గత కొంతకాలంగా ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఆర్థిక మందగమనం కొనసాగుతోన్న విషయం తెలిసిందే. రెండు నెలల క్రితం నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకున్న చర్యలతో ఆటో రంగం సహా ఇప్పుడిప్పుడే కాస్త కోలుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఆటో, ఎఫ్ఎంసీజీ, రియాల్టీ తదితర రంగాలు వినిమయం లేక, ఉత్పత్తి తగ్గించిన పరిస్థితుల్లో ఉద్యోగాలు కూడా కోల్పోవాల్సిన పరిస్థితులు. ఈ నేపథ్యంలో తాజాగా పేటీఎం భాగస్వామ్య ఆర్థిక సాంకేతిక సేవల సంస్థ క్రెడిట్‌మేట్ ఓ నివేదికలో షాకింగ్ అంశాలు వెల్లడించింది. 54 శాతం మంది లేట్ పేయర్స్, నాన్-ఎన్పీయేలు అని క్రెడిట్‌మేట్ సర్వేలో తేలింది.

శాలరీ లేక.. వ్యాపారంలో నష్టం వల్ల
శాలరీలు ఆలస్యం వల్ల చాలామంది ఉద్యోగులు లేదా వ్యక్తులు తమ రుణాలు తిరిగి చెల్లించలేకపోతున్నారని ఈ నివేదిక సారాంశం. అదే విధంగా మందగమనం కారణంగా వ్యాపారాల్లో నష్టం వస్తుండటంతో వ్యాపారులు కూడా కట్టలేకపోతున్నారని కూడా పేర్కొంది. గత ఆరు నెలల కాలంలో 30 రాష్ట్రాల్లో 40 రుణ సంస్థలు ఇచ్చిన 2 లక్షల రిటైల్ రుణ ఖాతాలను పరిశీలించింది. ఇందులో చాలా వరకు NBFCలు ఉన్నాయి.

రిటైల్ రుణాలకు ప్రాధాన్యత.. కానీ
ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందగమనం మన దేశంలో కూడా రుణ వసూళ్లపై ప్రభావం చూపుతోందని ఈ నివేదిక పేర్కొంది. అలాగే దేశంలో నిరుద్యోగిత నాలుగు దశాబ్దాల కనిష్టానికి, వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్టానికి పడిపోయింది. దీంతో పాటు కార్పోరేట్ రుణాల గిరాకీ తగ్గి రిటైల్ రుణాలకే బ్యాంకులు ప్రాధాన్యమిస్తున్నాయి. మందగమనం, రిటైల్ రుణాలకు బ్యాంకులు ప్రాధాన్యం ఇవ్వడాన్ని పరిగణలోకి తీసుకుంటే తాజా నివేదిక ప్రకారం ముందు ముందు రుణాల తిరిగి చెల్లింపుపై మరింత ప్రభావం పడే అవకాశముందని చెబుతోంది.

రుణ చెల్లింపుల్లో వైఫల్యం.. వేతనాల ఆలస్యం వల్లే ఎక్కువ
బ్యాంకులు ఎక్కువగా రిటైల్ రుణాలపై దృష్టి పెట్టడం, మందగమంతో రిటైల్ రుణాల వసూళ్లు కష్టంగా మారడం ఇబ్బందికరమేనని అంటున్నారు. రిటైల్ రుణాల వసూళ్లను కింది అంశాలు ప్రధానంగా దెబ్బతీస్తున్నట్లు క్రెడిట్‌మేట్ తెలిపింది.
- వేతనాల ఆలస్యం వల్ల 36 శాతం
- వ్యాపారాల నష్టం లేదా మూసివేత వల్ల 29 శాతం
- వైద్యపరమైన అత్యవసర ఖర్చుల వల్ల13 శాతం
- ఉద్యోగాలు పోవడం వల్ల 12 శాతం
- ఉపాధి కోసం వలసల వల్ల 10 శాతం ఉన్నట్లుగా పేర్కొంది.

పురుషుల కంటే మహిళలు బెట్టర్
రుణాల చెల్లింపుల్లో పురుషుల కంటే మహిళలు నయంగా కనిపిస్తున్నారు. బకాయిల చెల్లింపుల్లో మహిళలు ముందున్నారు. డిఫాల్టర్లలో 82 శాతం పురుషులే కావడం గమనార్హం. అంతేకాదు పేరుకుపోయిన రుణ బకాయిలను పురుషులతో పోలిస్తే మహిళలు 11 శాతం వేగంగా చెల్లిస్తున్నారు.

రుణాల చెల్లింపులో నగరాల పరిస్థితి..
రుణాల చెల్లింపులో ముంబై, అహ్మదాబాద్, సూరత్ పట్టణాలు ముందున్నాయి. అలాగే, ఢిల్లీ, బెంగళూరు, పుణే నగరాలు అధ్వాన్నంగా ఉన్నాయి.

రుణాల చెల్లింపులో రాష్ట్రాల పరిస్థితి..
రుణాల చెల్లింపులో ఒడిశా, చత్తీస్‌గఢ్, బీహార్, గుజరాత్ రాష్ట్రాలు ముందున్నాయి. మధ్యప్రదేశ్, హర్యానా, ఢిల్లీ-ఎన్సీఆర్, తమిళనాడు రాష్టారులు వెనుకబడి ఉన్నాయి. బెస్ట్ పేమెంట్ రేట్‌లో గోవా కూడా ముందుంది.
More From GoodReturns

Jobs: జాబ్స్ రాకపోవడానికి అసలు కారణం ఇదే! యువతలో ఆ ఒక్కటి తక్కువైంది!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..



Click it and Unblock the Notifications