For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్షమాభిక్షతో బయటపడ్డ శాంసంగ్ వైస్ ఛైర్మన్ జే-యాంగ్..

|

లంచం కేసులో శిక్ష అనుభవిస్తున్న శాంసంగ్ వైస్ ఛైర్మన్ జే-యాంగ్ క్షమాభిక్ష లభించింది. 18 నెలల జైలు శిక్ష అనుభవించిన లీ జే యాంగ్‌ క్షమాభిక్షతో కేసు నుంచి బయటపడ్డాడు. దేశ ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని జైల్లో ఉన్న వ్యాపార ప్రముఖులకు.. ఇలా కేసుల నుంచి విముక్తి కల్పించడం దక్షిణ కొరియాలో ఎప్పటి నుంచో ఉంది.

లిబరేషన్‌ డే

లిబరేషన్‌ డే

ఆగస్టు 15న దక్షిణ కొరియా లిబరేషన్‌ డే సందర్భంగా దాదాపు 1700 మంది దోషులకు అధ్యక్షుడు యూన్‌ సుక్‌ ఇయోల్‌ క్షమాభిక్ష పెట్టనున్నారు. ఇందులో జే యాంగ్‌తో పాటు ప్రముఖ వ్యాపారవేత్తలు షిన్‌ డాంగ్‌ బిన్‌, ఛాంగ్‌ సే-జూ, కాంగ్‌ డూక్‌-సూ కూడా ఉన్నారు. ఫోర్బ్స్ ప్రకారం, లీ $7.9 బిలియన్ల నికర విలువతో ప్రపంచంలోని ధనవంతుల జాబితాలో 278వ స్థానంలో ఉన్నాడు.

18 నెలల జైలు శిక్ష

18 నెలల జైలు శిక్ష

అతని అసలు శిక్షలో సగానికి పైగా 18 నెలల జైలు శిక్ష అనుభవించిన తర్వాత, ఆగస్టు 2021లో పెరోల్‌పై విడుదలయ్యాడు. 54 ఏళ్ల లీ జే యాంగ్‌, శాంసంగ్‌ గ్రూప్‌ అధినేత లీ కున్‌ హీ పెద్ద కుమారుడు. ఆయనకు వారసుడైన యాంగ్‌, శాంసంగ్‌ ఎలక్టాన్రిక్స్‌ వైస్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. లంచం కేసులో 2017లో యాంగ్‌ను అక్కడి పోలీసులు అరెస్ట్ చేశారు.

పార్క్‌ గ్వెన్‌ హై

పార్క్‌ గ్వెన్‌ హై

శాంసంగ్‌కు చెందిన రెండు అనుబంధ కంపెనీల విలీనానికి ప్రభుత్వం నుంచి అనుమతులు పొందేందుకు 2015లో అప్పటి దేశాధ్యక్షురాలు పార్క్‌ గ్వెన్‌ హైకు యాంగ్ లంచం ఇచ్చారని అరెస్టు చేశారు. కేసును విచారించిన కోర్టు యాంగ్‌కు అయిదేళ్ల జైలు శిక్ష విధించిచగా ఆయన పై కోర్టును ఆశ్రయించారు. పై కోర్టు శిక్షను నిలిపివేసింది. అయితే సుప్రీం కోర్టు అతని రెండున్నరేళ్లకు తగ్గించింది.

English summary

క్షమాభిక్షతో బయటపడ్డ శాంసంగ్ వైస్ ఛైర్మన్ జే-యాంగ్.. | Samsung Vice Chairman Lee Jae Yang has been pardoned by the President of South Korea

Billionaire Samsung Boss, Convicted In Bribery Case, Gets Presidential PardonSamsung boss Lee Jae-yong was convicted of bribery and embezzlement in January last year
Story first published: Saturday, August 13, 2022, 10:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X