For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరోనా సెకండ్ వేవ్: అక్కడే ఎక్కువ బ్యాంకులు, భారీ రిస్క్

|

కరోనా సెకండ్ వేవ్‌తో భారత ఆర్థిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావం పడుతుందని ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ ఫిచ్ రేటింగ్స్ అభిప్రాయపడింది. ఆర్థిక వ్యవస్థ రికవరీ, బ్యాంకుల పురోగతికి ముప్పు పొంచి ఉందని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. 2021లో ఇండియన్ బ్యాంకింగ్ వ్యవస్థకు ఓ మోస్తరు ప్రతికూల పరిస్థితులు ఎదురు కావొచ్చునని భావిస్తోంది. కరోనా కేసులను అదుపులోకి తెచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక చర్యలు తీసుకుంటున్నాయని, ఈ ప్రభావం వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలపై ఉండవచ్చునని పేర్కొంది. ఫిబ్రవరి మధ్యలో రోజుకు 9,300 చొప్పున కరోనా కేసులు నమోదు కాగా, ఇప్పుడు ఆ సంఖ్య లక్షకు పైగా చేరింది.

ఇల్లు కొనాలనుకుంటున్నారా: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?ఇల్లు కొనాలనుకుంటున్నారా: ఏ బ్యాంకులో ఎంత వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజు ఎంత?

వృద్ధిపై ఒత్తిడి

వృద్ధిపై ఒత్తిడి

కరోనా నేపథ్యంలో ప్రభుత్వ సర్దుబాటు విధాన వైఖరి, ఆర్థికవృద్ధిపై ఒత్తిడిని కొంతమేర పరిమితం చేయవచ్చునని, కరోనా అవరోధం తగ్గాలంటే ప్రజలకు కరోనా వ్యాక్సీన్‌ను త్వరగా, సమర్థంగా అందించడం కీలకమని పేర్కొంది. FY22లో భారత్‌ జీడీపీ వృద్ధి 12.8 శాతంగా నమోదు కావచ్చని పేర్కొంది. కొత్తగా కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో వృద్ధి నెమ్మదించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీనిని పరిగణలోకి తీసుకొని పూర్తి ఆర్థిక సంవత్సర వృద్ధి రేటును అంచనా వేసింది. కరోనా వ్యాప్తి ఎక్కువైతే మాత్రం వృద్ధి అంచనాలపై ప్రభావం మరింత ఉంటుందని పేర్కొంది.

అందుకే బ్యాంకులపై ప్రభావం

అందుకే బ్యాంకులపై ప్రభావం

ఐదింట నాలుగింట కొత్త కేసులు ఆరు ప్రధాన నగరాల్లో నమోదు అవుతున్నాయని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. బ్యాంకింగ్ రంగంలో 45 శాతం రుణాలు ఈ నగరాలు కలిగిన రాష్ట్రాల్లో ఉన్నాయని, ఈ రాష్ట్రాల్లో ఆర్థిక కార్యకలాపాలకు అవరోధం ఏర్పడితే వ్యాపార సెంటిమెంట్ దెబ్బతినవచ్చునని ఫిచ్ రేటింగ్స్ తెలిపింది. అయితే గత ఏడాది మాదిరి కఠినమైన లాక్ డౌన్ ఆంక్షలు విధించే అవకాశాల్లేవని భావిస్తున్నట్లు తెలిపింది.

కరోనా రెండో విడత వ్యాప్తితో వినియోగదారు, కార్పొరేట్ విశ్వాసం పైనా ప్రభావంపడితే, బ్యాంకుల కొత్త వ్యాపార ప్రణాళికలకు అవరోధం ఏర్పడుతుందని వెల్లడించింది. కరోనా తొలి విడత, 2020 లాక్ డౌన్ ఆంక్షల ప్రభావం బ్యాంకుల ఆర్థిక ఫలితాలపై ఇంకా పూర్తిగా పడలేదని, ఆస్తుల నాణ్యతపై ఆందోళనలు తొలగలేదని కూడా పేర్కొంది.

రిటైల్ రుణాలు రిస్క్

రిటైల్ రుణాలు రిస్క్

సూక్ష్మ, చిన్న మధ్య తరహా సంస్థలు, రిటైల్ విభాగాల్లోని రుణాలు ఎన్పీఏలుగా మారే అవకాశాలున్నాయని భావిస్తున్నట్లు ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. రిటైల్ రుణాలకు రిస్క్ ఉందని, ఈ రుణాలు తమ అంచనాల కంటే మెరుగ్గానే ఉన్నప్పటికీ పెరుగుతున్న కరోనా కేసుల ప్రభావం ఉంటుందని తెలిపింది.

English summary

కరోనా సెకండ్ వేవ్: అక్కడే ఎక్కువ బ్యాంకులు, భారీ రిస్క్ | Second wave of Covid 19 infections poses increased risks for economic recovery, banks

Fitch Ratings-Mumbai-09 April 2021: India's second wave of Covid-19 infections poses increased risks for India's fragile economic recovery and its banks, says Fitch Ratings.
Story first published: Sunday, April 11, 2021, 7:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X