For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Alert: KYC పూర్తి చేయని ఖాతాలకు షాకిచ్చిన SBI.. అకౌంట్ల నుంచి క్యాష్ విత్ డ్రా కావట్లేదు..

|

KYC Updation: కేవైసీ అప్‌డేట్ డ్రైవ్‌లో భాగంగా జూలై 1, 2022 నుంచి తమ KYCని అప్‌డేట్ చేయని కస్టమర్ల ఖాతాల 'స్కోర్‌లను' SBI స్తంభింపజేసింది. ఈ విషయంపై కస్టమర్లను 'చాలా ముందుగానే' బ్యాంక్ అప్రమత్తమత్తం చేసిందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇయితే దీనికి సంబంధించి బ్యాంక్ లాగిన్ పోర్టల్‌లో ఎలాంటి నోటిఫికేషన్ లేదు.

డబ్బులు డ్రా అవ్వటం లేదు..

డబ్బులు డ్రా అవ్వటం లేదు..

"జీతాలు క్రెడిట్ అయ్యే సమయంలో ఈ ప్రక్రియ కొనసాగుతున్నందున వినియోగదారులకు ఇది ఇబ్బంది కలిగింటవచ్చు. బ్యాంక్ తీసుకున్న నిర్ణయం గురించి నాకు ఎవరూ తెలియజేయలేదు. ఇప్పుడు నేను డబ్బులు డ్రా చేసుకోలేకపోతున్నాను." అని ఒక బ్రాంచ్‌లోని SBI కస్టమర్ తెలిపారు.

ఇతర బ్యాంకుల విషయంలోనూ కేవైసీ విషయంలో ఇదే ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. దీనిని ఆలస్యంగా గమనించిన అనేక మంది వినియోగదారులు హడావిడిగా ఇప్పుడు బ్యాంకులకు క్యూ కడుతున్నారు. తమ కేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

ముందుగానే హెచ్చరిక..

ముందుగానే హెచ్చరిక..

చాలా మంది కస్టమర్లకు ముందుగానే తెలియజేయకపోవడం వల్ల ఇలాంటి అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు. అయితే.. కస్టమర్లకు వ్యక్తిగతంగా వారి KYC నిబంధనలను అప్‌డేట్ చేయమని కోరుతూ 'చాలా ముందుగానే'.. ఒక నోటిఫికేషన్ జారీ చేయబడిందని, లేఖలు కూడా పంపినట్లు SBI సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు. బ్యాంక్ వెబ్ సైట్ లో ఎలాంటి నోటిఫికేషన్ లేదా హెచ్చరిక కనిపించనప్పటికీ.. ఏటీఎంలో లేదా ఆన్‌లైన్‌లో లావాదేవీలు చేసేందుకు ప్రయత్నిస్తే కస్టమర్లకు మాత్రమే ఈ విషయం తెలుస్తోంది.

రిజర్వు బ్యాంక్ సూచన మేరకు..

రిజర్వు బ్యాంక్ సూచన మేరకు..

ఆన్‌లైన్ మోసాల ముప్పు పెరుగుతున్నందున, KYCని క్రమం తప్పకుండా అప్‌డేట్ చేయాలని బ్యాంకులకు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) సూచించింది. బ్యాంకులు గతంలో పదేళ్లకు ఒకసారి KYC అప్‌డేట్‌ను చేసేవి. కానీ ఇప్పుడు.. ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి కేవైసీ చేయాల్సి వస్తోందని తెలుస్తోంది.

కరోనా కారణంగా..

కరోనా కారణంగా..

"మహమ్మారి సమయంలో చాలా మంది బ్యాంకులను సందర్శించడం మానేసినందున అనేక ఖాతాలను నవీకరించాల్సిన అవసరం ఉంది. కస్టమర్ భద్రతను నిర్ధారించడానికి KYC చేసుకోవటం అవసరం" అని SBI అధికారి తెలిపారు. వీటికి తోడు ఇతర బ్యాంకులతో విచారణల కోసం బ్యాంకులకు వినియోగదారుల తాజా కేవైసీ చాలా అవసరమని తెలుస్తోంది.

English summary

SBI Alert: KYC పూర్తి చేయని ఖాతాలకు షాకిచ్చిన SBI.. అకౌంట్ల నుంచి క్యాష్ విత్ డ్రా కావట్లేదు.. | SBI freezes accounts of people whose accounts KYC not updated in time from july 1st

SBI freezes accounts of people whose accounts KYC not updated in time from july 1st customers are in shock as cash withdrawings stopped.
Story first published: Monday, July 4, 2022, 16:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X