For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బిట్ కాయిన్ ఇన్వెస్టర్‌గా చెప్పుకునే క్రెగ్‌కు 100 మిలియన్ డాలర్ల పరిహారం, అసలేమైంది

|

బిట్ కాయిన్ ఇన్వెస్టర్‌గా చెప్పుకుంటున్న ఆస్ట్రేలియన్ కంప్యూటర్ సైంటిస్ట్ క్రెగ్ రైట్‌కు షాక్. 100 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని డబ్ల్యు అండ్ కె సంస్థకు ఈ మొత్తం చెల్లించాలని మియామీ జ్యూరీ ఆదేశాలు జారీ చేసింది. గత కొంతకాలంగా క్రిప్టో నియంత్రణ, నిషేధం, పెట్టుబడులపై ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో అమెరికాలో మూడు వారాలుగా సాగుతున్న ఓ కేసు విచారణ అందరిలోను ఆసక్తి రేకెత్తించింది. ఇందులో వెలువడే తీర్పుతో బిట్ కాయిన్ సృష్టికర్త సతోషి నకమోటో ఎవరో తేలిపోతుందని భావించారు. కానీ ఈ మిస్టరీ కొనసాగుతోంది.

బిట్ కాయిన్ సృష్టికర్త

బిట్ కాయిన్ సృష్టికర్త

బిట్ కాయిన్ క్రిప్టోను సృష్టించింది తానేనని క్రెగ్ రైట్ 2016లో ప్రకటించుకున్నారు. సతోషి నకమోటోను తానే అన్నారు. క్రెగ్ రైట్ తన స్నేహితుడు డేవిడ్ క్లెమెన్‌తో కలిసి అంతకుముందే డబ్ల్యు అండ్ కే సంస్థను నిర్వహించాడు. క్లెమెన్ 2013లో మృతి చెందాడు. క్రెగ్ కలిగి ఉన్న బిట్ కాయిన్లలో సగం తనకు ఇవ్వాలని కుటుంబ సభ్యులు మియామీ కోర్టు మెట్లు ఎక్కారు. పదమూడేళ్ల క్రితం అంటే 2007-08 కాలంలో క్రెగ్, క్లెమేన్ కలిసి బిట్ కాయిన్ సృష్టించారని వారు చెబుతున్నారు. తన వద్ద 1.1 మిలియన్ బిట్ కాయిన్స్ ఉన్నట్లు క్రెగ్ చెప్పారు. వీటి వ్యాల్యూ ప్రస్తుతం 50 బిలియన్ డాలర్లకు పైనే. మన దేశ కరెన్సీలో ఇది రూ.3.75 లక్షల కోట్లు.

వాటాలేదని తేల్చారు కానీ

వాటాలేదని తేల్చారు కానీ

ఇందులో సగం వాటాతో పాటు బిట్ కాయిన్ వెనుక ఉన్న బ్లాక్ చైన్ టెక్నాలజీపై మేధోహక్కులు కూడా కల్పించాలని క్లెమెన్ కుటుంబం చెబుతోంది. ఈ బిట్ కాయిన్ వ్యవహారం కోర్టుకు సవాల్‌గా మారింది. కోర్టు ఇరువైపుల వాదనలు విన్నది. బిట్ కాయిన్ ఎలా పని చేస్తుందో తెలుసుకుంది. క్రెగ్, క్లెమెన్ మధ్య సంబంధాలను పరిశీలించింది. చివరకు 1.1 మిలియన్ బిట్ కాయిన్స్‌లో క్లెమెన్‌కు వాటా లేదని తీర్పు చెప్పారు. వాటా విషయంలో క్రెగ్‌కు అనుకూలంగా తీర్పు వచ్చింది. కానీ ఇక్కడే మరో ట్విస్ట్. మేధో హక్కుల ఉల్లంఘనలకు గాను ఇరువురు కలిసి నెలకొల్పిన డబ్ల్యు అండ్ కె సంస్థకు 100 మిలియన్ డాలర్లను పరిహారంగా చెల్లించాలని క్రెగ్‌ను ఆదేశించారు. ఈ తీర్పును క్రెగ్ స్వాగతించారు. డబ్ల్యు అండ్ కె వర్గాలు కూడా స్వాగతించాయి.

తీర్పుతో ఇది తేలింది.. మిస్టరీ

తీర్పుతో ఇది తేలింది.. మిస్టరీ

బిట్ కాయిన్ సృష్టికి కారణమైన బ్లాక్ చైన్ టెక్నాలజీకి సంబంధించిన మేథోహక్కులను క్రెగ్ ఉల్లంఘించినట్లు ఈ తీర్పు ద్వారా తేలింది. దీంతో బిట్ కాయిన్ సృష్టికర్త అంశం మళ్లీ మిస్టరీగానే మారింది. 2008లో ఆర్థిక సంక్షోభం సమయంలో ఒక వ్యక్తి లేదా కొంతమంది కలిసి సతోషి నకమోటో పేరిట డిజిటల్ కరెన్సీని సృష్టించారు. దీనిని పబ్లిష్ చేశారు. అది పని చేసే తీరును వివరించారు. కొద్ది నెలల తర్వాత ఈ కరెన్సీ మైనింగ్ కోసం అధికారికంగా సాఫ్టువేర్‌ను విడుదల చేశారు. కొన్ని క్లిష్టమైన సమీకరణాలను పరిష్కరించడం ద్వారా కాయిన్స్‌ను పోగు చేసుకోవడం ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో 1.1 మిలియన్ బిట్ కాయిన్స్ తనవే అన్న క్రెగ్ వాదనను కొందరు కొట్టి పారేస్తున్నారు. చాలాకాలంగా వీటిని ట్రేడింగ్‌లో ఎందుకు ఉంచడం లేదని అంటున్నారు. అంత భారీ మొత్తంలో కాయిన్స్ మైన కష్టమని, దాని సృష్టికర్తలే మొదట్లో వీటిని మైన్ చేసి ఉంటారని భావిస్తున్నారు.

English summary

Self described Bitcoin inventor ordered to pay $100M in damages

The Australian computer scientist who claims he invented Bitcoin was told by a U.S. jury to pay $100 million in damages over claims that he cheated a deceased friend over intellectual property for the cryptocurrency.
Story first published: Tuesday, December 7, 2021, 16:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X