For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ముఖేష్ అంబానీ తగ్గట్లేదుగా: యుఏఈలో కొత్త కంపెనీ: సహజ వనరుల కోసమేనా?

|

ముంబై: దేశీయ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీ.. తన వ్యాపార సామ్రాజ్యాన్ని మరింత విస్తరించుకుంటున్నారు. ఇన్ని సంవత్సరాలుగా భారత్ కేంద్రంగా తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగించిన ఆయన.. ఇక యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌ వరకు తన పరిధిని విస్తరించుకున్నారు. ఎమిరేట్స్ రాజధాని అబుధాబి ప్రధాన కేంద్రంగా కొత్తగా మరో కంపెనీని నెలకొల్పారు. దీని పేరు రిలయన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్.

భారత్‌లోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ సబ్సిడయరీ కంపెనీగా ఇది తన వ్యాపార కార్యకలాపాలను కొనసాగిస్తుంది. ఈ మేరకు స్టాక్ మార్కెట్‌లో ఈ మధ్యాహ్నం దీనికి సంబంధించిన డాక్యుమెంట్లను అందజేసింది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్. రిలయన్స్ ఇండటర్నేషనల్ లిమిటెడ్‌లో ప్రారంభ పెట్టుబడి కింద 7.42 కోట్ల రూపాయలను పెట్టినట్టు తెలిపింది. 10 లక్షల షేర్లను ఇంటర్నేషనల్ లిమిటెడ్‌కు బదలాయించినట్లు పేర్కొంది.

RIL has incorporated a Reliance International Limited in Abu Dhabi in UAE

క్రూడాయిల్ వెలికితీత, పెట్రోలియం ఆధారిత ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్, అగ్రికల్చరల్ కమోడిటీస్ ప్రధాన కార్యకలాపాలుగా ఈ రిలయన్స్ ఇంటర్నేషనల్స్ లిమిటెడ్ కొనసాగుతుందని స్పష్టం చేసింది. బిజినెస్ ఆపరేషన్స్ ఇంకా ప్రారంభం కావాల్సి ఉందని స్టాక్ మార్కెట్‌లో ఫైల్ చేసిన తన తాజా డాక్యుమెంట్లలో పొందుపరిచింది. కాగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రభుత్వ ఆధీనంలో పని చేస్తోన్న అబుధాబి నేషనల్ ఆయిల్ కంపెనీలో భారత్‌కు చెందిన ఓ టాప్ కంపెనీ పెట్టుబడులు పెట్టబోతోందంటూ జూన్‌లో ఓ ప్రకటన వెలువడింది.

దీనికి అనుగుణంగా రిలయన్స్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ తెర మీదికి వచ్చింది. ప్రమోటర్ లేదా ప్రమోటర్ గ్రూప్ లేదా గ్రూప్ ఆఫ్ కంపెనీలకు సంబంధించిన పెట్టుబడుల మీద వచ్చే వడ్డీతో దీన్ని నడపట్లేదని స్పష్టం చేసింది. అలాగే- ఈ కంపెనీని నెలకొల్పడానికి ప్రభుత్వాలు, లేదా రెగ్యులేటరీ అనుమతి కూడా అవసరం లేదని స్పష్టం చేసింది. ఈ కంపెనీ ఎప్పటి నుంచి తన కార్యకలాపాలను ప్రారంభిస్తుందనేది ఇంకా తెలియరావాల్సి ఉంది.

గుజరాత్‌కు చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్.. చమురు, సహజవాయు నిక్షేపాల వెలికితీత సెగ్మెంట్‌లో తిరుగులేని కంపెనీగా ఆవిర్భవించిన విషయం తెలిసిందే. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ రిఫైనింగ్ కాంప్లెక్స్‌ను గుజరాత్‌లో నెలకొల్పిందా సంస్థ. క్రమంగా తన వ్యాపారాన్ని రిటైలింగ్ సెక్టార్‌కు కూడా మళ్లించింది. రిలయన్స్ బ్రాండ్ నేమ్‌తో రిటైల్ సెగ్మెంట్‌లో పలు సూపర్ మార్కెట్లను నెలకొల్పింది. దేశవ్యాప్తంగా అన్ని ప్రధాన నగరాలు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ వెలిశాయి రిలయన్స్ సూపర్ మార్కెట్స్.

English summary

ముఖేష్ అంబానీ తగ్గట్లేదుగా: యుఏఈలో కొత్త కంపెనీ: సహజ వనరుల కోసమేనా? | RIL has incorporated a Reliance International Limited in Abu Dhabi in UAE

Reliance Industries Ltd (RIL) on Saturday said that it has incorporated a wholly-owned subsidiary Reliance International Limited (RINL) in Abu Dhabi global market, United Arab Emirates (UAE).
Story first published: Saturday, October 2, 2021, 18:48 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X