For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ టాప్ 100 జాబితాలోకి డి-మార్ట్ దమానీ, 5గురు భారతీయులకు చోటు

|

డిమార్ట్ అధినేత, సెలబ్రిటీ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్, బిలియనీర్ రాధాకిషన్ ధమాని ప్రపంచ టాప్ 100 కుబేరుల జాబితాలో చోటు దక్కించుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ ప్రకారం ఈ జాబితాలో 97వ స్థానం దక్కించుకున్న దమానీ నికర ఆదాయం 19.3 బిలియన్ డాలర్లుగా ఉంది. బ్లూమ్‌బర్గ్ టాప్ 100 కుబేరుల తాజా జాబితాలో ఐదుగురు భారతీయులకు చోటు దక్కింది. ఇందులో రిటైల్ సూపర్ మార్కెట్ చైన్ డిమార్ట్ ప్రమోటర్ ఆర్కే దమానీ తొలిసారి టాప్ 100లో చోటు దక్కించుకున్నారు.

1930 కోట్ల డాలర్ల అంటే మన కరెన్సీలో దాదాపు రూ.1,42,540 కోట్లు ఆదాయంతో 97వ స్థానంలో నిలిచారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ టాప్ 100 ఇండెక్స్ ప్రకారం రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ 8,238 కోట్ల డాలర్ల ఆస్తులతో 12వ స్థానంలో నిలిచారు. అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ 5,458 కోట్ల డాలర్ల ఆస్తులతో 24వ స్థానంలో నిలిచారు. 3,718 కోట్ల డాలర్ల ఆస్తులతో విప్రో అధినేత అజీమ్ ప్రేమ్‌జీ 36వ స్థానంలో, 2,858 కోట్ల డాలర్ల ఆస్తులతో HCL శివనాడార్ 52వ స్థానంలో, 2,248 కోట్ల డాలర్ల ఆస్తులతో లక్ష్మీ మిట్టల్‌75వ స్థానంలో నిలిచారు.

ఆర్కే దమానీ రిటైల్ వ్యాపారంలోకి అడుగు పెట్టడానికి ముందు 1990లలో పెద్ద ఎత్తున వ్యాల్యూ ఓరియెంటెడ్ స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేశారు. ఆ తర్వాత రిటైల్ వ్యాపారం డి-మార్ట్‌ను స్థాపించారు. 2021లో డీమార్ట్ ఆదాయం 28 శాతం ఎగబాకి 4.3 బిలియన్ డాలర్లకు చేరుకుంది. డీ-మార్ట్ మాతృసంస్థ అవెన్యూ సూపర్ మార్ట్స్. అవెన్యూ సూర్ మార్ట్స్‌లో దమానీ వాటానే ఎక్కువ. ఈ స్టాక్ 2021 క్యాలెండర్ ఏడాదిలో 32 శాతం ఎగబాకింది. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది వ్యాపారం కాస్త తగ్గింది. ఎకానమీ రీ-ఓపెనింగ్‌తో బిజినెస్ మళ్ళీ పెరిగింది. ఇన్వెస్టర్లు స్టాక్స్ పెంచుకోవడం, కరోనా సెకండ్ వేవ్ అనంతరం ఎకానమీ తిరిగి తెరుచుకున్న నేపథ్యంలో ఈ స్టాక్ అదరగొట్టింది.

RK Damani breaks into list of worlds top 100 richest people

ఆర్కే దమానీ డీమార్ట్‌కు అధిక సమయం కేటాయించినప్పటికీ తన వ్యక్తిగత పెట్టుబడులు మాత్రం కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ బిలియనీర్ ఇన్వెస్టర్ గత రెండేళ్ల కాలంలో ఇండియా సిమెంట్‌లో 12.7 శాతం వాటాతో రూ.674 కోట్లు ఇన్వెస్ట్ చేశారు. దమానీ సంపద ఇలాగే పెరుగుతుంటే ఆయన లక్ష్మీ మిట్టల్ సమీపించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రపంచ కుబేరుల జాబితా విషయానికి వస్తే వరుసగా...

- 1 ఎలాన్ మస్క్ $188 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $5.70 బిలియన్లు పెరిగాయి. 2021 క్యాలెండర్ ఏడాదిలో $18.3 బిలియన్ డాలర్లు పెరిగింది. ఎలాన్ మస్క్ టెస్లా అమెరికా టెక్నాలజీ కంపెనీ.
- 2 జెఫ్ బెజోస్ $2.11 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $2.11 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $3.69 బిలియన్ డాలర్లు తగ్గింది.
- 3 బెర్నార్డ్ అర్నాల్ట్ $168 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $8.16 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $53.3 బిలియన్ డాలర్లు పెరిగింది. ఇది ప్రాన్స్ కన్స్యూమర్ కంపెనీ.
- 4 బిల్ గేట్స్ $149 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $821 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $17.1 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 5 మార్క్ జుకర్‌బర్గ్ $132 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $1.09 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $28.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 6 లారీ పేజ్ $121 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $797 మిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $39.0 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 7 సిర్జీ బిన్ $117 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $739 మిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $37.5 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 8 స్టీవ్ బాల్మర్ $104 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $808 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $23.7 బిలియన్ డాలర్లు పెరిగింది.
- 9 వారెన్ బఫెట్ $104 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $1.16 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $16.4 బిలియన్ డాలర్లు పెరిగింది.
- లారీ ఎలిషన్ $102 బిలియన్ల సగటు ఆదాయం కలిగి ఉన్నారు. గత ఏడాదితో పోలిస్తే $1.43 బిలియన్లు తగ్గింది. 2021 క్యాలెండర్ ఏడాదిలో $22.3 బిలియన్ డాలర్లు పెరిగింది.

భారత్ నుండి ముఖేష్ అంబానీ 82.2 బిలియన్ డాలర్ల నికర ఆదాయంతో 12వ స్థానంలో నిలిచారు. ఈ ఏడాది అంబానీ సంపద 5.96 బిలియన్ డాలర్లు పెరిగింది. గౌతమ్ అదానీ నికర సంపద 55.8 బిలియన్ డాలర్లుగా ఉంది. ఈ ఏడాది 22 బిలియన్ డాలర్ల సంపద పెరిగింది. 36.9 బిలియన్ డాలర్లతో అజీమ్ ప్రేమ్ జీ 36వ స్థానంలో నిలిచారు. ఆయన సంపద 11.6 బిలియన్ డాలర్లు పెరిగింది. శివ నాడర్ ఆదాయం 28.4 బిలియన్ డాలర్లుగా ఉంది. గత ఏడాదితో పోలిస్తే 4.23 బిలియన్ డాలర్లు పెరిగింది. ఈయన 52వ స్థానంలో ఉన్నారు. 22.5 బిలియన్ డాలర్లతో లక్ష్మీ మిట్టల్ 71వస్థానంలో నిలిచారు. ఆయన సంపద ఈ ఏడాది 6.09 బిలియన్ డాలర్లు పెరిగింది.

English summary

వరల్డ్ టాప్ 100 జాబితాలోకి డి-మార్ట్ దమానీ, 5గురు భారతీయులకు చోటు | RK Damani breaks into list of world's top 100 richest people

D-Mart owner Radhakishan Damani has broken into the top 100 of the world’s richest people.
Story first published: Thursday, August 19, 2021, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X