SBI రాఖీ ఆఫర్: యోనో యాప్ పై షాపింగ్ చేస్తే భారీ డిస్కౌంట్..ఎంతంటే..?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) తన వినియోగదారుల కోసం రక్షా బంధన్ సందర్భంగా ప్రత్యేక ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. SBI కస్టమర్లు ఫెర్న్స్ అండ్ పెటల్స్‌లో చేసే కొనుగోళ్లపై రూ .999 వరకు లేదా ఫ్లాట్ 20% వరకు డిస్కౌంట్ ప్రకటించింది. కానీ దీని కోసం వారు యోనో ఎస్‌బీఐ ని ఉపయోగించాలి. ఆఫర్ పొందడానికి SBI యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవడం తప్పనిసరి. ఇక ఎస్‌బీఐ ప్రకటించిన ఆఫర్‌పై ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే అధికారిక SBI YONO వెబ్‌సైట్ sbiyono.sbi కి లాగిన్ అయి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి.

రక్షా బంధన్ ఆఫర్
రక్షా బంధన్ సందర్భంగా మీ ప్రియమైనవారికి బహుమతులు కొనుగోలు చేసేందుకు మరింత సులభతరం చేయడానికి SBI నుంచి వచ్చిన ఈ ఆఫర్ సహాయపడుతుంది. ఈ ఆఫర్ వినియోగించుకుని కస్టమర్లు ఇతర ప్రజలు రక్షా బంధన్‌ను జరుపుకోవాలని ఎస్‌బిఐ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా తెలియజేసింది. ఫెర్న్ ఎన్ పెటల్స్ వద్ద షాపింగ్ చేయండి మరియు YONO SBI ద్వారా రూ .999 వరకు లేదా 20% తగ్గింపు పొందండి.

రూ.999 వరకు డిస్కౌంట్
పవిత్రమైన రక్షా బంధన్ పండుగ ఈ ఏడాది ఆగస్టు 22 న వస్తోంది. SBI ఖాతాదారులు యోనో SBI ద్వారా రాఖీ 2021 పండగను మరింత కలర్‌ఫుల్‌గా మార్చుకోండి. షాపింగ్ చేయడం ద్వారా రూ. 999 వరకు లేదా ఫ్లాట్ 20% డిస్కౌంట్ పొందుతారు. SBI వినియోగదారులు ఈ ఆఫర్‌ని ఆగస్టు 22, 2021 వరకు పొందవచ్చు. ఇక్కడ మరో మంచి విషయం ఏంటంటే... ఈ ఆఫర్‌లో కనీస ఆర్డర్ పరిమితి లేదు. అంటే కస్టమర్ ఏదైతే కొనుగోలు చేయాలనుకుంటున్నాడో అంత మేరా డబ్బులు చెల్లించి కొనుగోలు చేయొచ్చు. అదే సమయంలో డిస్కౌంట్స్ కూడా పొందొచ్చు.

కోడ్ తప్పనిసరిగా ఇవ్వాలి
SBI వినియోగదారులు ఈ ఆఫర్ పొందేందుకు 'SBI20' కోడ్‌ని ఉపయోగించాల్సిన అవసరం ఉందన్న విషయం ఎట్టిపరిస్థితుల్లో మరువకూడదు. లేదంటే ఆఫర్ వర్తించదు. దేశంలోని అతి పెద్ద బ్యాంక్ ఖాతాదారులు కూడా ఈ ఆఫర్ 'రక్షా బంధన్ కేటగిరీ'లో మాత్రమే చెల్లుబాటు అవుతుందని గుర్తెరగాలి.ఇప్పటికీ యోనో యాప్ లేని కస్టమర్లు వెంటనే యోనో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని రిజిస్టర్ చేసుకోవాలి.యోనో యాప్ ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ పరికరాల్లో డౌన్‌లోడ్ చేసుకునేందుకు అందుబాటులో ఉంది. ప్రియమైన వారి కోసం బహుమతులు కొనుగోలు చేసేటప్పుడు, భారీ డిస్కౌంట్‌లను పొందడానికి పైన పేర్కొన్న కోడ్ అంటే SBI20ని ఉపయోగించండి.

గృహ రుణాలపై కూడా..
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా SBI గృహ రుణాలపై ఆఫర్‌ను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ కింద, కస్టమర్‌లు జీరో ప్రాసెసింగ్ ఫీజును పొందవచ్చు. ఎస్‌బీఐ మహిళా కస్టమర్‌లు 0.05 శాతం తక్కువ వడ్డీ రేటుతో రుణం పొందేందుకు వెసులుబాటు కల్పించింది. యోనో వినియోగదారులు కూడా అదే తగ్గింపు ప్రయోజనాన్ని పొందగలరు.
SBI కస్టమర్లు 6.70 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో గృహ రుణాలు తీసుకోవచ్చు. గృహ రుణాలు పొందాలనుకునేవారు దీనిపై పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకునేవారు ఈ ఫోన్ నెంబర్‌పై( 7208933140) మిస్డ్ కాల్ ఇవ్వాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ నెంబర్‌కు మిస్ట్ కాల్ ఇస్తే చాలు బ్యాంకు సిబ్బందే మీకు ఫోను లేదా మెసేజ్ ద్వారా అందుబాటులోకి వస్తారు.