For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాంట్రాక్ట్ కార్మికులకు భారీగా పెరిగిన డిమాండ్: ఇండీడ్ నివేదిక

|

ఒప్పంద/తాత్కాలిక ప్రాతిపదికన నియమించుకునే ఉద్యోగాలకు అభ్యర్థుల నుండి ఆసక్తి పెరిగిందని ఇండీడ్ నివేదిక వెల్లడించింది. 2020 జనవరి - జూలై మధ్య ఈ ఉద్యోగాలకు 119 శాతం మేర డిమాండ్ పెరిగింది. నియామక ప్రకటనల్లోనూ 119 శాతం వృద్ధి ఉన్నట్లు తెలిపింది. గతంలో కరోనా పరిమాణాలతో వివిధ రంగాల్లో కంపెనీల మూసివేతలు, ఉత్పత్తుల కోత వంటివి చోటు చేసుకోవడం ఇందుకు కారణమని వెల్లడించింది.

ఈ ఏడాది జనవరి నుండి కాంట్రాక్ట్ ఉద్యోగులకు గిరాకి క్రమంగా పెరిగిందని ఈ నివేదిక తెలిపింది. 2019 జూన్, జూలైతో పోలిస్తే 2020 జూన్, జూలైలో వరుసగా కాంట్రాక్ట్ నియామకాలు 110 శాతం, 143 శాతం చొప్పున పెరిగినట్లు తెలిపింది. వెబ్ సైట్‌లో ఒప్పంద ఉద్యోగాల కోసం అన్వేషించడం కూడా మూడింతలు పెరిగినట్లు వెల్లడించింది.

భారతీయులకు ట్రంప్ మరో షాక్? H1B వీసా లాటరీ పద్ధతిపై కీలక నిర్ణయం!భారతీయులకు ట్రంప్ మరో షాక్? H1B వీసా లాటరీ పద్ధతిపై కీలక నిర్ణయం!

Sharp rise in demand for contract workers

ఉద్యోగాల కోసం అన్వేషించే వారిలో కాంట్రాక్టు లేదా తాత్కాలిక కొలువులపై ఆసక్తి 150 శాతం పెరిగినట్లు తెలిపింది. తమ వెబ్ సైట్ ప్రకారం భారత జాబ్ మార్కెట్లో గణనీయ మార్పువస్తోందని, తాత్కాలిక ఉద్యోగాలకు ఆదరణ పెరుగుతోందని ఇండీడ్ ఇండియా ఎండీ శశికుమార్ అన్నారు.

English summary

కాంట్రాక్ట్ కార్మికులకు భారీగా పెరిగిన డిమాండ్: ఇండీడ్ నివేదిక | Sharp rise in demand for contract workers

Job seekers interest in contract or temporary jobs jumped by 150 percent, while postings for these jobs increased by 119 percent between January and July 2020, a flow on effect of pandemic induced economic shutdowns across industries, according to data from job site Indeed.
Story first published: Friday, October 30, 2020, 16:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X