For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI Cards IPO: ఐపీవో ధరల శ్రేణి ఎంత, ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చా?

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి చెందిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ (ఎస్బీఐకార్డ్) ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (IPO) మార్చి 2వ తేదీన ప్రారంభమవుతోంది. ఎస్బీఐ కార్డ్ ఐపీవోపై ఎంతోమంది ఇన్వెస్టర్లు కోటి ఆశలతో ఉన్నారు. ప్రయివేటురంగానికి ధీటుగా నడుస్తున్న ఎస్బీఐ ఆధ్వర్యంలోనిది కావడంతో ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎస్బీఐ కార్డ్ ఐపీవో గురించి కొన్ని అంశాలు..

2008 తర్వాత తొలిసారి.. కరోనా భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1100 పాయింట్లు డౌన్2008 తర్వాత తొలిసారి.. కరోనా భయంతో కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు, సెన్సెక్స్ 1100 పాయింట్లు డౌన్

ధరల శ్రేణి

ధరల శ్రేణి

ఎస్బీఐ కార్డ్స్ IPO సోమవారం అంటే మార్చి 2న ప్రారంభమై మార్చి 5వ (గురువారం) తేదీన ముగుస్తుంది. ఇష్యూలో భాగంగా షేరు ధర శ్రేణిని కనిష్ఠంగా రూ.750, గరిష్ఠంగా రూ.755గా ప్రకటించారు. ఎస్బీఐకి చెందిన క్రెడిట్ కార్డ్స్ అనుబంధ సంస్థ అయిన ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ ఈ ఇష్యూ ద్వారా రూ.10 వేల కోట్లను సమీకరించాలని భావిస్తోంది.

రెండింటిలో లిస్టింగ్

రెండింటిలో లిస్టింగ్

కనీసం 19 షేర్లకు (లాట్) దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కూడా 19 చొప్పున అదనంగా తీసుకోవచ్చు. గరిష్ఠ ధరలో 19 షేర్ల ధర రూ.14,345. ఈ షేర్లు NSE, BSE రెండింటిలో లిస్టింగ్ చేస్తారు. ఎస్బీఐ షేర్ పరిమాణం 10,350 కోట్లు. ముఖ విలువ రూ.10. ఈ నెల 16వ తేదీన NSE, BSE షేర్లు నమోదు కావొచ్చు.

ఎస్బీఐ, ఎస్బీఐ కార్డ్స్ ఉద్యోగులకు...

ఎస్బీఐ, ఎస్బీఐ కార్డ్స్ ఉద్యోగులకు...

ఎస్బీఐ షేర్ హోల్డర్స్‌కు 10 శాతం షేర్లను ప్రత్యేకంగా కేటాయించారు. ఫిబ్రవరి 18వ తేదీ నాటికి ఎస్బీఐ షేర్లు ఉన్న వారంతా ఈ విభాగంలో దరఖాస్తు చేసుకోవచ్చు. ఎస్బీఐ, ఎస్బీఐ కార్డ్ హోల్డర్ల ఉద్యోగులకు 18.4 లక్షల షేర్లు కేటాయించారు. వీరికి ఒక్కో షేరు పైన 75 శాతం రాయితీ ఉంటుంది.

దరఖాస్తు చేసుకోవచ్చా?

దరఖాస్తు చేసుకోవచ్చా?

ఎస్బీఐ కార్డ్స్ ఇష్యూలకు దరఖాస్తు చేసుకుంటే మంచిది అనేది మార్కెట్ నిపుణుల అంచనా. క్రెడిట్ కార్డు మార్కెట్లో దీనికి బలమైన స్థానం ఉంది. డిజిటల్ చెల్లింపులకు ఆదరణ పెరుగుతోంది. కాబట్టి ఇవి కలిసి రానున్నాయని చెబుతున్నారు. ఎక్స్చేంజీల్లో ఈ రంగం నుండి అడుగుపెడుతున్న తొలి సంస్థ కూడా. కాబట్టి ఇన్వెస్టర్ల నుంచి స్పందన ఉంటుందని భావిస్తున్నారు.

ఐపీవో సరే.. సమయమే...

ఐపీవో సరే.. సమయమే...

ఎస్బీఐ కార్డ్స్ ఐపీవోకు ఇన్వెస్టర్ల నుండి మంచి స్పందన వస్తుందని భావిస్తున్నారు. అయితే ప్రస్తుతం మార్కెట్ పరిస్థితి ఆశాజనకంగా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఐపీవో ప్రతికూల అంశమనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.

Read more about: sbi sbi card ipo ఎస్బీఐ
English summary

SBI Cards IPO: ఐపీవో ధరల శ్రేణి ఎంత, ఇష్యూకు దరఖాస్తు చేసుకోవచ్చా? | SBI Cards Initial Public Offer Opens Today: Know about IPO

State Bank of India owned SBI Cards & Payment Services’ (SBI Card) initial public offering will open for subscription from March 2 through March 5.
Story first published: Monday, March 2, 2020, 11:04 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X