For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. శుభవార్త: వడ్డీ రేటు తగ్గించిన SBI

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన కస్టమర్లకు శుభవార్త చెప్పింది. ఇది తాజాగా మరోసారి ఎక్స్టర్నల్ బెంచ్‌మార్క్ ఆధారిత రేటును తగ్గించింది. 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో ఇప్పటి వరకు 8.05 శాతంగా ఉన్న వడ్డీ రేటు 7.80 శాతానికి దిగి వస్తుంది. ఈ మేరకు సోమవారం (డిసెంబర్ 30) ప్రకటించింది.

ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్ITR మిస్ అయ్యారా? వారమే గడువు.. ఆ తర్వాత రూ.5,000 ఎక్కువ ఫైన్

25 బేసిస్ పాయింట్లు తగ్గుదల

25 బేసిస్ పాయింట్లు తగ్గుదల

25 బేసిస్ పాయింట్లను తగ్గిస్తున్నామని, 8.05 నుంచి వడ్డీ రేటు 7.80 శాతానికి దిగి వస్తుందని ఎస్బీఐ ప్రకటించింది. ఈ సవరించిన రేటు జనవరి 1, 2020 నుంచి అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్బీఐ వరుసగా ఎనిమిదోసారి వడ్డీ రేట్లలో కోత విధించింది. గత నెలలో 10 బేసిస్ పాయింట్లు తగ్గించింది.

హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనం

హోమ్ బయ్యర్స్‌కు ప్రయోజనం

ఎస్బీఐ నిర్ణయంతో రెపో రేటుతో అనుసంధానించిన హోమ్ లోన్ వడ్డీ రేట్లపై కస్టమర్లకు ప్రయోజనం కలగనుంది. వినియోగదారులకు ఈఎంఐ భారం తగ్గుతుంది. దీంతో పాటు ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు కూడా ప్రయోజనం చేకూరుతుంది. హోమ్ బయ్యర్స్‌కు వడ్డీ రేటు ఇదివరకు ఉన్న 8.15 శాతం నుంచి ఇప్పుడు 7.90 శాతానికి తగ్గనుంది.

రెపో రేటుతో లింక్

రెపో రేటుతో లింక్

ఎస్బీఐ ఎక్స్టర్నల్ బెంచ్ మార్క్ లెండింగ్ రేటును ఆర్బీఐ రెపో రేటుతో లింక్ చేసింది. ప్రస్తుతం ఆర్బీఐ రెపో రేటు 5.15 శాతంగా ఉంది. ఆర్థిక మందగమనం నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును పలు పర్యాయాలు తగ్గించిన విషయం తెలిసిందే.

English summary

హోమ్ లోన్ తీసుకుంటున్నారా.. శుభవార్త: వడ్డీ రేటు తగ్గించిన SBI | SBI home loan interest rate cut to 7.90% from 8.15% wef Jan 1, 2020

The SBI, on December 30, reduced its external benchmark-based rate (EBR) by 25 basis points from 8.05 percent to 7.80 percent . As per the official statement of India's largest lending institution, the new rates will be applicable from January 1, 2020.
Story first published: Monday, December 30, 2019, 12:14 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X