సాఫ్టుబ్యాంకుకు చెందిన ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ వచ్చే నెల (జనవరి 2020) చివరలో తమ ఉద్యోగుల్లోని కొంతమందికి షాకివ్వనుందని తెలుస్తోంది. భారత్‌లో దాదాపు 2,000 మంది ఉద్యోగులను తొలగించనుందట. ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి. రితేష్ అగర్వాల్ నేతృత్వంలోని ఈ హాస్పిటాలిటీ స్టార్టప్ తమ ఉద్యోగుల పర్ఫార్మెన్స్‌ను ప్రతి నెల సమీక్షిస్తుంది. పర్ఫార్మెన్స్ ఆధారంగా కొంతమంది ఫర్ఫార్మెన్స్ ఇంప్రూమెంట్ ప్రోగ్రామ్ అనంతరం కొంతమందిని తొలగించవచ్చు.

శిక్షణ, తొలగింపు...
ప్రతి నెల ఉద్యోగుల పనితీరును సమీక్షించే ఓయో ఫలితాలు, గ్రేడ్స్ ఆధారంగా కొంతమంది అబ్యర్థులను పనితీరు పెరుగుదలకు సంబంధించి శిక్షణా కార్యక్రమానికి పంపించడం లేదా తొలగించడం చేస్తుందని అంటున్నారు. ముఖ్యంగా అమ్మకాలు, సరఫరా, ఆపరేషన్స్ విభాగాల్లో ఉద్యోగులను తగ్గించుకునేందుకు అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సమీక్ష అనంతరం ఫలితాలను ఆధారంగా అండర్ పర్ఫార్మెన్స్ ఉద్యోగులకు శిక్షణకు పంపిస్తామని ఓయో అధికార ప్రతినిధి ఒకరు చెప్పారని అంటున్నారు.

బీ గ్రేడింగ్ ఉన్నప్పటికీ ఉద్వాసన
అయితే కంపెనీ ఉద్యోగులను తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అంటున్నారు. సంతృప్తికర గ్రేడ్స్ పొందిన తర్వాత కూడా కొంతమందిని పంపించవచ్చునని అంటున్నారు. సాధారణంగా D రేటింగ్ వచ్చే ఉద్యోగులపై వేటు వేసే కంపెనీ, B అంతకంటే మెరుగైన రేటింగ్ కనబరిచినా కూడా ఉద్వాసన పలకవచ్చునని తెలుస్తోంది.

రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వేతనాలు.. 6 రెట్లు పెరిగిన వేతనాలు
ఈ ఉద్యోగుల సగటు వార్షిక వేతనాలు రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉంటాయని భావిస్తున్నారు. మార్చి 2019 ముగిసిన ఆర్థిక సంవత్సరానికి ఓయో హోటల్స్ అండ్ హోమ్స్ రూ.2,384 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. అంతకుముందు ఏడాది కంటే ఈ నష్టం ఆరు రెట్లు కావడం గమనార్హం. ఆపరేటింగ్ ఖర్చులు పెరగడం, ఎంప్లాయీ సంబంధిత ఖర్చులు పెరగడం వల్లే ఇంత నష్టం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఏడాదిలోనే ఉద్యోగుల వేతన, ఇతర సంబంధిత ఖర్చులు ఏకంగా 6 రెట్లు పెరిగాయి. ఆపరేటింగ్ ఖర్చులు 5 రెట్లు పెరిగాయి. ఉద్యోగుల వేతన ఖర్చులు రూ.1,539కు పెరిగితే, ఆపరేటింగ్ ఖర్చులు రూ.6,131కి పెరిగాయి.

2021 వరకు నష్టాల్లోనే
అయితే ఉద్యోగుల తొలగింపును ఓయో మాత్రం ఖండిస్తోంది. సమీప భవిష్యత్తులో వేలాది మంది ఉద్యోగులను తొలగించడం లేదని పేర్కొంది. ఓయో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు చొప్పించేందుకు సిద్ధమవుతోంది. ఇటీవలి రిపోర్ట్ ప్రకారం భారత్‌లో ఓయో 2021 వరకు నష్టాల్లోనే కొనసాగుతుందని అంచనా.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!



Click it and Unblock the Notifications