For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమెజాన్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్టు

|

రిలయన్స్ రిటైల్-ఫ్యూచర్ గ్రూప్ ఒప్పందంపై అమెజాన్ దాఖలు చేసిన పిటిషన్ పైన తీర్పును సుప్రీం కోర్టు రిజర్వ్‌లో పెట్టింది. ఫ్యూచర్ - రిలయన్స్ ఒప్పందంపై ముందుకు వెళ్లవచ్చునని ఇటీవల ఢిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ అమెజాన్ సుప్రీం కోర్టుకు వెళ్లింది. ఫ్యూచర్-రిలయన్స్ రిటైల్ ఒప్పందాన్ని నిలిపివేస్తూ సింగపూర్‌కు చెందిన ఎమర్జెన్సీ ఆర్బిటరేటర్ ఇచ్చిన తీర్పును అమలు చేయాలని అమెజాన్ తన పిటిషన్లో పేర్కొంది.

ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన రిటైల్, హోల్‌సేల్, లాజిస్టిక్స్, వేర్‌హౌసింగ్ వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు రిలయన్స్ గత ఏడాది ఒప్పందం కుదుర్చుకుంది. దీని వ్యాల్యూ రూ.24,713 కోట్లు. అయితే ఫ్యూచర్ గ్రూప్‌కు చెందిన ఫ్యూచర్ కూపన్స్ లిమిటెడ్‌లో అమెజాన్ 2019లో 49% మేర పెట్టుబడులు పెట్టింది. ఫ్యూచర్ కూపన్స్‌కు 7.3% శాతం మేర ఫ్యూచర్ రిటైల్‌లో వాటా ఉంది. దీంతో మూడేళ్ల నుండి 10 ఏళ్ల లోపు ఫ్యూచర్ రిటైల్‌ను కొనుగోలు చేసే హక్కు అమెజాన్‌కు ఉంది.

SC reserves verdict on Amazons pleas against Future and Reliance deal

అయితే, రిలయన్స్‌-ఫ్యూచర్‌ మధ్య కుదిరిన ఒప్పందం ఈ నిబంధనను ఉల్లంఘిస్తోందని అమెజాన్ వాదిస్తోంది. ఈ క్రమంలో అమెజాన్ సింగపూర్ మధ్యవర్తిత్వ కోర్టును ఆశ్రయించింది. రిలయన్స్‌తో డీల్‌పై స్టే విధించింది. మరోవైపు ఢిల్లీ హైకోర్టులోని సింగిల్ బెంచ్ ధర్మాసనం కూడా అమెజాన్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది.

English summary

అమెజాన్ పిటిషన్‌పై తీర్పును రిజర్వ్‌లో ఉంచిన సుప్రీం కోర్టు | SC reserves verdict on Amazon's pleas against Future and Reliance deal

The SC Thursday reserved verdict on the pleas of e-commerce giant Amazon against the Rs 24,713 crore deal for merger of Future Retail Ltd (FRL) with Reliance Retail.
Story first published: Thursday, July 29, 2021, 19:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X