For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెరికా లాభాల ఎఫెక్ట్: నిన్న ప్రాఫిట్ బుకింగ్, నేడు ఊగిసలాటలో మార్కెట్లు

|

ముంబై: స్టాక్ మార్కెట్లు నేడు (ఏప్రిల్ 1) భారీ లాభాల్లో ప్రారంభమై, స్వల్ప నష్టాల్లోకి వెళ్లాయి. మధ్యాహ్నం దాదాపు స్థిరంగా ఉన్నాయి. నిఫ్టీ 14,700 పాయింట్ల వద్ద కదలాడగా, సెన్సెక్స్ 49,500 దిగువన ట్రేడ్ అయింది. మెటల్ స్టాక్స్, స్మాల్ క్యాప్స్ భారీగా జంప్ చేశాయి. ఐటీ, ఆటో స్టాక్స్ కూడా లాభాల్లో ట్రేడ్ అయ్యాయి. ఎఫ్ఎంసీజీ స్టాక్స్ నష్టపోయాయి. అమెరికా డాలర్‌తో రూపాయి మారకం నిన్న 73.11 వద్ద క్లోజ్ అయింది. అంతకుముందు రోజు (మంగళవారం) 73.38 వద్ద ముగిసింది. కాగా, భారత కరెన్సీ మార్కెట్ నేడు మూసివేసి ఉంటుంది. యాన్యువల్ బ్యాంక్ క్లోజింగ్ నేపథ్యంలో కరెన్సీ మార్కెట్ ఉండదు.

సెన్సెక్స్ పైకి కిందకు..

సెన్సెక్స్ పైకి కిందకు..

సెన్సెక్స్ ఉదయం 49,868.53 పాయింట్ల వద్ద ప్రారంభమై, 49,942.84 వద్ద గరిష్టాన్ని, 49,478.53 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. క్రితం సెషన్‌లో 49,509 పాయింట్లవద్ద ముగిసింది. నిఫ్టీ 14,798.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,814.65 వద్ద గరిష్టాన్ని, 14,692.45 వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.15 సమయానికి సెన్సెక్స్ 82.16 (0.17%) పాయింట్లు ఎగిసి 49,591 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

నిఫ్టీ 27.15 (0.18%) పాయింట్లు ఎగిసి 14,726 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది. సెన్సెక్స్ ఓ సమయంలో 400 పాయింట్లకు పైగా లాభపడింది. మధ్యాహ్నం స్వల్పంగా 30 పాయింట్ల నష్టాల్లోకి వెళ్లింది. ఆ తర్వాత మళ్లీ పుంజుకొని 100 పాయింట్లు ఎగిసింది.

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

టాప్ గెయినర్స్, టాప్ లూజర్స్

నేటి టాప్ గెయినర్స్ జాబితాలో JSW స్టీల్ 5.18 శాతం, హిండాల్కో 3.17 శాతం, టాటా స్టీల్ 2.80 శాతం, బజాజ్ ఆటో 2.18 శాతం, హీరో మోటో కార్ప్ 1.90 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో HDFC లైఫ్ 1.88 శాతం, మహీంద్రా అండ్ మహీంద్రా 1.41 శాతం, HDFC బ్యాంకు 0.93 శాతం, నెస్ట్లే 0.86 శాతం, హిందూస్తాన్ యూనీ లీవర్ 0.68 శాతం నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, HDFC బ్యాంకు, టీసీఎస్, JSW స్టీల్, టాటా మోటార్స్ ఉన్నాయి.

అమెరికా మార్కెట్ లాభాల్లో

అమెరికా మార్కెట్ లాభాల్లో

అమెరికాలో భారీ ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడంతో అగ్రరాజ్యం టెక్ కంపెనీల షేర్లు లాభాల్లో ఉన్నాయి దీంతో నిన్న వాల్‌స్ట్రీట్ మంచి లాభాల్లో ముగిసింది. ఆ ప్రభావం దేశీయ స్టాక్ మార్కెట్ల పైన పడింది. దీంతో ఆసియా, ఆస్ట్రేలియా మార్కెట్లు లాభాల బాటలో ఉన్నాయి. నిక్కీ, హాంగ్‌షెంగ్ సూచీలు సానుకూలంగా కదలాడుతున్నాయి. అలాగే, ఇక్కడ నిన్న ప్రాఫిట్ బుకింగ్ జోరు కనిపించింది. ఈ రోజు తిరిగి ఊగిలటలో ఉన్నాయి.

English summary

అమెరికా లాభాల ఎఫెక్ట్: నిన్న ప్రాఫిట్ బుకింగ్, నేడు ఊగిసలాటలో మార్కెట్లు | Sensex trades higher, Nifty above 14,700: Metals, IT, auto stocks gain

Indian indices were trading higher on Thursday following a rally in the global market peers. Asian stocks edged higher after big tech rallied on Wall Street and as President Joe Biden announced a multi-trillion-dollar infrastructure investment plan. Gains were mainly led by metals, auto and IT stocks.
Story first published: Thursday, April 1, 2021, 11:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X