For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లు భారీగా పెరిగాయి, 79,669కి పైగా నోట్లు

|

గత ఆర్థిక సంవత్సరంలో రూ.500 వ్యాల్యూ కలిగిన నోట్లలో 79,669 వరకు నకిలీ నోట్లను గుర్తించినట్లు ఆర్బీఐ తన వార్షిక నివేదికలో వెల్లడించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే నకిలీ నోట్ల సంఖ్య రెట్టింపు అయింది. రూ.2000 నకిలీ నోట్లను 13,604 గుర్తించారు. 2020-21తో పోలిస్తే 54.6 శాతం పెరిగాయి. 2021-22లో అన్ని వ్యాల్యూ నోట్లు కలిపి మొత్తంగా 2,30,971 నకిలీ నోట్లను గుర్తించింది.

2020-21లోని 2,08,625తో పోలిస్తే భారీగా పెరిగాయి. 2019-20లో మొత్తం నకిలీ నోట్ల సంఖ్య 2,96,695గా నమోదయింది. రూ.10, రూ.20, రూ.500, రూ.2000 వ్యాల్యూ కలిగిన నోట్ల సంఖ్య వరుసగా 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం, 101.90 శాతం, 54.+ శాతం మేర పెరిగినట్లు ఆర్బీఐ నివేదిక తెలిపింది.

Rs 500 fake currency notes surge 102% in FY22

అయితే రూ.50, రూ.100 వ్యాల్యూ కలిగిన నకిలీ నోట్లు వరుసగా 28.7 శాతం, 16.7 శాతం మేర తగ్గాయి. 2021-22లో నమోదైన మొత్తం నకిలీ నోట్లలో 6.9 శాతం నోట్లను ఆర్బీఐ గుర్తించింది. మిగతా 93.1 శాతం నోట్లను ఇతర బ్యాంకులు గుర్తించాయి.

English summary

రూ.500 ఫేక్ కరెన్సీ నోట్లు భారీగా పెరిగాయి, 79,669కి పైగా నోట్లు | Rs 500 fake currency notes surge 102% in FY22

After falling in 2020-21, counterfeit notes recorded a 10.7 per cent uptick in 2021-22, with the Rs 500 denomination fake notes rising by 102 per cent.
Story first published: Tuesday, May 31, 2022, 10:29 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X