ముంబై: ఫ్యూచర్ గ్రూప్-రిలయన్స్ ఒప్పందంపై అమెజాన్ కోర్టుకెక్కిన విషయం తెలిసిందే. అంతేకా, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(SEBI) ఫ్యూచర్ గ్రూప్ అధినేత కిషోర్ బియానీపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ స్పందించింది. రిలయన్స్‌తో జరిగిన రూ.24,713 కోట్ల తమ ఒప్పందంపై ప్రభావం చూపవని తెలిపింది. అంతేకాదు, ఫ్యూచర్ కార్పోరేట్ రిసోర్సెస్ ప్రయివేట్ లిమిటెడ్(FCRPL) కూడా సెబి చర్యలపై అప్పీల్ చేయాలని భావిస్తోంది.
ఫ్యూచర్ రిటైల్ లిమిటెడ్ CMD కిషోర్ బియానీతో పాటు ఆ సంస్థకు చెందిన కొందరు ప్రమోటర్లపై సెబీ వేటు వేసింది. కంపెనీ షేర్లలో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలతో కిషోర్ బియానీతోపాటు ఫ్యూచర్ కార్పొరేట్ రిసోర్సెస్ ప్రయివేట్ లిమిటెడ్ (FCRPL), అనిల్ బియానీ, FCRPL ఎంప్లాయీస్ ట్రస్ట్‌ను ఏడాదిపాటు సెక్యూరిటీస్ మార్కెట్ నుండి నిషేధించింది.

అంతేకాదు, కిషోర్ బియానీ, అనిల్ బియానీ, FCRPLకు రూ.కోటి చొప్పున జరిమానా విధించింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌తో అక్రమంగా ఆర్జించిన రూ.20.53 కోట్ల లాభాలను రిటర్న్ చేయాలని అందరికీ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ గ్రూప్ స్పందించింది. దీనిపై అప్పీల్‌కు వెళ్లాలని యోచిస్తోంది.
రిలయన్స్ గ్రూప్‌తో కుదుర్చుకున్న రూ.24,713 కోట్ల ఒప్పందం మీద యథాస్థితిని కొనసాగించాలన్న ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వును ఫ్యూచర్ రిటైల్ సంస్థ సవాల్ చేసింది. ఇందుకు సంబంధించి అప్పీలును ఢిల్లీ హైకోర్టు జాయింట్ రిజిస్ట్రార్ ముందు ఉంచింది. దీనిపై విచారణ జరుగుతోంది. సెబి చర్యలు రిలయన్స్‌తో డీల్‌కు అడ్డంకులు కలిగించదని ఫ్యూచర్ గ్రూప్ తెలిపింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications