Saj Hotels IPO: దేశీయ స్టాక్ మార్కెట్లో అక్టోబరులోనూ ఐపీవోల కోలాహలం కొనసాగుతూనే ఉంది. అయితే ఈ క్రమంలో ప్రస్తుతం వచ్చిన ఐపీవో మాత్రం ఇన్వెస్టర్లను పూర్తిగా నిరాశకు గురిచేసింది. ఈ పరిణామాలను చూస్తుంటే ప్రస్తుతం ఇన్వెస్టర్లు ఎస్ఎమ్ఈ ఐపీవోల విషయంలో జాగ్రత్తగా పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతున్నట్లు చెప్పుకోవచ్చు.
ఇప్పడు మనం మాట్లాడుకోబోతున్నది ఇన్వెస్టర్లను నిరాశకు గురిచేసిన ఫెయిల్డ్ ఐపీవో సాజ్ హోటల్స్ గురించే. కంపెనీ షేర్లు నేడు ఎన్ఎస్ఈ ఎస్ఎమ్ఈ కేటగిరీలో మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో సాజ్ హోటల్స్ ఐపీవో షేర్లు వాస్తవ ఇష్యూ రేటు కంటే 15 శాతం తగ్గింపు రేటు రూ.55 వద్ద ఒక్కో షేరు మార్కెట్లోకి అడుగుపెట్టాయి. ఈ క్రమంలో డిస్కౌంట్ రేటువద్ద తొలిరోజు మార్కెట్లోకి ఐపీవో షేర్లు అడుగుపెట్టడంతో బెట్టింగ్ వేసిన ఇన్వెస్టర్లు పూర్తిగా నిరాశ చెందారు. దీనికి ముందు గ్రేమార్కెట్లో కంపెనీ షేర్లు ఎలాంటి ప్రీమియం లేకుండా ట్రేడింగ్ కొనసాగించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి గ్రేమార్కెట్లు అనధికారిక పర్యావరణ వ్యవస్థ ఇక్కడ ఆఫర్ సబ్‌స్క్రిప్షన్ కోసం తెరవబడక ముందే షేర్లు ట్రేడింగ్ జరుగుతుంది.

తాజా ఐపీవో ద్వారా కంపెనీ దేశీయ స్టాక్ మార్కెట్ల నుంచి రూ.27.63 కోట్లను సమీకరించింది. ఇందుకోసం పూర్తిగా 42.5 లక్షల తాజా ఈక్విటీ షేర్లను కంపెనీ విక్రయించింది. ఐపీవో రిటైల్ ఇన్వెస్టర్ల కోసం సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 1 వరకు అందుబాటులో ఉంది. ఈ క్రమంలో కంపెనీ తన ఇష్యూ ధరను ఒక్కో షేరుకు రూ.65గా ఉంచింది. అలాగే లాట్ పరిమాణాన్ని 2000 షేర్లుగా నిర్ణయించటంతో రిటైల్ ఇన్వెస్టర్లు కనీసం రూ.1.30 లక్షలు పెట్టుబడిగా పెట్టాల్సి వచ్చింది. కంపెనీ తాజా ఐపీవో ద్వారా సమీకరించిన నిధులను ఇప్పటికే ఉన్న రిసార్ట్‌లను విస్తరించడానికి, వర్కింగ్ క్యాపిటల్ అవసరాలను తీర్చడానికి, సాధారణ కార్పొరేట్ ఖర్చులను కవర్ చేయడానికి ఉపయోగించాలని నిర్ణయించింది. కంపెనీ నిర్వహిస్తున్న రిసార్టులు ఈవెంట్స్, వెడ్డింగ్స్, మీటింగులు నిర్వహించుకునేందుకు వీలుగా ఉన్నాయి.
ఈ ఎస్ఎమ్ఈ ఐపీవో ఇన్వెస్టర్ల నుంచి తక్కువ ప్రతిస్పందనను చూసింది. ఇష్యూ కేవలం 5 సార్లు సబ్‌స్క్రైబ్ అయింది. రిటైల్ ఇన్వెస్టర్ల కోటా 8.6 రెట్లు , నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు కోటా 2 రెట్లు సబ్‌స్క్రిప్షన్ పొందా.. అర్హత కలిగిన సంస్థాగత కొనుగోలుదారులు ఆఫర్‌లో పాల్గొనలేదు.
1981లో స్థాపించబడిన సాజ్ హోటల్స్ హాస్పిటాలిటీ సెక్టార్‌లో రిసార్ట్ వసతి, విల్లా అద్దెలు, రెస్టారెంట్ అండ్ బార్ సేవలను అందిస్తోంది. కంపెనీ మూడు రిసార్ట్‌లను కలిగి ఉంది లేదా లీజుకు తీసుకుంటుంది. రెండింటిని నిర్వహిస్తుండగా, ఒకదానిని ఇతరులకు లీజుకు ఇస్తుంది. ఈ ప్రాపర్టీలు సమావేశాలు, వివాహాలు వంటి ఈవెంట్‌లకు వేదికలుగా కూడా పనిచేస్తాయి. సాజ్ హోటల్స్ మై ఓన్ రూమ్స్ డాట్ ఇన్ ప్రైవేట్ లిమిటెడ్‌లో 50 శాతం పెట్టుబడిని కలిగి ఉంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications