For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం

|

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 50,020.91 పాయింట్ల వద్ద ప్రారంభమైన సెన్సెక్స్, 50,028.67 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,580.80 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. నిఫ్టీ 14,837.70 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,849.85 వద్ద గరిష్టాన్ని, 14,459.50 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. మధ్యాహ్నం గం.11.50 సమయానికి సెన్సెక్స్ 1,275.05 (2.55%) క్షీణించి 48,754.78 పాయింట్ల వద్ద, నిఫ్టీ 352.55 (2.37%) పాయింట్లు పతనమై 14,515.35 పాయింట్ల వద్ద ట్రేడ్ అయింది.

అమెరికా మార్కెట్లు గతవారం లాభాల్లో ముగిశాయి. మార్చిలో అమెరికాలో నిరుద్యోగం భారీస్థాయిలో పడిపోయిందనే వార్తలు సానుకూల అంశం. దీంతో అక్కడి నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న ఆసియా మార్కెట్లు లాభాల్లో ఉన్నాయి. హాంగ్‌కాంగ్ మార్కెట్ మాత్రం నష్టపోయింది. అయితే దేశీయంగా కరోనా కేసులు భారీగా పెరగడంతో మార్కెట్లు భారీగా నష్టపోతున్నాయి. మహారాష్ట్రలో కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు సిద్ధమయ్యారు. దేశవ్యాప్తంగానూ ఆయా రాష్ట్రాల్లో తీవ్రతను బట్టి కఠిన ఆంక్షలు అమలు చేసేందుకు అక్కడి ప్రభుత్వాలు సిద్ధమవుతున్నాయి.

Sensex slumps nearly 1,400 points, rupee falls vs US dollar

ఈవారం విడుదల కానున్న ఆర్బీఐ పరపతి సమీక్ష నిర్ణయాలు, కంపెనీల త్రైమాసిక ఫలితాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో నేడు దేశీయ మార్కెట్లు నష్టాల్లో పయనిస్తున్నాయి.

English summary

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1400 పాయింట్లు పతనం | Sensex slumps nearly 1,400 points, rupee falls vs US dollar

Indian stock markets slumped today with Sensex tanking nearly 1,400 points as daily coronavirus infections surpassed 100,000 for the first time. Some states have imposed fresh restrictions, sparking concerns about the pace of the country's economic recovery. Sensex fell as much as 1391 points when it hit a low of 48,638 while Nifty was below 14,500.
Story first published: Monday, April 5, 2021, 12:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X