For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వారి చేతిలో ఫూల్స్ కావొద్దు! కస్టమర్లకు SBI హెచ్చరిక

|

ప్రభుత్వరంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) తన కస్టమర్లను ఫ్రాడ్‌స్టర్స్ గురించి హెచ్చరించింది. బ్యాంక్ ఖాతాదారులనుండి డబ్బు దొంగిలించేందుకు సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. ఏటీఎం కార్డు బ్లాక్ అయిందని నకిలీ ఫోన్ కాల్స్, ఈ మెయిల్స్ పంపించి సైబర్ నేరగాళ్లు ఖాతాదారులను మోసం చేసేవారు. వీటి గురించి బ్యాంకులు తమ కస్టమర్లను ఎప్పటికి అప్పుడు హెచ్చరించేవి. ఇప్పుడు లాటరీ మోసంపై కస్టమర్లను అప్రమత్తం చేస్తోంది. లాటరీ గెలిచినట్లు మీకు వాట్సాప్ మెసేజ్ లేదా ఫోన్ కాల్ వస్తే వాటిని అస్సలు నమ్మవద్దని ఎస్బీఐ ఖాతాదారులకు సూచించింది.

ఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువఆటో, పర్సనల్, గోల్డ్, హోమ్‍‌లోన్లపై SBI బంపరాఫర్: ప్రాసెసింగ్ ఫీజు 0, ఇలా చేస్తే వడ్డీ చాలా తక్కువ

లాటరీ గెలిచినట్లు..

లాటరీ గెలిచినట్లు..

మీరు లాటరీ గెలిచినట్లు మెసేజ్ వస్తే వెంటనే దగ్గరలోని ఎస్బీఐ బ్యాంకును సంప్రదించాలని ఖాతాదారులకు బ్యాంకు సూచించింది. ఎస్బీఐ ఎలాంటి లాటరీ స్కీంలు నిర్వహించడం లేదని కూడా స్పష్టం లేదని స్పష్టం చేసింది. మీరు చేసే చిన్న పొరపాటు సైబర్ నేరగాళ్లకు వరంగా మారుతుందని, కాబట్టి వాట్సాప్‌లో వచ్చే ఫార్వార్డ్ సందేశాలు, నకిలీ కాల్స్‌ను నమ్మవద్దని హెచ్చరించింది. ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ కాల్, వాట్సాప్ కాల్ ద్వారా కస్టమర్ల పర్సనల్, బ్యాంకు ఖాతా వివరాలను బ్యాంకు సేకరించదని తెలిపింది.

సైబర్ నేరగాళ్ల చేతిలో ఫూల్స్ కావొద్దు..!

సైబర్ నేరగాళ్ల చేతిలో ఫూల్స్ కావొద్దు..!

సైబర్ నేరగాళ్ల పట్ల ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. 'కస్టమర్లను ఇప్పుడు వాట్సాప్ ద్వారా సైబర్ నేరగాళ్లు లక్ష్యంగా చేసుకుంటున్నారు. సైబర్ నేరగాళ్ల మిమ్మల్ని ఫూల్స్ చేసే అవకాశం ఇవ్వవద్దు. వీటి పట్ల అప్రమత్తంగా ఉండండి.' అని ఎస్బీఐ ట్వీట్ చేసింది. వాట్సాప్, మెసేజ్‌ల ద్వారా మోసం చేసే సైబర్ నేరగాళ్ల బుట్టలో పడవద్దని హెచ్చరించింది.

ఎస్బీఐ సూచనలు...

ఎస్బీఐ సూచనలు...

- సైబర్ నేరగాళ్లు ఫోన్ కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా లాటరీ గెలిచినట్లు చెప్పి, కాంటాక్ట్ చేయమని చెబుతారు.

- ఎస్బీఐ ఎప్పుడు కూడా ఈ-మెయిల్, ఎస్సెమ్మెస్, కాల్, వాట్సాప్ ద్వారా మీ పర్సనల్, అకౌంట్ వివరాలు అడగదు.

- లాటరీ స్కీంలు లేదా లక్కీ కస్టమర్ బహుమతులు లేవు. కాబట్టి అలాంటి వారి మాటల పట్ల జాగ్రత్తగా ఉండాలి.

- ఈ సందేశాన్ని అందరికీ షేర్ చేసి, ఫ్రాడ్‌స్టర్స్ బారిన పడకుండా చూడాలని పేర్కొంది.

English summary

వారి చేతిలో ఫూల్స్ కావొద్దు! కస్టమర్లకు SBI హెచ్చరిక | SBI warns customers of fraud via fake WhatsApp calls and messages

SBI has warned its account holders to be aware of unknown whatsapp calls and messages that may ask customers about bank details and it may lead to possible banking fraud with account holders.
Story first published: Tuesday, September 29, 2020, 7:37 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X