For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

FY22లో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా వేతనం రూ.34.42 లక్షలు

|

భారత అతిపెద్ద బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(SBI) దినేష్ కుమార్ ఖారా వేతనం సంవత్సరానికి రూ.34.42 లక్షల కోట్లు. 2021-22 ఆర్థిక సంవత్సరానికి గాను ఆయన బేసిక్ పే ద్వారా రూ.27 లక్షలు పొందగా, రూ.7.42 లక్షలు డీఏ రూపంలో అందుకున్నారు. ప్రోత్సాహకాల రూపంలో మరో రూ.4 లక్షలు అందాయి.

మొత్తంగా ఏడాది కాలంలో ఆయన రూ.38.12 లక్షలు వేతనంగా పొందారు. గత ఏడాదికి సంబంధించి ఎస్బీఐ వెలురించిన వార్షిక నివేదికలో ఇందుకు సంబంధించిన సమాచారం వెల్లడైంది. దినేష్ ఖారా 2020 అక్టోబర్ నెలలో ఎస్బీఐ చైర్మన్‌‍గా బాధ్యతలు చేపట్టారు. ఎస్బీఐ బోర్డులో ఉన్న నలుగురు మేనేజింగ్ డైరెక్టర్లు అదే స్థాయిలో వేతనాలు అందుకుంటున్నారు.

SBI Chairman Dinesh Khara draws ₹34.42 lakh salary in FY22

ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల అధినేతల విషయానికి వస్తే కెనరా బ్యాంకు ఎండీ, సీఈవో ప్రభాకర్ రూ.36.89 లక్షలు, బ్యాంక్ ఆఫ్ బరోడా ఎండీ, సీఈవో సంజీవ్ చద్దా రూ.40.46 లక్షల వేతనం పొందారు. ప్రయివేటు బ్యాంకుల అధిపతులు భారీగా వేతనం అందుకుంటున్నారు. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను HDFC బ్యాంకు ఎండీ, సీఈవో శశిధర్ జగదీశన్ ఏడాదికి రూ.4.77 కోట్లు, యాక్సిస్ బ్యాంకు ఎండీ అమితాబ్ చౌదరి ఏడాదికి రూ.6 కోట్ల వేతనం అందుకున్నారు. ఐసీఐసీఐ బ్యాంకు ఎండీ, సీఈవో సందీప్ భక్షి మాత్రం కరోనా సంక్షోభం నేపథ్యంలో ఒక్క రూపాయి మాత్రమే గౌరవ వేతనం తీసుకున్నారు.

English summary

FY22లో ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా వేతనం రూ.34.42 లక్షలు | SBI Chairman Dinesh Khara draws ₹34.42 lakh salary in FY22

SBI chairman Dinesh Kumar Khara takes home more than ₹34.42 lakh crore for the financial year, rising by 13.4% from his predecessor Rajnish Kumar.
Story first published: Monday, June 6, 2022, 20:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X