For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI home loan: మార్చి వరకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా, 6.8 శాతం వడ్డీకే హోంలోన్

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మార్చి వరకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా 6.8 శాతం వడ్డీ రేటుకు హోంలోన్స్ అందిస్తోంది. హోంలోన్ విభాగంలో ఎస్బీఐ దేశం మొత్తం మీద 34 శాతం వాటాను సాధించే ప్రణాళికలతో ముందుకు సాగుతోంది. ఎస్బీఐ ఆమోదించిన ప్రాజెక్టుల్లో హోంలోన్స్ పొందే కస్టమర్ల కోసం 2021 మార్చి వరకు ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా మాఫీ చేసింది. హోంలోన్ బిజినెస్ అభివృద్ధికి, కస్టమర్ల వృద్ధిని పెంచేందుకు బ్యాంకు సిబ్బంది, వినియోగదారుల అన్ని విశ్లేషణలను పరిగణలోకి తీసుకుంటుంది. కస్టమర్ల కోసం హోంలోన్ ప్రయాణాన్ని సులభతరం చేసేందుకు బ్యాంకు అన్ని అంశాలను పరిశీలిస్తోందని చెబుతున్నారు.

ఎస్బీఐ పీఎంఏవై

ఎస్బీఐ పీఎంఏవై

ఎస్బీఐ గత ఏడాది డిసెంబర్ నాటికి ప్రధానమంత్రి ఆవాస్ యోజన సబ్సిడీని దాదాపు 2 లక్షల హోంలోన్ బయ్యర్స్‌కు అందించింది. ఈ సబ్సిడీని ప్రాసెస్ చేసేందుకు సెంట్రల్ నోడల్ ఏజెన్సీగా గృహనిర్మాణ, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ నియమించిన ఒకే ఒక బ్యాంకు ఎస్బీఐ. 2022 నాటికి అందరికీ ఇళ్లు అనే ప్రభుత్వ నినాదానికి మద్దతుగా ఎస్బీఐ PMAY కింద దాదాపు రెండు లక్షల ఇళ్లను మంజూరు చేసింది. బ్యాంకు హోంలోన్ వ్యాపారం మాత్రమే కాకుండా ఇతర వ్యాపారాలను కూడా ముందుకు నడిపించడంలో కీలకపాత్ర పోషించగల ఏ1, క్లౌడ్, బ్లాక్ చెయిన్, మెషిన్ లెర్నింగ్‌ను అమలు చేయడంపై దృష్టి సారించింది.

రూ.5 లక్షల కోట్ల మార్కు

రూ.5 లక్షల కోట్ల మార్కు

గృహ రుణాల కోసం సహ రుణ నమూనాను ప్రారంభించేందుకు ఎస్బీఐ సన్నద్ధమవుతోంది. 215 కేంద్రాల్లో సెంట్రల్ ప్రాసెసింగ్ సెంటర్స్, బ్యాంకు డిజిటల్, లైఫ్ స్టైల్ ప్లాట్‌ఫాం, యోనో ద్వారా విస్తరించబడిన విస్తారమైన శాఖల అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడంతో ఎస్బీఐ హోంలోన్ వ్యాపారంలో రూ.5 లక్షల కోట్ల మార్కును దాటింది.

రూ.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చు

రూ.7 లక్షల కోట్లకు చేరుకోవచ్చు

తమ హోంలోన్ పోర్ట్‌‌ఫోలియో 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 7 లక్షల కోట్లకు చేరుకోవచ్చునని ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా అన్నారు. ఎస్బీఐ అసెట్ బుక్‌లో హోంలోన్ అతిపెద్ద పోర్ట్ పోలియో. డిసెంబర్ నాటికి ఈ వాటా 23 శాతంగా ఉంది. రూ.5 లక్షల కోట్ల వ్యాపారంలో హోంలోన్స్ రూ.4.86 లక్షల కోట్లుగా ఉన్నాయ. ఇటీవలే రూ.5 లక్షల కోట్లు దాటింది.

English summary

SBI home loan: మార్చి వరకు ప్రాసెసింగ్ ఫీజు లేకుండా, 6.8 శాతం వడ్డీకే హోంలోన్ | SBI home loan at just 6.8 percent, no processing fee

With interest starting as low as 6.80% per annum, SBI commands a market share of 34% in the home loan segment. On average, the bank onboards around 1000 home loan customers per day that signifies SBI’s commitment towards affordable housing.
Story first published: Friday, February 12, 2021, 16:01 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X