For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ మహా పతనం: కరోనా కేసులు సహా మరెన్నో కారణాలు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం (ఏప్రిల్ 5) భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. క్రితం సెషన్‌లో 50,029 పాయింట్ల వద్ద ముగిసిన సూచీలు నేడు ఓ సమయంలో 1400 పాయింట్ల వరకు పతనమైంది. మధ్యాహ్నం గం.12 తర్వాత కాస్త తేరుకున్నప్పటికీ వెయ్యి పాయింట్లకు పైగా నష్టాల్లోనే ట్రేడ్ అయింది. నిఫ్టీ 400 పాయింట్ల నష్టాన్ని కూడా తాకింది. మధ్యాహ్నం గం.12 సమయానికి 290 పాయింట్ల నష్టంతో ఉంది. అంతర్జాతీయ మార్కెట్లు కాస్త సానుకూలంగా ఉన్నప్పటికీ, మన సూచీలు మాత్రం దారుణంగా పతనమయ్యాయి. ఇందుకు పలు అంశాలు ఉన్నాయి.

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త, వివిధ నగరాల్లో ధరలు..పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గొచ్చు: ధర్మేంద్ర ప్రధాన్ శుభవార్త, వివిధ నగరాల్లో ధరలు..

కరోనా కేసుల ఎఫెక్ట్

కరోనా కేసుల ఎఫెక్ట్

అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. అలాగే మార్చి నెలలో అక్కడ నిరుద్యోగం భారీ స్థాయిలో పడిపోయిందనే వార్తలు సానుకూలంగా కనిపించాయి. అంతర్జాతీయ మార్కెట్లు సానుకూలంగా ఉండటం ఆసియా మార్కెట్లకు కూడా కలిసి వచ్చింది. అయితే మన సూచీలు మాత్రం నష్టపోయాయి. ఇందుకు ప్రధాన కారణంగా కరోనా కేసులు భారీగా పెరగడమే.

కరోనా మహమ్మారి కేసులు నిన్న ఏకంగా లక్షకు పైగా నమోదయ్యాయి. ఈ వైరస్ ప్రారంభం నుండి ఈ స్థాయిలో నమోదు కావడం ఇదే మొదటిసారి. కేసులు తిరిగి పెరుగుతుండటం, ఒకే రోజు రికార్డు స్థాయిలో నమోదు కావడం, వివిధ ప్రాంతాల్లో లాక్ డౌన్ ఆంక్షలు ఇన్వెస్టర్ల సెంటిమెంటును దెబ్బతీశాయి.

మరిన్ని కారణాలు...

మరిన్ని కారణాలు...

ఇటీవల కరోనా కేసులు పెరుగుతున్న సమయంలోను సెన్సెక్స్ గతవారం 50వేల మార్కును దాటింది. కరోనా కేసులు తగ్గకపోవడంతో ఇన్వెస్టర్లు ప్రాఫిట్ బుకింగ్‌కు ఎగబడ్డారు.

నిఫ్టీ గత కొంతకాలంగా 14,650 నుండి 14,900 మధ్య కదలాడుతోంది. నిఫ్టీ 4,950 పాయింట్లకు పైగా చేరుకుంటేనే మరింత దూకుడు ఉండవచ్చునని నిపుణులు చెబుతున్నారు.

ఆర్బీఐ MPC సమావేశం, 2020-21 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికం ఫలితాలు వంటి అంశాల వైపు ఇన్వెస్టర్లు దృష్టి సారించారు. అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నారు.

ఇది కాస్త ఊరట...

ఇది కాస్త ఊరట...

కరోనా సెకండ్ వేవ్ ఉన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ వృద్ధి క్రమం పటిష్టంగానే కనిపిస్తోందని ప్రముఖ గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ నోమురా పేర్కొంది. అయితే లాక్‌డౌన్, పెరిగిన ఆంక్షల నేపథ్యంలో జీడీపీని ప్రభావితం చేయనుందని హెచ్చరించింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటల్లో లక్షకుపైగా కేసులు నమోదైనాయి. 1,03,558 కొత్త కేసులు, 478 మరణాలు తాజాగా నమోదు కావడం గమనార్హం.

English summary

మార్కెట్ మహా పతనం: కరోనా కేసులు సహా మరెన్నో కారణాలు | Sensex tumbles amid record jump in Covid cases: Key factors hurting Dalal Street

A strong wave of sell-off engulfed Indian equity market on April 5, dragging benchmarks - Sensex and Nifty - down almost 3 percent each in the morning trade.
Story first published: Monday, April 5, 2021, 13:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X