డిసెంబర్ త్రైమాసిక ఫలితాల తర్వాత ఎఫ్‌ఎంసిజి ప్రధాన నెస్లే ఇండియా షేర్లు 5 శాతం పడిపోయి ఇంట్రాడే కనిష్టానికి 16,360 రూపాయలకు చేరుకున్నాయి. 2020 డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో నెస్లే ఇండియా లాభం గత ఏడాది ఇదే త్రైమాసికంలో 472.6 కోట్ల రూపాయలు ఉంది . దీంతో పోలిస్తే 2 శాతం పెరిగి 483.3 కోట్ల రూపాయలకు చేరుకుంది. బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ విశ్లేషణ ప్రకారం కంపెనీ నికర లాభం 550 కోట్లు నివేదిస్తుందని నెస్లే ఇండియా ప్రకటించినా, లాభాలు ఆశించిన మేరకు రాలేదని తెలుస్తుంది.

కోవిడ్ -19 ప్రభావంతో ఆశించిన మేరకు రాని లాభాలు నెస్లే ఇండియా ప్రకటన
ఉత్పత్తుల అమ్మకం ద్వారా నెస్లే ఇండియా ఆదాయం 9 శాతం పెరిగి 3,417.52 కోట్ల రూపాయలకు చేరుకుంది. నెస్లే ఇండియా దేశీయ అమ్మకాల వృద్ధి వాల్యూమ్ ద్వారా నడిచింది .అంతేకాదు త్రైమాసికంలో అవుట్ ఆఫ్ హోమ్ ఛానెల్‌లో దాని డిమాండ్ మరింత మెరుగుపడింది. అయితే కోవిడ్ -19 కారణంగా ఇది ప్రభావితమైందని నెస్లే ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. కాఫీ ఎగుమతులు తక్కువగా ఉన్నందున దాని ఎగుమతి అమ్మకాలు 7.7 శాతం క్షీణించాయి.

కరోనా సమయంలో నిబద్దతతో పని చేసిన వారికి కృతజ్ఞత తెలిపిన నేస్లే చైర్మన్
గడిచిన సంవత్సరం కరోనా సమయంలో సంస్థ ప్రయోజనాలను కొనసాగించడానికి అచంచలమైన నిబద్ధతను ప్రదర్శించిందని, ఉద్యోగులు, భాగస్వాములు, సరఫరాదారులు, వాస్తవానికి మొత్తం వ్యవస్థ కరోనా కారణంగా అసాధారణమైన సవాలును స్వీకరించి గట్టిగా ప్రయత్నాలు చేస్తోందని సంస్థ పేర్కొంది. కరోనా అసాధారణ కాలంలో సంస్థ ఉద్యోగులు, భాగస్వాములు, సరఫరాదారులు చేసిన కృషికి, త్యాగాలకు తాము ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటామని , మా ఫలితాలు వారి సంకల్పానికి నిదర్శనం అని నెస్లే ఇండియా చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణన్ ఒక ప్రకటనలో తెలిపారు.

నెస్లే ఇండియా బోర్డు ఈక్విటీ షేరుకు రూ. 65 తుది డివిడెండ్ ప్రకటన
కఠినమైన పరిస్థితులలో కూడా బలమైన దేశీయ అమ్మకాల వృద్ధిని అందించినందుకు తాను సంతోషిస్తున్నానని నెస్లే ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సురేష్ నారాయణ తెలిపారు . తమ కీలక బ్రాండ్లలో మూడింట రెండు వంతుల మ్యాగీ నూడుల్స్, కిట్కాట్ మరియు నెస్కాఫ్ క్లాసిక్ గత సంవత్సరం రెండంకెల వృద్ధిని నమోదు చేశాయి. దీనికి మార్కెటింగ్ పురోగతి ఉంది. ముఖ్యంగా చివరి త్రైమాసికంలో గణనీయంగానే వృద్ధి కనిపించిందని ఆయన పేర్కొన్నారు. నెస్లే ఇండియా బోర్డు ఈక్విటీ షేరుకు. 65.00 తుది డివిడెండ్‌ను 20 సంవత్సరానికి గాను అందించనుంది. అందుకోసం 62.67 కోట్లకు సిఫారసు చేసింది
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications