For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనాతో సాఫ్టువేర్ ఇంజనీర్స్ సహా ఎక్కువగా ప్రభావితమైంది వీరే, జాబ్ కట్ Vs ఆఫర్లు

|

కరోనా మహమ్మారి-లాక్ డౌన్ నేపథ్యంలో కంపెనీలు, సంస్థలు, దుకాణాలు వ్యాపారాలు లేక ఇబ్బందులు పడుతోన్న విషయం తెలిసిందే. ఐటీ ఇండస్ట్రీ సహా వివిధ రంగాలపై ఈ వైరస్ ప్రభావం భారీగానే పడింది. వివిధ సంస్థల్లో ఉద్యోగాల కోత, వేతనాల కోత తెలిసిందే. గత నెల రోజుల కాలంలో స్టార్టప్స్‌లలో ఎక్కువగా సాఫ్టువేర్ ఇంజినీర్లు, ప్రోడక్ట్ మేనేజర్స్, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్టాఫ్, ఆపరేషనల్ రోల్స్‌లో ఉన్న వారిపై ఎక్కువగా ప్రభావం పడిందని ముంబైకి చెందిన జాబ్ పోర్టల్ పోర్టల్ బిగ్ డాట్ జాబ్స్ వెల్లడించిందట.

COVID 19 షాక్: భారత్‌లో 13.5 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం, W ఆకారంలో రికవరీCOVID 19 షాక్: భారత్‌లో 13.5 కోట్ల ఉద్యోగాలకు ప్రమాదం, W ఆకారంలో రికవరీ

సాఫ్టువేర్ ఇంజినీర్స్ కోత 23 శాతం

సాఫ్టువేర్ ఇంజినీర్స్ కోత 23 శాతం

కరోనా నేపథ్యంలో బిగ్ డాట్ జాబ్స్ గత నెల రోజులకు పైగా ఉద్యోగుల తొలగింపుకు సంబంధించిన అంశాలను ట్రాక్ చేస్తోంది. డేటా ప్రకారం అన్ని రంగాల్లోని 3,000 మంది ఉద్యోగుల తొలగింతను విశ్లేషించింది. సాఫ్టువేర్ ఇంజినీర్స్, ప్రోడక్ట్ మేనేజర్స్‌లో 23 శాతం, సేల్స్ అండ్ మార్కెటింగ్ స్టాఫ్ 23 శాతం, ఆపరేషన్స్‌లో 20 శాతం ఉద్యోగాల కోత పడింది. ఓయో, బ్లాక్ బక్, ట్రీబో, ఆక్కో, ఫ్యాబ్ హోటల్స్, మీషో, షటిల్, క్యాపిల్లరీ, స్విగ్గీ, పేర్ పోర్టల్ వంటి వాటిల్లో సరాసరిన 30 శాతం వరకు ఉద్యోగాల కోత చోటు చేసుకుంది. ఇందులో తాత్కాలిక ఉద్యోగులు కూడా ఉన్నారు.

సాఫ్టువేర్ ఇంజనీరిస్‌పై ప్రభావం

సాఫ్టువేర్ ఇంజనీరిస్‌పై ప్రభావం

కరోనా మహమ్మారి కారణంగా బాగా ప్రభావితమైన వారిలో సాఫ్టువేర్ ఇంజినీర్లు కూడా ఉన్నారని, ఈ సంక్షోభానికి వృద్ధి ఉంటుందని భావించి పెద్ద ఎత్తున మ్యాన్ పవర్‌ను తీసుకున్నాయని, ఇప్పుడు ప్రాజెక్టులు నిలిచిపోవడంతో హెడ్ కౌంట్ తగ్గించుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని తేలింది. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లోను ఇదే పరిస్థితి కనిపిస్తోందని, ఈ సంక్షోభ సమయంలో తొలుత ఉద్యోగాలు కోల్పోయింది వీరేనని బిగ్ డాట్ జాబ్స్ ఫౌండర్ హిమాన్షు గీడ్ అన్నారు. కన్సల్టింగ్ సంస్థలపై కూడా ప్రభావం పడిందని చెప్పారు.

నియామకాలు..

నియామకాలు..

అయినప్పటికీ ఎడ్-టెక్, గేమింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ కాస్త ఉత్సాహాన్ని చూస్తున్నాయన్నారు. సాఫ్టువేర్ ఇంజినీర్ డిమాండ్ కూడా పెరుగుతోందని చెబుతున్నారు. ప్రతిభ, హెల్త్ కేర్, ఇండోర్ ఎంటర్టైన్మెంట్ వంటి వాటిల్లో నియామకాలు పెరుగుతున్నాయని అంటున్నారు. సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో ఉద్యోగాల కోత మరియు జాబ్ ఓపెనింగ్స్‌కు పెద్ద తేడా లేదని చెబుతున్నారు. ఆన్ లైన్ గ్రాసరీ మార్కెట్లో ఉన్న కంపెనీలు నియామకాలు చేసుకుంటాయన్నారు. బిజినెస్ టు కన్స్యూమర్ సంస్థలను కరోనా ఎక్కువగా దెబ్బతీసిందని, కొత్త ఉద్యోగాలు రాకపోవడం ఆందోళనకరమని చెబుతున్నారు.

జాబ్ కట్ వర్సెస్ కొత్త ఆఫర్లు

జాబ్ కట్ వర్సెస్ కొత్త ఆఫర్లు

ప్రోడక్ట్ మేనేజ్‌మెంట్ అండ్ సాఫ్టువేర్ ఇంజినీరింగ్‌లో 23 శాతం ఉద్యోగాల కోత ఉండగా, ఆఫర్లు 31 శాతం, డిజైనింగ్‌లో ఉద్యోగాల కోత 4 శాతం, ఆఫర్లు 12 శాతం, సీఎక్స్ఓ (లీడర్‌షిప్) కోత 4 శాతం, ఆఫర్లు 9 శాతం, సేల్స్ అండ్ మార్కెటింగ్‌లో కోత 23 శాతం, ఆఫర్స్ 21 శాతం, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ లే-ఆఫ్స్ 9 శాతం, న్యూ ఆఫర్స్ 5 శాతం, ఆపరేషన్స్ అండ్ కేటగిరీ మేనేజ్‌మెంట్ లే-ఆఫ్స్ 20 శాతం, ఆఫర్స్ 13 శాతం, కన్సల్టింగ్ అండ్ జనరల్ మేనేజ్‌మెంట్ కోత 17 శాతం, న్యూ ఆఫర్స్ 9 శాతంగా ఉన్నాయి.

English summary

కరోనాతో సాఫ్టువేర్ ఇంజనీర్స్ సహా ఎక్కువగా ప్రభావితమైంది వీరే, జాబ్ కట్ Vs ఆఫర్లు | Software engineers and sales staff most affected by layoffs at startups

Software engineers, product managers, sales and marketing staff, and people in operational roles were the most impacted by layoffs at startups over the last one month, said Mumbai based jobs portal Big.
Story first published: Monday, May 18, 2020, 11:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X