For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Indian Doctors: భారత వైద్యులకు గుడ్ న్యూస్.. సింగపూర్ తీసుకున్న నిర్ణయంతో జాక్‌పాట్..!

|

Indian Doctors: సింగపూర్ ప్రభుత్వం భారతీయ వైద్యులకు ఒక ఆనందకరమైన ప్రకటన చేసింది. తమ దేశంలో భారతీయ వైద్యులను నియమించుకుంటామని వెల్లడించింది. దీంతో వైద్యులకు పెద్ద జాక్ పాట్ తగిలిందనే చెప్పుకోవాలి. కాంట్రాక్టు పబ్లిష్ అయ్యాక భారతీయ వైద్యులు సింగపూర్ వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు.

వచ్చే మూడేళ్లలో..

వచ్చే మూడేళ్లలో..

వచ్చే 3 ఏళ్లలో 180 మంది భారతీయ వైద్యులు సింగపూర్‌లో పని చేస్తారని ప్రకటించింది. దీనిపై మీడియాలో వచ్చిన కథనం ఇప్పుడు సంచలనంగా మారింది. పైగా ధనిక దేశమైన సింగపూర్‌లో ప్రాక్టీస్‌కు వెళ్లటం వల్ల మంచి జీతాలు పొందవచ్చని భారతీయ వైద్యులు భావిస్తున్నారు.

సింగపూర్‌లో ఉద్యోగం..

సింగపూర్‌లో ఉద్యోగం..

ప్రస్తుతం సింగపూర్‌లో పనిచేస్తున్న చాలా మంది విదేశీ వైద్యుల కాంట్రాక్ట్ అక్టోబర్ 10తో ముగియనుంది. ఈ క్రమంలో 2022 నుంచి 2024 వరకు సింగపూర్‌లో పని చేయడానికి ప్రతి సంవత్సరం 60 మంది డాక్టర్లను భారత్ నుంచి నియమించుకోవాలని సింగపూర్ ప్రభుత్వం భావిస్తోంది. దీనికి తోడు 2025 తర్వాత కూడా వైద్యుల నియామకం కొనసాగుతుందని సమాచారం.

 విదేశీ వైద్యులు..

విదేశీ వైద్యులు..

సింగపూర్ వైద్యుల పనిభారాన్ని తగ్గించేందుకు.. సింగపూర్ హెల్త్ కేర్ వ్యవస్థకు ధీటుగా విదేశాల నుంచి వైద్యులను రిక్రూట్ చేసుకోవడం గమనార్హం. భారత్‌ నుంచే కాకుండా బ్రిటన్‌, ఆస్ట్రేలియా నుంచి కూడా వైద్యులను నియమించుకోవాలని చూస్తున్నట్లు సింగపూర్‌ తెలిపింది.

 రిజిస్టర్డ్ మెడికల్ కాలేజీలు..

రిజిస్టర్డ్ మెడికల్ కాలేజీలు..

సింగపూర్ మెడికల్ కౌన్సిల్‌లో జాబితా చేయబడిన వైద్య కళాశాలల నుంచి డిగ్రీలు పొందిన వైద్యులను మాత్రమే ఎంపిక చేస్తామని సింగపూర్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ అవకాశాన్ని అస్సలు మిస్ చేసుకోకూడదని అనేక మంది డాక్టర్లు భావిస్తున్నారు. దీనివల్ల కెరీర్ గ్రోత్ కూడా ఉంటుందని వారు అభిప్రాయపడుతున్నారు.

English summary

Indian Doctors: భారత వైద్యులకు గుడ్ న్యూస్.. సింగపూర్ తీసుకున్న నిర్ణయంతో జాక్‌పాట్..! | singapore government descided to recruit 180 indian doctots in phased manner by 3 years

singapore government descided to recruit 180 indian doctots in phased manner by 3 years
Story first published: Tuesday, October 4, 2022, 17:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X