For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌సైడర్ ట్రేడింగ్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి నోటీసులు

|

బిలియనీర్ ఇన్వెస్టర్ రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వచ్చాయి. తన కుటుంబానికి చెందిన ఐటీ ఎడ్యుటెక్ అండ్ ట్రెయినింగ్ సంస్థ ఆప్టెక్ షేర్లకు సంబంధించి ఇన్‌సైడర్ ట్రేడింగ్ ఆరోపణలతో సెబీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆప్టెక్ అతనికి, అతని కుటుంబం నియంత్రణలో ఉన్న సంస్థ.

విచారిస్తున్న సెబి

విచారిస్తున్న సెబి

దీనికి సంబంధించి సెబి రాకేష్ ఝున్‌ఝున్‌వాలా, అతని కుటుంబం, ఆప్టెక్ ఇతర బోర్డు మెంబర్స్, ఇన్వెస్టర్ రమేష్ ఎస్ ధమానీ, డైరెక్టర్ మధు జయకుమార్ తదితరుల పాత్రపై సెబి విచారిస్తోంది. ఈ అంశానికి సంబంధించిన బ్యాంకు అకౌంట్స్‌ను ప్రీజ్ చేయాలని యోచిస్తున్నట్లు కూడా సెబీ... ఝున్‌ఝున్‌వాలాకు పంపిన నోటీసులో పేర్కొందని తెలుస్తోంది.

గతంలోనే విచారణకు హాజరైన ఝున్‌ఝున్‌వాలా, ఫ్యామిలీ

గతంలోనే విచారణకు హాజరైన ఝున్‌ఝున్‌వాలా, ఫ్యామిలీ

స్టాక్ మార్కెట్ రెగ్యులేటర్ (సెబీ) ఈ ఏడాది జనవరి నెలలో ఝున్‌ఝున్‌వాలా సోదరుడు రాకేష్ కుమార్‌ను, భార్య రేఖ, అత్త సుశీలాదేవిని విచారణ నిమిత్తం పిలిచింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో గల సెబీ హెడ్ క్వార్టర్‌లో ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ ఎదుట రాకేష్ ఝున్‌ఝున్ వాలా కూడా విచారణకు హాజరయ్యారు. అతనిని అధికారులు కొన్ని గంటల పాటు విచారించారు.

నాలుగేళ్ల క్రితం...

నాలుగేళ్ల క్రితం...

స్టాక్ ఎక్స్చేంజీలో నిబంధనల ప్రకారం ఇన్‌సైడర్ ట్రేడింగ్ చట్టవిరుద్ధం. సొంత ప్రయోజనాల కోసం ఇన్‌సైడర్ ట్రేడింగ్ చేసేవారు ఉంటారు. మార్కెట్ రెగ్యులేటర్ ప్రత్యేకంగా నాలుగేళ్ల క్రితం అంటే 2016 ఫిబ్రవరి నుండి 2016 సెప్టెంబర్ మధ్య అంశానికి సంబంధించి విచారిస్తోంది. ఆ సమయంలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. మీడియాలో వస్తున్న వార్తల మేరకు సోదరుడు, భార్య 7,63,057 షేర్లను బ్లాక్ డీల్స్ ద్వారా కొనుగోలు చేసిన తర్వాత సెప్టెంబర్ 7, 2017న అప్పర్ సర్క్యూట్ రూ.175.05 వద్ద లాక్ చేశారు.

పెరిగిన వాటా

పెరిగిన వాటా

ఆప్టెక్‌లో రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు 24.24 శాతం వాటా ఉంది. ఈ వ్యాల్యూ రూ.160 కోట్లు. 2005లో అతను కంపెనీని కొనుగోలు చేసినప్పుడు అతని వాటా 10 శాతంగా ఉంది. ఆ తర్వాత ఈ వాటా క్రమంగా పెరిగింది. రాకేష్ ఝున్‌ఝున్ వాలా తన సొంత ఈక్విటీ పోర్ట్‌పోలియో రేర్ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా కార్యకలాపాలు నిర్వహిస్తాడు. కాగా, తాజా అంశానికి సంబంధించి రేర్ ఎంటర్‌ప్రైజెస్ సీఈవో, ఆప్టెక్ డైరెక్టర్ సోదరికి కూడా సెబి నోటీసులు పంపించిందని తెలుస్తోంది.

English summary

ఇన్‌సైడర్ ట్రేడింగ్: రాకేష్ ఝున్‌ఝున్‌వాలాకు సెబి నోటీసులు | Sebi sent show cause notice rakesh jhunjhunwala

The Securities & Exchange Board of India (Sebi) has shot off a show-cause notice to ace investor Rakesh Jhunjhunwala for alleged insider trading in the shares of Aptech, an IT education and training firm owned by him and family.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X