For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు శాంసంగ్ డిస్‌ప్లే యూనిట్: యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ

|

ఎలక్ట్రానిక్ దిగ్గజం శాంసంగ్ తన డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు తరలించింది. ఉత్తర ప్రదేశ్‌లోని నోయిడాకు తరలించింది. ఈ మేరకు శాంసంగ్ సౌత్ ఈస్ట్ ఏసియా ప్రెసిడెంట్ అండ్ సీఈవో కెన్ కాంగ్ ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను సోమవారం కలిశారు.

బెట్టర్ ఇండస్ట్రియల్ ఎన్విరాన్‌మెంట్, ఇన్వెస్టర్ ఫ్రెండ్లీ పాలసీలు ఇక్కడ ఉన్నాయని, దీంతో డిస్‌ప్లే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఇక్కడకు తరలిస్తున్నట్లు తెలిపారు. చెన్నైలో ఉన్న ఈ యూనిట్‌ను నోయిడాకు తరలిస్తున్నట్లు చెప్పారు. ఇది భారత్ పట్ల తమ నిబద్ధత, ఉత్తర ప్రదేశ్‌ను మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌గా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని చెప్పారు.

 Samsung shifts display manufacturing unit from China to UP, praises India

మేకిన్ ఇండియా కార్యక్రమానికి శాంసంగ్ నోయిడా ఫ్యాక్టరీ విజయవంతమైన క్లాసిక్ ఎగ్జాంపుల్ అన్నారు. అలాగే, తమ ఫ్యాక్టరీ ద్వారా యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు. శాంసంగ్ కంపెనీకి ఇప్పుడు, భవిష్యత్తులోను ప్రభుత్వం నుండి అన్ని విధాలా సహకారం ఉంటుందని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.

English summary

చైనా నుండి ఉత్తర ప్రదేశ్‌కు శాంసంగ్ డిస్‌ప్లే యూనిట్: యోగి ఆదిత్యనాథ్‌తో భేటీ | Samsung shifts display manufacturing unit from China to UP, praises India

Samsung has completed the construction of the display manufacturing unit that is shifted from China to Noida in Uttar Pradesh.
Story first published: Monday, June 21, 2021, 21:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X