For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చైనాకు కెమికల్స్‌కు చెక్! రూ.25వేలకోట్ల మేర ఆదా

|

భద్రతా కారణాలతో చైనాకు చెందిన యాప్స్ పైన భారత ప్రభుత్వం నిషేధం విధించింది. ఆత్మనిర్భర్ భారత్ పేరుతో సాధ్యమైనంత వరకు దిగుమతులు తగ్గించుకోవాలని కూడా నిర్ణయించింది. భారతీయులు కూడా చైనా వస్తువులను కొనుగోలు చేయడం చాలా వరకు తగ్గించారు. ఆటోమొబైల్ నుండి కెమికల్స్ వరకు ఎన్నో వస్తువుల దిగుమతులు తగ్గించాలని ఆయా రంగాలు భావిస్తున్నాయి. చైనా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడానికి భారత్ ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది.

మూడు కంపెనీలతో 'గ్లోబల్': టిక్‌టాక్‌కు ట్రంప్ మరింత గడువు, ఎందుకంటే?మూడు కంపెనీలతో 'గ్లోబల్': టిక్‌టాక్‌కు ట్రంప్ మరింత గడువు, ఎందుకంటే?

రూ.25వేల కోట్ల మేర ఆదా

రూ.25వేల కోట్ల మేర ఆదా

కెమికల్ దిగుమతులను తగ్గించాలని భావిస్తోంది. దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు వారికి ప్రత్యేక రాయితీలు ఇచ్చేందుకు సిద్ధమైంది. కెమికల్స్ దిగుమతులు తగ్గింపులో భాగంగా 75 కీలక కెమికల్స్ జాబితాను రూపొందించారు. ఉత్పత్తి వ్యాల్యూలో 10 శాతం రాయితీ ఇచ్చే ప్రతిపాదన కూడా ఉంది. ఈ కెమికల్స్ దిగుమతులు తగ్గించడం వల్ల అయిదేళ్ల కాలంలో రూ.25వేల కోట్ల మేరా ఆదా కానుంది.

 1.5 లక్షల కోట్ల దిగుమతులు

1.5 లక్షల కోట్ల దిగుమతులు

భారత్‌కు దిగుమతి అయ్యే కెమికల్స్ రూ.1.5 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇందులో 85 శాతం నుండి 90 శాతం వరకు కెమికల్స్ చైనా నుండి దిగుమతి అవుతాయని అధికారులు చెబుతున్నారు. ఈ కెమికల్స్‌ను యాక్టివ్ ఫార్మాస్యూటికల్స్ ఇంగ్రిడియెంట్స్, ఇతర పరిశ్రమ రంగాల్లో ఉపయోగిస్తారు. కెమికల్స్ ఎసెన్షియల్ ఉత్పత్తులు. ఇవి వివిధ రకాల మెడిసిన్స్‌లో ఉపయోగిస్తారు.

పీఎల్ఐ స్కీం

పీఎల్ఐ స్కీం

దిగుమతి అయ్యే కెమికల్స్‌లో చైనా వాటానే ఎక్కువగా ఉంటుందని, ఈ నేపథ్యంలో దేశీయ తయారీదారులను ప్రోత్సహించేందుకు ఇప్పటికే పీఎల్ఐ స్కీం ప్రారంభించినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక్కడ తయారు చేసుకోగలిగిన కెమికల్స్ కోసం చైనా సహా ఇతర దిగుమతులపై ఆధారపడటం సరికాదని భావిస్తున్నట్లు చెబుతున్నారు. అంతేకాదు, పీఎల్ఐ స్కీం కోసం కెమికల్ డిపార్టుమెంట్ కమిటీని వేసింది. దీనిపై అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది.

English summary

చైనాకు కెమికల్స్‌కు చెక్! రూ.25వేలకోట్ల మేర ఆదా | Rs.25,000 crore plan to cut dependence of China for key chemicals

With the aim to reduce dependence on China for import of chemicals, the government is planning a production linked incentive scheme to boost local manufacturing of some of the key chemicals used in pharmaceuticals, insecticides and in other critical industrial usage, sources said.
Story first published: Sunday, September 20, 2020, 21:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X