For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కొత్త నైపుణ్యాలు రెండుమూడేళ్లే, మీ ఉద్యోగం ఉండాలంటే అది చాలా అవసరం!

|

సాఫ్టువేర్ ఉద్యోగులు ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోక తప్పదని ఐటీ-బీపీఎం ఇండస్ట్రీ బాడీ నాస్కాం చైర్మన్ యూబీ ప్రవీణ్ రావు అన్నారు. లేదంటే వారు ఉద్యోగాలకు పనికి రాకుండా పోతారని హెచ్చరించారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఐటీ ఉద్యోగులు ఎప్పటికి అప్పుడు కొత్త కొత్త నైపుణ్యాలు తెలుసుకోవాలన్నారు. ఆన్‌లైన్ హయ్యర్ ఎడ్యుకేషన్ కంపెనీ 'అప్‌గ్రేడ్', ఐఐటీ బెంగళూరు సంయుక్తంగా నిర్వహించిన ఆన్‌లైన్ గ్రాడ్యుయేషన్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

ఆదాయం తగ్గింది.. ఇలా చేస్తాం: కొత్త సవాళ్లు స్వీకరించేందుకు యంగ్ ఇండియా రెడీఆదాయం తగ్గింది.. ఇలా చేస్తాం: కొత్త సవాళ్లు స్వీకరించేందుకు యంగ్ ఇండియా రెడీ

కొత్త నైపుణ్యాలకు మూడేళ్ళ కాలపరిమితి

కొత్త నైపుణ్యాలకు మూడేళ్ళ కాలపరిమితి

కొత్త నైపుణ్యాలకు ఇప్పుడు 2 ఏళ్ళ నుండి 3 ఏళ్ల కాలపరిమితి మాత్రమే ఉందని, ఏం నేర్చుకున్నా అంత వరకే ప్రాధాన్యం దక్కుతోందని, అందువల్ల ఉద్యోగులు కొత్త కొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని జీవితాంతం నేర్చుకుంటూనే ఉండాలని ప్రవీణ్ రావు అన్నారు. కార్పోరేట్ సంస్థలు ఎప్పటికప్పుడు పునరుత్తేజమవుతున్నాయని వ్యాఖ్యానించారు. ఉద్యోగులు కూడా మనుగడ కోసం తమను తాము కొత్తగా ఆవిష్కరించుకోవాల్సి ఉందని సూచించారు.

వీటిలో 1.33 కోట్ల ఉద్యోగాల సృష్టి

వీటిలో 1.33 కోట్ల ఉద్యోగాల సృష్టి

మెషీన్స్, అల్గారిథమ్స్ కొత్తగా 1.33 కోట్ల ఉద్యోగాలను సృష్టించే అవకాశాలు ఉన్నాయని ప్రవీణ్‌రావు అన్నారు. ఉద్యోగులు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడమే కాకుండా జీవితాంతం నేర్చుకోవడానికి కట్టుబడి ఉండాలని ఉద్యోగంలో కొనసాగడానికి ఇది చాలా అవసరమన్నారు.

ఇదిలా ఉండగా ఐటీ రంగంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) కంపెనీలను నైపుణ్యాల సమస్య వేధిస్తోందని, ఈ సంస్థల్లో పని చేసేందుకు అవసరమైన నైపుణ్యాలు ఉన్న పరిశోధకులు, ఎక్స్‌పీరియన్స్ ఉద్యోగులు దొరకడం పెద్ద సమస్యగా మారిందని భారత ఆర్థిక వ్యవస్థపై AI ప్రభావం పేరుతో నాస్కాం నిర్వహించిన అధ్యయనంలో తేలింది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్‌తో సహా వివిధ నగరాల్లో 13 AI కంపెనీలను నాస్కాం పరిశీలించింది. కాలేజీల్లో, డిగ్రీ స్థాయిలో అప్లయిడ్ ఏఐ కోర్సులు ప్రవేశపెట్టడం ద్వారా ఈ సమస్యను కొంతమేరకు అధిగమించవచ్చునని పేర్కొంది.

అప్ గ్రేడ్..

అప్ గ్రేడ్..

అప్‌గ్రేడ్, ఐఐటీ బెంగళూరు డేటా సైన్స్, మెషీన్ లెర్నింగ్ (ML), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), సాఫ్టువేర్ డెవలప్‌మెంట్, బ్లాక్ చైన్‌లో పీజీ డిప్లోమా కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహిస్తోంది. ఇందులో ఫార్చ్యూన్ 500 కంపెనీలతో సహా 8-11 ఏళ్ల అనుభవం కలిగిన నిపుణులు ఉన్నారు.

English summary

కొత్త నైపుణ్యాలు రెండుమూడేళ్లే, మీ ఉద్యోగం ఉండాలంటే అది చాలా అవసరం! | Shelf life of skills 2 to 3 years, need for lifelong learning: NASSCOM Chairman

Chairman of IT-BPM industry body NASSCOM, U B Pravin Rao, said on Sunday that the shelf-life of skills is now only two to three years as he stressed the need for continuous, lifelong learning.
Story first published: Monday, August 10, 2020, 8:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X