Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!
భారతీయ రైల్వే ప్రయాణికులకు ఒక కీలక అప్ డేట్. భారతీయ రైల్వే శాఖ టికెట్ బుకింగ్ , రీఫండ్ ప్రక్రియలో కీలక మార్పులను తీసుకువచ్చింది. 2026 ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 15 మధ్య ఈ కొత్త నిబంధనలు పూర్తిస్థాయిలో అమలులోకి రానున్నాయి. ఇందులో ఏయే మార్పులున్నాయంటే..
ఇకపై ట్రైన్ టికెట్ క్యాన్సిలేషన్ (Ticket cancellation) చేసే సమయాన్ని బట్టి వచ్చే రీఫండ్ మొత్తంలో ఇప్పుడు గణనీయమైన మార్పులు ఉండబోతున్నాయి. దళారీల ఆగడాలను అరికట్టడానికి, సామాన్య ప్రయాణికులకు సీట్లు అందుబాటులో ఉంచేందుకు రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుంది.

సమయాన్ని బట్టి చార్జీలు..
కొత్త నిబంధనల ప్రకారం, మీరు రైలు బయలుదేరడానికి ఎంత ముందుగా టికెట్ రద్దు చేసుకుంటారనే దానిపై మీ రీఫండ్ ఆధారపడి ఉంటుంది..
- 72 గంటల కంటే ముందు: ప్రయాణ సమయానికి 72 గంటల కంటే ముందే టికెట్ క్యాన్సిల్ చేస్తే, కేవలం నిర్ణీత ఫ్లాట్ క్యాన్సిలేషన్ చార్జీలు మాత్రమే కట్ అవుతాయి. మిగిలిన గరిష్ట మొత్తం రీఫండ్ వస్తుంది.
- 72 నుండి 24 గంటల మధ్య: ఈ సమయంలో టికెట్ రద్దు చేస్తే, మీ టికెట్ ధరలో 25 శాతం మొత్తం కట్ అవుతుంది.
- 24 నుండి 8 గంటల మధ్య: ప్రయాణానికి ఒక రోజు ముందు నుండి 8 గంటల లోపు టికెట్ రద్దు చేస్తే, ఏకంగా 50 శాతం చార్జీలు కట్ అవుతాయి.
- 8 గంటల లోపు: రైలు బయలుదేరడానికి 8 గంటల కంటే తక్కువ సమయం ఉన్నప్పుడు లేదా రైలు కదిలిన తర్వాత టికెట్ క్యాన్సిల్ చేస్తే పైసా రీఫండ్ రాదు.
బోర్డింగ్ పాయింట్ మార్చుకునే వెసులుబాటు
నిబంధనలు కఠినతరం చేసినప్పటికీ, బోర్డింగ్ పాయింట్ విషయంలో రైల్వే ప్రయాణికులకు పెద్ద ఊరటనిచ్చింది. గతంలో చార్ట్ తయారైన తర్వాత బోర్డింగ్ పాయింట్ మార్చుకునే అవకాశం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు రైలు బయలుదేరడానికి కేవలం 30 నిమిషాల ముందు వరకు కూడా మీరు ఎక్కాల్సిన స్టేషన్‌ను మార్చుకోవచ్చు. ఒకే నగరంలో వేర్వేరు స్టేషన్లు ఉన్నప్పుడు ఇది ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.
నిబంధనలు ఎందుకు కఠినతరం చేశారు?
చాలామంది ఏజెంట్లు లేదా దళారులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకుని, చివరి నిమిషంలో క్యాన్సిల్ చేయడం వల్ల రైల్వేకు నష్టం కలగడమే కాకుండా, అవసరమైన ప్రయాణికులకు సీట్లు దొరకడం లేదు. ఈ టికెట్ మాఫియాకు అడ్డుకట్ట వేయడమే ఈ కొత్త మార్పుల ప్రధాన ఉద్దేశమని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. గతంలో 48 గంటలు, 12 గంటల విండో ఉండేది. కానీ, ఇప్పుడు ఆ విండోను 72 గంటలకు పెంచి రీఫండ్ రూల్స్ మార్చారు.
ప్లానింగ్ ముఖ్యం
ఇండియన్ రైల్వేస్ తీసుకువచ్చిన ఈ మార్పుల వల్ల ప్రయాణికులు తమ ప్రయాణాలను మరింత పక్కాగా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ప్రయాణం రద్దు చేసుకోవాలనుకుంటే, కనీసం మూడు రోజుల ముందే నిర్ణయం తీసుకోవడం వల్ల ఆర్థికంగా నష్టపోకుండా ఉండవచ్చు. అలాగే వెయిటింగ్ లిస్ట్ టికెట్ల విషయంలో పాత నిబంధనలే కొనసాగుతున్నాయి. రైలు 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే లేదా రద్దయితే మాత్రమే పూర్తి రీఫండ్ లభిస్తుంది. కాబట్టి ప్రయాణానికి సిద్ధమయ్యే ముందు ఈ టికెట్ క్యాన్సిలేషన్ (Ticket cancellation) రూల్స్ గుర్తుంచుకోవడం మంచిది.


Click it and Unblock the Notifications