Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు (మార్చి 29) తులం గోల్డ్ రేట్ ఎంతంటే?
భారతీయ మార్కెట్ లో ఈరోజు బంగారం, వెండి ధరలు స్వల్ప పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్ సంకేతాలు, రూపాయి విలువలో మార్పులు , పెళ్లిళ్ల సీజన్ కారణంగా పెరిగిన డిమాండ్ వెరసి బంగారం ధరలు (Gold prices) మళ్ళీ పుంజుకున్నాయి. కేవలం పెట్టుబడిగా మాత్రమే కాకుండా.. సాంస్కృతిక ప్రాముఖ్యత కలిగిన ఈ విలువైన లోహాల ధరలు ఇప్పుడు సామాన్యులకు సవాలుగా మారుతున్నాయి.

నేటి బంగారం ధరలు (గ్రాముకు)
నేడు మార్చి 29 నాటి సమాచారం ప్రకారం.. దేశవ్యాప్తంగా 24 క్యారెట్ల (99.9 ప్యూరిటీ) బంగారం ధర గ్రాముకు రూ. 14,472 వద్ద ఉండగా, ఆభరణాల తయారీలో వాడే 22 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ. 13,266 వద్ద కొనసాగుతోంది.
నగరాల వారీగా ధరల వ్యత్యాసాన్ని పరిశీలిస్తే..
- ఢిల్లీ: 24 క్యారెట్ల బంగారం రూ. 14,487 , 22 క్యారెట్లు రూ. 13,281 గా ఉంది.
- ముంబై & కోల్‌కతా: ఇక్కడ 24 క్యారెట్లు రూ. 14,472 , 22 క్యారెట్లు రూ. 13,266 వద్ద ఉన్నాయి.
- చెన్నై: ఇక్కడ డిమాండ్ ఎక్కువగా ఉండటంతో ధరలు కూడా ఎక్కువే. 24 క్యారెట్లు రూ. 14,652 కాగా, 22 క్యారెట్లు రూ. 13,431 గా ఉంది.
- హైదరాబాద్: ఇక హైదరాబాద్ విషయానికొస్తే.. ఇక్కడ 24 క్యారెట్ల బంగారం ధర గ్రాముకు రూ.14,809, 22 క్యారెట్ల బంగారం ధర రూ.13,575 గాఉంది.
స్థానిక పన్నులు , రవాణా ఖర్చుల కారణంగా ఈ ధరల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు.
వెండి ధరల పరిస్థితి ఏంటి?
బంగారంతో పోటీ పడుతూ వెండి ధరలు కూడా బలంగా దూసుకుపోతున్నాయి. పారిశ్రామిక అవసరాలు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ , సోలార్ ఎనర్జీ రంగాల్లో డిమాండ్ పెరగడం వల్ల వెండి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నాయి. ప్రస్తుతం కిలో వెండి (999 ప్యూరిటీ) ధర రూ. 2,49,900 వద్ద ట్రేడ్ అవుతోంది. రిటైల్ మార్కెట్‌లో 10 గ్రాముల వెండి ధర సుమారు రూ. 2,399 గా ఉంది.
ధరల పెరుగుదలకు కారణాలు
అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు, ద్రవ్యోల్బణం , భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారంపై ప్రభావాన్ని చూపుతున్నాయి. ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో నెలకొన్న అనిశ్చితి వల్ల ఇన్వెస్టర్లు సురక్షితమైన పెట్టుబడిగా భావించే బంగారం వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రపంచ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ప్రస్తుతం ఔన్సుకు 4,489 డాలర్ల వద్ద ఉంది. అలాగే, రష్యా తన సెంట్రల్ బ్యాంక్ నిల్వల నుండి బంగారాన్ని విక్రయిస్తుందనే వార్తలు కూడా మార్కెట్ సరఫరాపై ప్రభావం చూపుతున్నాయి.
భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
నిపుణుల అంచనా ప్రకారం, రానున్న రోజుల్లో గోల్డ్ రేట్లు మరింత ఒడిదుడుకులకు లోనయ్యే అవకాశం ఉంది. అమెరికా డాలర్ విలువ పెరగడం లేదా తగ్గడం, వడ్డీ రేట్లపై తీసుకునే నిర్ణయాలు బంగారం ధరను శాసిస్తాయి. అయితే, పెళ్లిళ్ల సీజన్ కావడంతో భారత్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ధరలు స్వల్పంగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కొనుగోలుదారులు ప్రస్తుత ధరలను గమనిస్తూ, సరైన సమయంలో పెట్టుబడి పెట్టడం ఉత్తమం.


Click it and Unblock the Notifications