For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold & Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. తగ్గిన బంగారం.. రేట్లు మరింతగా తగ్గుతాయా..?

|

Gold & Silver Rates: ఈ రోజు (సోమవారం) బంగారం ధర స్వల్పంగా తగ్గింది. హెచ్‌డిఎఫ్‌సి సెక్యూరిటీస్ సమాచారం ప్రకారం.. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర రూ.51,145కి చేరుకుంది. దీంతో క్రితం ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ.51,150 వద్ద ముగిసింది. అదే సమయంలో, బంగారం దేశీయ ఫ్యూచర్స్ ధర సోమవారం సాయంత్రం స్వల్ప పెరుగుదలతో ట్రేడింగ్‌లో కనిపించింది. MCX ఎక్స్ఛేంజ్‌లో ఆగస్టు 5, 2022న డెలివరీ చేయడానికి బంగారం 10 గ్రాములకు రూ.50,705 వద్ద 0.12 శాతం అంటే రూ.61 పెరిగింది.

వెండి ధర భారీగా పతనం:

వెండి ధర భారీగా పతనం:

ఇదే సమయంలో.. దేశీయంగా వెండి ధర సోమవారం భారీగా పతనమైంది. దేశీయంగా సోమవారం వెండి ధర కిలోకు రూ.1,331 తగ్గి రూ.54,351కి చేరుకుంది. క్రితం ట్రేడింగ్‌లో కిలో వెండి ధర రూ.55,682 వద్ద ముగిసింది. ఫ్యూచర్స్ మార్కెట్ గమనించినట్లయితే.. వెండి స్వల్పంగా క్షీణించింది. సోమవారం సాయంత్రం సెప్టెంబర్ 5, 2022న డెలివరీ కోసం వెండి 0.13 శాతం అంటే రూ.73 తక్కువగా MCX ఎక్స్ఛేంజ్‌లో కిలోకు రూ.55,058 వద్ద ట్రేడవుతోంది.

గ్లోబల్‌గా బంగారం:

గ్లోబల్‌గా బంగారం:

ప్రపంచవ్యాప్తంగా బంగారం ధరలు సోమవారం సాయంత్రం పెరిగాయి. గ్లోబల్ ఫ్యూచర్స్ బంగారం ధర ఔన్సుకు 1,748.30 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది Comexలో 0.17 శాతం లేదా 3 డాలర్లు పెరిగింది. అదే సమయంలో.. బంగారం గ్లోబల్ స్పాట్ ధర ప్రస్తుతం ఔన్స్ 1,731.10 డాలర్ల వద్ద 0.20 శాతం లేదా 3.46 డాలర్ల లాభంతో ట్రేడవుతోంది.

గ్లోబల్‌గా వెండి:

గ్లోబల్‌గా వెండి:

ప్రపంచవ్యాప్తంగా సోమవారం వెండి ధరలు ఫ్లాట్‌గా ట్రేడవుతున్నాయి. వెండి గ్లోబల్ ఫ్యూచర్స్ ధర 0.04 శాతం లేదా 0.01 డాలర్లు తగ్గి, Comexలో ఔన్స్ 18.61 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. అదే సమయంలో.. వెండి గ్లోబల్ స్పాట్ ధర ప్రస్తుతం ఔన్స్‌కు 18.70 డాలర్ల వద్ద 0.56 శాతం లేదా 0.10 డాలర్ల లాభంతో ట్రేడవుతోంది.

English summary

Gold & Silver Rates: భారీగా తగ్గిన వెండి ధర.. తగ్గిన బంగారం.. రేట్లు మరింతగా తగ్గుతాయా..? | silver rates fell drastically and gold rates reduced slightly across world know full details

silver rates fell drastically and gold rates reduced slightly
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X