For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SEBI: సెబీ సువర్ణ అవకాశం.. ఆ సమాచారం చెబితే రూ.20 లక్షలు మీ సొంతం..!

|

మార్కెట్ రెగ్యులెటరీ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (Sebi) సువర్ణ అవకాశం కల్పించింది. ఆర్థిక నేరస్థుల నుంచి జరిమానాలు వసూలు చేసేందుకు మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ రివార్డ్ విధానం తీసుకొచ్చింది. డిఫాల్టర్ల ఆస్తుల గురించి సమాచారాన్ని ఇచ్చిన వారికి రూ.20 లక్షల వరకు రివార్డ్ ఇవ్వనుంది. ఈ రివార్డ్ ను రెండు దశల్లో మంజూరు చేయనున్నారు.

50 మంది

50 మంది

దేశంలోని 50 మంది, బ్యాంకులు రూ.92,570 కోట్లు రుణాలు ఎగవేశారు. ఈ మేరకు ప్రభుత్వం ఇటీవల పార్లమెంట్‌లో ఒక ప్రకటన చేసింది. అయితే సెబీ ఇటీవల 9 మోస్ట్ వాంటెడ్ డిఫాల్టర్ల జాబితాను విడుదల చేసింది. సెబీ జాబితాలో చేర్చిన మోస్ట్ వాంటెడ్ డిఫాల్టర్లందరూ ప్రస్తుతం అందుబాటులో లేరు. ఇలాంటి డిఫాల్టర్ల నుంచి జరిమానా వసూలు చేసేందుకు రెగ్యులేటర్ ప్రయత్నాలు ముమ్మరం చేసే ప్రయత్నాల్లో భాగంగా ఈ విధానం తీసుకొచ్చింది

9 మంది

9 మంది

ఈ 9 మందికి సంబంధించిన ఏదైనా ఆస్తి గురించి సెబీకి తెలియజేస్తే రెండు దశల్లో రివార్డ్ వస్తుంది. మొదటి దశలో ఆస్తిలో 2.5 శాతం ఇస్తారు. అయితే ఈ మొత్తం రూ.5 లక్షలు మించి ఇవ్వరు. రెండో దశలో రూ.20 లక్షలు లేదా ఆస్తిలో 10 శాతం ఇస్తారు. 'రికవరీ చేయడం కష్టం' అని ధృవీకరించబడిన బకాయిలకు సంబంధించి డిఫాల్టర్ల ఆస్తికి సంబంధించి సమాచారాన్ని అందజేస్ రివార్డ్ వస్తుంది. సమాచారం ఇచ్చిన వారి వివరాలను సెబీ గోప్యంగా ఉంచుతుంది.

ఇన్‌ఫార్మర్ రివార్డ్ కమిటీ

ఇన్‌ఫార్మర్ రివార్డ్ కమిటీ

ఇన్‌ఫార్మర్ రివార్డ్ కమిటీ రివార్డ్ కోసం ఇన్‌ఫార్మర్‌ల అర్హత మరియు ఇన్‌ఫార్మర్‌లకు చెల్లించాల్సిన రివార్డ్ మొత్తాన్ని నిర్ణయించడానికి సంబంధించిన విషయాలపై సమర్థ అధికారికి తన సిఫార్సులను అందజేస్తుంది.

English summary

SEBI: సెబీ సువర్ణ అవకాశం.. ఆ సమాచారం చెబితే రూ.20 లక్షలు మీ సొంతం..! | SEBI will announce a reward of Rs 20 lakh if the details of the assets of the defaulters are disclosed

The market regulatory Securities and Exchange Board of India (Sebi) has provided a golden opportunity. Market regulator SEBI has introduced a reward system to collect fines from financial criminals.
Story first published: Saturday, March 11, 2023, 12:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X