్ ఉచితంగానే పొందవచ్చు అని ఆయన తెలిపారు. కాబట్టి, సోలార్ పవర్ వైపు వెళ్లాలనుకునే వినియోగదారులకు ఇదే సరైన సమయమని ఆయన సూచించారు.

English summary

Solar roof top systems at Rs 96,000, ensures power supply for 25 years

Hyderabad based startup company Freyr Energy offers solar roof top systems at Rs 96,000 and ensures power supply for 25 years. The company is also helping the customers to get their subsidy from the government. Freyr Energy has introduced a consumer mobile app called Sunpro plus to offer all the services at one place for the consumers in Telangana and Andhra Pradesh and 20 other states in India.
Story first published: Thursday, July 30, 2020, 19:21 [IST]
Company Search