For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఊహించిన దానికంటే భారత్ రికవరీ వేగం: S&P జీడీపీ క్షీణత అంచనా ఎంతంటే

|

2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత జీడీపీ వృద్ధి మైనస్ 7.7 శాతంగా నమోదు కావొచ్చునని ఎస్ అండ్ పీ గ్లోబల్ రేటింగ్స్ అంచనా వేసింది. ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే వేగంగా పుంజుకుంటోందని, ఈ నేపథ్యంలో గతంలో ప్రకటించిన మైనస్ 9 శాతం అంచనాను సవరించినట్లు తెలిపింది. వచ్చే ఏడాది మాత్రం వృద్ధి రేటు 10 శాతం వరకు ఉంటుందని అంచనా వేసింది. భారత ఆర్థికవ్యవస్థ వేగంగా రికవరీ బాట పడుతోందని, చెబుతూ వివిధ రేటింగ్ ఏజెన్సీలు అంచనాలను సవరిస్తున్నాయి. తాజాగా ఎస్ అండ్ పీ మరోసారి కాస్త సానుకూలంగా సవరించింది.

Union Budget: ఇవి పరిష్కారమయ్యేలా... నిర్మలమ్మకు కీలక ప్రతిపాదనలుUnion Budget: ఇవి పరిష్కారమయ్యేలా... నిర్మలమ్మకు కీలక ప్రతిపాదనలు

అందుకే అంచనాల సవరణ

అందుకే అంచనాల సవరణ

2021-22 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి తిరిగి గాడిలో పడటంతో పాటు ఏకంగా 10 శాతం నమోదు చేయవచ్చునని ఎస్ అండ్ పీ అంచనా వేసింది. డిమాండ్ పుంజుకోవడం, కరోనా వ్యాప్తి రేటు తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ గతంలో అనుకున్న దాని కంటే వేగంగా పుంజుకుంటోందని, అందుకే వృద్ధి రేటును సవరించినట్లు ఎస్ అండ్ పీ తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో వృద్ధి రేటు మైనస్ 23.9 శాతంగా నమోదు చేసిన విషయం తెలిసిందే. రెండో త్రైమాసికంలో మైనస్ 9 శాతం నుండి మైనస్ 13 శాతం వరకు రేటింగ్ ఏజెన్సీలు అంచనా వేసినప్పటికీ మైనస్ 7.5 శాతంగా నమోదయింది. అంచనాల కంటే కాస్త సానుకూలంగా ఉంది. అదే సమయంలో కార్యకలాపాల వేగంగా పెరుగుతున్నాయి. దీంతో రేటింగ్ ఏజెన్సీలు అంచనాలు సవరిస్తున్నాయి.

సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లినా..

సాంకేతికంగా మాంద్యంలోకి వెళ్లినా..

వరుసగా రెండు త్రైమాసికాలు భారత ఆర్థిక వ్యవస్థ ప్రతికూలంగా నమోదు చేయడంతో సాంకేతికంగా ఆర్థిక మాంద్యంలోకి వెళ్లింది. సాంకేతికతను పక్కన పెడితే రికవరీ వేగవంతమైంది. తయారీ, ఆర్థిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించిన తర్వాత స్థూల ఆర్థిక సూచీలు పెరిగాయి. ఆసియా పసిఫిక్ దేశాల మార్గంలోనే భారత్ వేగంగా కోలుకుంటోందని ఎస్ అండ్ పీ తెలిపింది.

ఇతర రేటింగ్ ఏజెన్సీలు...

ఇతర రేటింగ్ ఏజెన్సీలు...

ఫిచ్ రేటింగ్స్ కూడా 2020-21 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటును మైనస్ 10.5 శాతం నుండి మైనస్ 9.4 శాతానికి సవరించింది. ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు గతంలో మైనస్ 9 శాతంగా అంచనా వేయగా, ఇప్పుడు మైనస్ 8 శాతంగా అంచనా వేసింది.

English summary

ఊహించిన దానికంటే భారత్ రికవరీ వేగం: S&P జీడీపీ క్షీణత అంచనా ఎంతంటే | S and P revises India's FY21 GDP contraction forecast to 7.7 percent

S&P Global Ratings on Tuesday raised India's growth projection for the current fiscal to (-) 7.7 per cent from (-) 9 per cent estimated earlier on rising demand and falling COVID infection rates.
Story first published: Wednesday, December 16, 2020, 9:28 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X