For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ధరలు షాకిచ్చే అవకాశం

|

మీరు ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? ప్రముఖ బ్రాండ్లు ఆపిల్, శాంసంగ్, షియోమీ, ఒప్పో, రియల్‌మి స్మార్ట్ ఫోన్ల ధరలు త్వరలో పెరగవచ్చు. ఇటీవల ప్రభుత్వ డిస్‌ప్లేలు, టచ్ ప్యానెల్‌పై దిగుమతి సుంకాన్ని 10 శాతం విధించింది. తయారీదారులపై పడే భారం కొనుగోలుదారులపై పడే అవకాశం ఉంటుంది. ఆత్మనిర్భర్ భారత్ కింద స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు ప్రభుత్వం వివిధ ప్రయత్నాలు చేస్తోంది. అదనపు సెస్ కారణంగా దిగుమతులపై సెస్ భారం 11 శాతం ప్రభావం ఉంటుంది.

కారు నుండి రైల్వేస్, ట్యాక్స్ వరకు.. భారత్ ఎకనమిక్ రికవరీ!కారు నుండి రైల్వేస్, ట్యాక్స్ వరకు.. భారత్ ఎకనమిక్ రికవరీ!

పండుగ సీజన్‌పై ప్రభావం

పండుగ సీజన్‌పై ప్రభావం

ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమం కింద స్ధానిక ఉత్పత్తులను ప్రోత్సహించే ఉద్దేశంతో ప్రభుత్వం ఆయా వస్తువులపై దిగుమతి సుంకాన్ని విధిస్తోంది. ప్రభుత్వ నిర్ణయంతో డిస్‌ప్లే, టచ్ ప్యానల్స్‌పై సుంకంతోపాటు అదనపు సెస్‌ జత కలిస్తే దిగుమతి చేసుకునే వారిపై 11 శాతం భారం పడుతుంది. దిగుమతి సుంకాల కారణంగా సెల్‌ఫోన్ ధరలు 1.5 శాతం నుండి 5 శాతం వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల ధరలు పెరిగితే పండగ సీజన్ పైన ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి.

ధరల పెరుగుదల ఎలా అంటే

ధరల పెరుగుదల ఎలా అంటే

స్థానిక తయారీని ప్రోత్సహించేందుకు దశలవారీ కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో భాగంగా సుంకాన్ని ఏప్రిల్ 2019 నుండి విధించాలని నిర్ణయించారు. అయితే స్థానిక తయారీదారులు సమయం ఇచ్చే ఉద్దేశ్యంలో భాగంగా ఈ నిర్ణయాన్ని రెండుసార్లు వాయిదా వేశారు. ప్రస్తుతం దేశంలో హోలిటెక్, టీసీఎల్ వంటి నాలుగు కంపెనీలు డిస్‌ప్లే ప్యానెల్స్ విభాగంలో ఉన్నాయి. కొన్ని కంపెనీలు ధరలు వెంటనే పెరుగుతాయని చెప్పగా, మరికొన్ని డ్యూటీ ఫీజు గరిష్ట ప్రభావాన్ని బట్టి పెంచుతామని చెబుతున్నాయి.

లోకల్ ఉత్పత్తి

లోకల్ ఉత్పత్తి

ఆపిల్ అతిపెద్ద ఐఫోన్ అసెంబ్లర్ ఫాక్స్‌కాన్, పెగార్టన్, పెగాట్రోన్, విస్ట్రోన్‌తో పాటు శాంసంగ్, కార్బోన్, లావా, డిక్సన్ 100 బిలియన్ డాలర్ల మొబైల్ ఎగుమతుల ప్రతిపాదనను ప్రభుత్వం ముందు ఉంచాయి. ఆపిల్ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చరర్స్ అలాగే, గ్లోబల్ దిగ్గజం శాంసంగ్, లోకల్ హ్యాండ్‌సెట్ మేకర్స్ లావా, డిక్సాన్ కంపెనీలు రానున్న అయిదేళ్లలో ప్రభుత్వం కొత్త స్కీం.. ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యార్చరింగ్ ఉత్పత్తిలో భాగంగా రూ.11 లక్షల కోట్ల మొబైల్ డివైస్ మ్యానుఫ్యాక్చరింగ్, కాంపోనెంట్ తయారీకి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.

English summary

స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్నారా.. ధరలు షాకిచ్చే అవకాశం | Smartphone prices set to increase as government imposes 10 percent duty

If you are planning to buy a smartphone you better do it soon as prices of phones sold by leading brands such as Apple, Samsung, Xiaomi, Oppo and RealMe might soon be increased. The government has imposed a 10% import duty on display and touch panels which will invariably be passed on to the consumer by manufacturers.
Story first published: Friday, October 2, 2020, 17:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X