For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 ఏళ్ల కేసు, ముఖేష్, అనీల్ అంబానీ సోదరులకు రూ.25 కోట్ల జరిమానా

|

ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, నీతా అంబానీ, టీనా అంబాని సహా ఇతర కుటుంబ సభ్యులపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) రూ.25 కోట్ల పెనాల్టీ విధించింది. 2000 సంవత్సరంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ టేకోవర్ నిబంధనలు ఉల్లంఘించిన కేసులో సెబీ ఈ చర్యకు ఉపక్రమించింది. RIL ప్రమోటర్లుగా ఉన్న వీరు కొంతమందితో కుమ్ముక్కై 5 శాతం వాటాల స్వాధీనానికి సంబంధించిన వివరాలు ప్రకటించకపోవడం నేరంగా పరిగణించినట్లు తెలిపింది. దీంతో కంపెనీ నుండి తప్పుకునే హక్కు లేదా అవకాశం ఇతర వాటాదారులకు నిరాకరించినట్లయిందని, ఇందుకు వారిపై పెనాల్టీ విధిస్తున్నట్లు తెలిపింది.

ఇరవై ఏళ్ల క్రితం సంస్థలో 5 శాతం వాటా కంటే ఎక్కువ కొనుగోలు అంశాన్ని బయటకు వెల్లడించడానికి సంబంధించి విఫలమయ్యారని సెబీ తన 85 పేజీల ఆదేశాల్లో పేర్కొంది. ధీరూభాయ్ అంబానీ వ్యాపార సామ్రాజ్యాన్ని 2005లో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలు పంచుకున్నారు.

SEBI fines Mukesh Ambani, Anil Ambani, others Rs 25 crore on RIL shareholding irregularities

పీఏసీతో కలిసి ప్రమోటర్లు ఆర్ఐఎల్‌లో జనవరి 7, 2000లో 6.83 శాతం వాటా కొనుగోలు చేశారు. 5 శాతం కంటే ఎక్కువ వాటా కొనుగోలు చేస్తే ప్రజలకు వెల్లడించాల్సి ఉంటుంది. కానీ అలా జరగలేదని సెబీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే సంయుక్తంగా రూ.25 కోట్ల అపరాధ ఫైన్ విధించింది.

English summary

20 ఏళ్ల కేసు, ముఖేష్, అనీల్ అంబానీ సోదరులకు రూ.25 కోట్ల జరిమానా | SEBI fines Mukesh Ambani, Anil Ambani, others Rs 25 crore on RIL shareholding irregularities

The Securities and Exchange Board of India (Sebi) has imposed a penalty of Rs 25 crore on the Ambani family and firms linked to the promoter group for violation of takeover code regulations in the year 2000.
Story first published: Thursday, April 8, 2021, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X