For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త, రుణాలు మరింత చౌక

|

ప్రభుత్వరంగ దిగ్గజం స్టేట్ బ్యాంకు ఆఫ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) మరోసారి తన అకౌంట్ హోల్డర్లకు శుభవార్త చెప్పింది. అన్ని రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ లెండింగ్ రేటు(MCLR)ని ఐదు బేసిస్ పాయింట్లు తగ్గించింది. కొత్త రేట్లు ఈ నెల 10 నుంచి అమలులోకి వస్తున్నాయి.

అమ్మఒడికి దరఖాస్తు.. అర్హతలు: 75% హాజరు ఉంటేనేఅమ్మఒడికి దరఖాస్తు.. అర్హతలు: 75% హాజరు ఉంటేనే

దీంతో పాటు డిపాజిట్లపై వడ్డీరేట్లను కూడా 15 బేసిస్ పాయింట్ల నుంచి 75 బేసిస్ పాయింట్ల వరకు తగ్గించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వడ్డీ రేట్లను తగ్గించడం ఇది ఏడోసారి కావడం గమనార్హం. బ్యాంకు తీసుకున్న తాజా నిర్ణయంతో ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీ రేటు ఎనిమిది శాతానికి తగ్గనుందని బ్యాంకు ఒక ప్రకటనలో తెలిపింది.

 SBI cuts lending rates, loans to get cheaper

మార్కెట్లో నిధుల లభ్యతను పెంచడానికి టర్మ్ డిపాజిట్స్ పైన వడ్డీ రేట్లలో కోత విధించింది. ఈ రేట్లు కూడా సోమవారం నుంచి అమలులోకి వస్తున్నాయి. ఏడాది నుంచి రెండేళ్ల లోపు లోపు కాలపరిమితి కలిగిన టర్మ్ డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు తగ్గించింది. బల్క్ టర్మ్ డిపాజిట్లపై రేట్లను 30 నుంచి 75 బేసిస్ పాయింట్లు కోత విధించిన విషయం తెలిసిందే.

English summary

ఎస్బీఐ కస్టమర్లకు శుభవార్త, రుణాలు మరింత చౌక | SBI cuts lending rates, loans to get cheaper

India's biggest bank State Bank of India or SBI today lowered lending rates, making loans cheaper. SBI cut its MCLR or marginal cost of fund based lending rate by 5 basis points across all tenors, its 7th consecutive cut in borrowing rates in FY 2019-20.
Story first published: Saturday, November 9, 2019, 18:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X