For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజంతా ఊగిసలాట... ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ పైకి, నిఫ్టీ కిందకు

|

ముంబై: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం అతి స్వల్ప లాభాల్లో ముగిశాయి. స్వల్ప లాభాలతో ప్రారంభమై, ఆ తర్వాత నష్టాల్లోకి వెళ్ళి, రోజంతా ఊగిసలాట మధ్య కదలాడి, చివరి గంటలో స్వల్ప లాభాల్లో ముగిసింది. అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉన్నప్పటికీ కరోనా భయాలు ఇన్వెస్టర్లను వెంటాడాయి. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల్లోని అస్థిరత, వ్యాక్సినేషన్ పైన కొనసాగుతోన్న అనిశ్చితి కూడా ఇన్వెస్టర్లను అప్రమత్తం చేశాయి. కీలక రంగాలు రాణించకపోవడం సూచీలపై ప్రభావం చూపింది.

రోజంతా ఊగిసలాట

రోజంతా ఊగిసలాట

సెన్సెక్స్ నేడు ఉదయం 48,898.93 పాయింట్ల వద్ద ప్రారంభమై, 48,898.93 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 48,473.43 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరకు 41.75 (0.086%) పాయింట్లు లాభపడి 48,732.55 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ మాత్రం స్వల్ప నష్టాల్లో ముగిసింది. 18.70 (0.13%)

పాయింట్లు క్షీణించి 14,677.80 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ 14,749.40 పాయింట్ల వద్ద ప్రారంభమై, 14,749.65 పాయింట్ల వద్ద గరిష్టాన్ని, 14,591.90 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది.

టాప్ గెయినర్స్, లూజర్స్

టాప్ గెయినర్స్, లూజర్స్

నేటి సెషన్లో టాప్ గెయినర్స్ జాబితాలో ఏషియన్ పేయింట్స్ 8.54 శాతం, UPL 7.47 శాతం, ఐటీసీ 4.43 శాతం, నెస్ట్లే 3.03 శాతం, లార్సన్ 2.18 శాతం లాభపడ్డాయి.

టాప్ లూజర్స్ జాబితాలో కోల్ ఇండియా 4.36 శాతం, టాటా మోటార్స్ 4.22 శాతం, హిండాల్కో 4.01 శాతం, టాటా స్టీల్ 3.99 శాతం, గ్రాసీమ్ 3.21 శాతం, నష్టపోయాయి.

మోస్ట్ యాక్టివ్ స్టాక్స్‌లో టాటా స్టీల్, UPL, ఏషియన్ పేయింట్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ ఉన్నాయి.

రంగాలవారీగా...

రంగాలవారీగా...

నిఫ్టీ 50 స్టాక్స్ 0.13 శాతం, నిఫ్టీ మిడ్ క్యాప్ 1.74 నష్టపోయాయి. నిఫ్టీ ఆటో 2.03 శాతం, నిఫ్టీ బ్యాంకు 0.87 శాతం, నిఫ్టీ ఎనర్జీ 0.34 శాతం, నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.61 శాతం, నిఫ్టీ ఐటీ 1.03 శాతం, నిఫ్టీ మీడియా 1.56 శాతం, నిఫ్టీ మెటల్ 3.76 శాతం, నిఫ్టీ ఫార్మా 1.28 శాతం, నిఫ్టీ పీఎస్‌యూ బ్యాంకు 2.03 శాతం, నిఫ్టీ రియాల్టీ 3.19 శాతం, నిఫ్టీ ప్రయివేటు బ్యాంకు 0.86 శాతం నష్టపోయాయి. నిఫ్టీ ఎఫ్ఎంసీజీ 2.13 శాతం లాభపడింది.

English summary

రోజంతా ఊగిసలాట... ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు: సెన్సెక్స్ పైకి, నిఫ్టీ కిందకు | Sensex ends flat in volatile trade: Nifty below 14,700

Indian benchmark indices ended flat amid volatile trade on Friday. Sensex ended at 48,732.55, up 41.75, while Nifty ended at 14,678, down 18 points. IT, metals and auto stocks were the biggest laggards. Asian Paints, and ITC were the best gainers today.
Story first published: Friday, May 14, 2021, 19:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X