Penny Stock: రూ. లక్ష పెట్టుబడిని రూ.2 కోట్లు చేసిన పెన్నీ స్టాక్.. కేవలం 9 నెలల్లోనే మెగా రిటర్న్స్..
Multibagger Stock: గత సంవత్సర కాలంలో చాలా స్టాక్‌లు పెట్టుబడిదారులకు మల్టీబ్యాగర్ రిటర్న్‌ను అందించాయి. వీటిలో చాలా పెన్నీ స్టాక్స్ కూడా ఉన్నాయి. ఈ కాలంలో చాలా పెన్నీ స్టాక్‌లు మల్టీబ్యాగర్ స్టాక్‌ల జాబితాలో చేరిపోయాయి. తమ ఇన్వెస్టర్లకు రికార్డు స్థాయిలో రాబడులను అందించాయి. ఇన్వస్టర్లకు రికార్డు లాభాలను తెచ్చిపెట్టాయి.కేవలం 9 నెలల్లో పెట్టుబడిదారులకు 19,000 శాతానికి పైగా బలమైన రాబడిని అందించిన మల్టీబ్యాగర్ షేర్ గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రూ.5 నుంచి పెరిగిన షేర్ విలువ..
ఇప్పటి వరకూ మనం మాట్లాడుకున్నది SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ స్టాక్ గురించి. ఈ స్టాక్ తొమ్మిది నెలల కిందట 28 అక్టోబర్ 2021 ఎన్ఎస్ఈలో రూ. 4.95 వద్ద ట్రేడ్ అవుతుండేది. అయితే జూలై 4, 2022న రూ.965.15 వద్ద ఉంది.

పడిపోయిన షేర్ విలువ..
కంపెనీ స్టాక్ సుమారు 19,397.98% అద్భుతమైన రాబడిని ఇచ్చింది. అదే సమయంలో.. 2022లో YTD టైమింగ్ ప్రకారం ఈ షేర్ జనవరి 3, 2022న ఒక్కో షేరు రూ.44.40 ధర నుంచి రూ.965.15కి పెరిగింది. ఈ కాలంలో 2,073.76 శాతం రాబడిని ఇచ్చింది. అయితే.. ఈ రోజుల్లో షేర్లలో క్షీణత ఉంది. గత నెలలో ఈ షేర్ 5.87 శాతం పడిపోయింది.

ఇన్వెస్టర్లకు అద్బుతమైన రిటర్న్స్..
SEL మాన్యుఫ్యాక్చరింగ్ కంపెనీ లిమిటెడ్ షేర్ ధర హిస్టరీ చూసినట్లయితే.. ఒక ఇన్వెస్టర్ తొమ్మిది నెలల క్రితం రూ.4.95 వద్ద ఈ స్టాక్‌లో లక్ష రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఉంటే.. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం అతనికి రూ.2 కోట్లకు పైగా రాబడి వచ్చి ఉండేది. అదే సమయంలో.. ఈ సంవత్సరం రూ.44.40 వద్ద లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టినట్లయితే.. ప్రస్తుతం దాని విలువ రూ. 21.73 లక్షలుగా ఉండేది.