For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Skoda Kushaq కారు కొన్నారా.. బీ అలర్ట్: సడన్ బ్రేక్‌డౌన్: రీకాల్‌కు ఛాన్స్

|

ప్రేగ్: చెక్ రిపబ్లిక్‌కు చెందిన ప్రఖ్యాత వాహనాల తయారీ సంస్థ స్కోడా (Skoda) కొత్తగా మార్కెట్‌లోకి విడుదల చేసిన కుషాక్ మోడల్ కారును వెనక్కి పిలిపించనుంది. ఈ మోడల్ కారును కొనుగోలు చేసిన వారు తమ వాహనాలను అప్‌గ్రేడ్ చేయించుకోవాల్సి ఉంటుందని స్కోడా మేనేజ్‌మెంట్ తెలిపింది. ఎలక్ట్రానిక్ పవర్ కంట్రోల్‌లో కొన్ని లోపాలు తలెత్తినట్లు గుర్తించింది. వాహనం రన్నింగ్‌లో ఉన్న సమయంలో హఠాత్తుగా బ్రేక్‌డౌన్ అవుతున్నట్లు కొనుగోలుదారుల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందుతున్నందున వాటిని రీ కాల్ చేయాలని నిర్ణయించింది.

ఈ సడన్ బ్రేక్‌డౌన్‌ సమస్య తలెత్తడానికి ఫ్యూయల్ పంప్‌లో లోపాలు ఉండటమేనని గుర్తించింది. అందుకే- స్కోడా కుషాక్ మోడల్ కార్లన్నింటినీ వెనక్కి పిలిపించాలని నిర్ణయించింది. వాటిని షోరూమ్‌లకు రప్పించుకుని, కొత్త ఫ్యూయల్ పంప్‌ను అమర్చనుంది. దీనికోసం ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకున్నట్లు స్కోడా ఆటోమేకర్స్ తెలిపారు. త్వరలోనే రీకాల్ ఉంటుందని స్పష్టం చేశారు. తమకు సమాచారం అందిన వెంటనే వాహనదారులు కార్లను షోరూమ్‌లకు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అక్కడ పాత ఫ్యూయల్ పైప్ స్థానంలో కొత్తవాటిని అమర్చుతారు సర్వీసింగ్ సిబ్బంది. ఇది ఉచితం.

Skoda Kushaq likely to be recalled soon due to a faulty fuel pump cause for several breakdowns

కుషాక్ మోడల్ కార్లు హఠాత్తుగా బ్రేక్ డౌన్ కావడాన్ని నివారించడానికి కొత్త ఫ్యూయల్ పంప్‌ను అమర్చబోతున్నామని స్కోడా ఇండియా అధినేత జాక్ హోల్లిస్ తెలిపారు. దీనికి అవసరమైన అత్యాధునిక ఫ్యూయల్ పంప్స్‌ను కూడా ఇప్పటికే భారత్‌కు డిస్పాచ్ చేసినట్లు కూడా పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ పవర్ కంట్రోల్ సమస్యను దీని ద్వారా నివారించగలుగుతామని చెప్పారు. డాష్‌బోర్డ్‌లో ఎలక్ట్రానిక్ పవర్ కంట్రోల్‌కు సంబంధించిన ఎల్ఈడీ లైట్ వెలిగితే.. కంగారు పడాల్సిన అవసరం లేదని, షో రూమ్‌ను సంప్రదించాలని సూచించారు.

జూన్ చివరి వారంలో స్కోడా కుషాక్ మోడల్ కారు భారత మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పటిదాకా పది వేలకు పైగా కార్లు బుక్ అయ్యాయి. అందులో సగానికి పైగా కార్లు డెలివరీ అయ్యాయి. ఎస్‌యూవీ ఫీచర్స్‌తో రూపుదిద్దుకున్న ఈ కారులో అనేక రకాలైన స్పెసిఫికేషన్స్ ఉన్నాయి. 10 అంగుళాల టచ్‌స్క్రీన్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ ప్లే, సన్ రూఫ్, క్రూయిజ్ కంట్రోల్ వంటీ ఫీచర్లతో పాటు సిక్స్ ఎయిర్ బ్యాగ్స్ దీని సొంతం. మల్టీ కొలిషన్ బ్రేకింగ్, టైర్ ప్రెషర్ మానిటరింగ్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ ఇందులో ఉన్నాయి. దీని ధర 10.49 లక్షల రూపాయల నుంచి 17.59 లక్షల రూపాయల వరకు ఉంది. ఢిల్లీ ఎక్స్‌షోరూమ్ ప్రైస్ ఇది.

Read more about: car కార్
English summary

Skoda Kushaq కారు కొన్నారా.. బీ అలర్ట్: సడన్ బ్రేక్‌డౌన్: రీకాల్‌కు ఛాన్స్ | Skoda Kushaq likely to be recalled soon due to a faulty fuel pump cause for several breakdowns

Skoda Kushaq owners are facing Electronic Power Control issues in just some days or weeks of deliveries. The manufacturer has rectified the issue as a faulty fuel pump and might be planning to issue a voluntary recall.
Story first published: Saturday, September 18, 2021, 16:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X