For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇద్దరు ఇన్ఫోసిస్ ఉద్యోగులపై సెబి వేటు

|

ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై ఇద్దరు ఇన్ఫోసిస్ ఉద్యోగులపై చర్యలు తీసుకున్నది మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI). క్యాపిటల్ మార్కెటింగ్ నుండి ఆ ఇద్దరు ఉద్యోగులను బ్యాన్ చేసింది. ఇందుకు సంబంధించి అంతర్గత విచారణ జరుపుతున్నట్లు ఇన్ఫోసిస్ కూడా ప్రకటించింది.

ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ ఆరోప‌ణ‌ల‌తో పలువురిపై సెబి నిషేధం విధించింది. అలాగే, వీరికి రూ.3.06 కోట్ల జ‌రిమానా విధించింది. ఇన్ఫోసిస్‌కు చెందిన ఇద్ద‌రు ఎగ్జిక్యూటీవ్‌ల‌తో పాటు మ‌రో 6గురు వ్యాపారం చేయ‌కుండా సెబీ నిషేధించింది. గ‌త ఏడాది ఈ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వెలుగు చూసింది.

Sebi bans two Infosys employees for insider trading

ఈ కేసులో సీనియర్ కార్పొరేట్ కౌన్సిల్ ఆఫ్ ఇన్ఫోసిస్ ప్రన్షు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్ సుబ్రమణియన్‌ల‌ను, మరో ఆరుగురిని స్టాక్ బయ్యింగ్, కొనుగోలును నిషేధించింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇది అమలులో ఉంటుంది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని వ‌చ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఉద్యోగులు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ పాల్పడినట్లు గుర్తించారు.

English summary

ఇన్‌సైడర్ ట్రేడింగ్, ఇద్దరు ఇన్ఫోసిస్ ఉద్యోగులపై సెబి వేటు | Sebi bans two Infosys employees for insider trading

Market regulator Securities and Exchanges Board of India (Sebi) on Tuesday banned Infosys's senior corporate counsel Pranshu Bhutra and Venkata Subramaniam V. V Senior Principal, Corporate Accounting Group along with six other related entities from accessing capital markets until further orders for insider trading.
Story first published: Wednesday, June 2, 2021, 17:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X