For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ పెంపు, IPO నిబంధనలు కఠినతరం

|

తొలి పబ్లిక్ ఆఫర్(IPO) నిధుల వినియోగ నిబంధనలను సెబి మరింత కట్టుదిట్టం చేసింది. ఐపీవో నిధులతో ఇతర కంపెనీల కొనుగోళ్ల నిబంధనలను మరింత పటిష్టం చేసింది. ఇక నుండి కంపెనీలు ఐపీవోల కొనుగోళ్ళ నిబంధనలను మరింత పటిష్టం చేసింది. ఇక నుండి కంపెనీలు ఐపీవోల ద్వారా సమీకరించే నిధుల్లో 25 శాతానికి మించి, ఆఫర్ డాక్యుమెంట్‌లో చెప్పని కంపెనీల కొనుగోళ్ల కోసం ఖర్చు చేయడానికి వీల్లేదు.

కంపెనీల సాధారణ అవసరాల కోసం ఐపీవో నిధుల్లో పది శాతానికి మించి ఖర్చు చేయకుండా ఆంక్షలు విధించింది. వ్యాపార విస్తరణ పేరుతో కంపెనీల ఇష్టారీతి కొనుగోళ్లకు చెక్ చెప్పడానికి సెబి ఈ చర్య తీసుకుంది. సాధారణ కార్పోరేట్ అవసరాలకు కేటాయించి నిధులను క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు పరిశీలిస్తాయని సెబి స్పష్టం చేసింది.

యాంకర్ ఇన్వెస్టర్ల అడ్డగోలు లాభాలకు చెక్ పెట్టడానికి సెబీ ఈ చర్యలు తీసుకుంది. ఇక నుండి వీరు తమ పెట్టుబడులలో 50 శాతం మాత్రమే నెల రోజుల తర్వాత విక్రయించడానికి అనుమతిస్తారు. మిగతా 50 శాతం షేర్లని విక్రయించేందుకు 90 రోజుల వరకు వేచి చూడాలి. ఈ ఏప్రిల్ 1, 2022 నుండి ఈ నిబంధనలు అమల్లోకి రానున్నాయి. ఈ నిబంధనలు అమలులోకి రావడం కోసం ఇష్యూ ఆఫ్ క్యాపిటల్ అండ్ డిస్‌క్లోజర్ రిక్వైర్మెంట్స్-ICDR రెగ్యులేషన్స్ కింద ఉండే వివిధ నిబంధనలను సవరించాల్సి ఉంది.

కొత్త తరం సాంకేతికత కంపెనీలు

కొత్త తరం సాంకేతికత కంపెనీలు

ఐపీవో ద్వారా నిధుల సమీకరణ కోసం పలు కొత్త తరం సాంకేతికత కంపెనీలు మార్కెట్లోకి వస్తున్నాయి. దీంతో సెబి తాజా నిర్ణయం తీసుకున్నది. పెట్టుబడుల లక్ష్యం, భవిష్యత్తు కొనుగోళ్ల వివరాలు లేకుండా జరిపే కేటాయింపులతో పాటు సాధారణ కార్పోరేట్ అవసరాల కోసం చేసే కేటాయింపులు... ఇలా మొత్తం నిధుల సమీకరణలో 35 శాతం మించవద్దు.

కొనుగోళ్లు లేదా పెట్టుబడుల లక్ష్యం లేకుండా చేసే కేటాయింపులు నిధుల సమీకరణలో 25 శాతం దాటవద్దు. పెట్టుబడుల లక్ష్యం/కొనుగోళ్లను నిర్దిష్టంగా ప్రస్తావిస్తే మాత్రం ఈ పరిమితి వర్తించదు.

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు

క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు

సాధారణ కార్పోరేట్ అవసరాల కోసం సమీకరించే నిధులపై ఏజెన్సీల పర్యవేక్షణ ఉంటుంది. క్వార్టర్లీ ప్రాతిపదికన మానిటరింగ్ ఏజెన్సీ నివేదికను ఆడిట్ కమిటీ పరిశీలనకు అందించాలి. షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంకులు, ప్రభుత్వ ఆర్థిక సంస్థలకు బదులు సెబి వద్ద నమోదైన క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీలు మానిటరింగ్ ఏజెన్సీలుగా వ్యవహరిస్తాయి.

ఈ పర్యవేక్షణ నిధుల వినియోగం వంద శాతం అయ్యే వరకు ఉంటుంది. ఏదైనా కంపెనీ ట్రాక్ రికార్డ్ లేకుండ్ ఆఫర్ ఫర్ సేల్‌కు (OFS) సమర్పించే డ్రాఫ్ట్ విషయంలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇష్యూకు ముందు కంపెనీలో ఇరవై శాతం కంటే ఎక్కువ వాటా కలిగిన షేర్ హోల్డర్స్ OFSలో తమ షేర్లలో 50 శాతం కంటే ఎక్కువ విక్రయించుకోవచ్చు. ఇరవై శాతం కంటే తక్కువ వాటా కలిగినవారు OFSలో పది శాతం షేర్లను మాత్రమే

లాక్-ఇన్ పీరియడ్

లాక్-ఇన్ పీరియడ్

యాంకర్ ఇన్వెస్టర్లకు ఉన్న నెల రోజుల లాక్-ఇన్ పీరియడ్ వారికి కేటాయించిన 50 శాతానికి కొనసాగుతుంది. మిగతా యాభై శాతానికి 90 రోజుల లాక్-ఇన్ పీరియడ్ వర్తిస్తుంది. వచ్చే ఏప్రిల్ 1వ తేదీ నుండి బుక్ బిల్డ్ ఇష్యూల్లో సంస్థాగతేతర ఇన్వెస్టర్లకు కేటాయించిన వాటాలో మూడో వంతును రూ.2 లక్షల నుండి రూ.10 లక్షల వరకు దరఖాస్తు పరిమాణం ఉండే వారికి కేటాయిస్తారు. రూ.10 లక్షల కంటే ఎక్కువ దరఖాస్తు పరిమాణం ఉండే వారికి మిగతా వాటాను కేటాయించవచ్చును.

English summary

యాంకర్ ఇన్వెస్టర్ల లాక్-ఇన్ పీరియడ్ పెంపు, IPO నిబంధనలు కఠినతరం | Sebi tightens rules for IPOs, tweaks OFS norms

Markets regulator Securities and Exchange Board of India (SEBI) has tightened IPO (initial public offering) rules, according to a notification issued on 14 January.
Story first published: Tuesday, January 18, 2022, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X